పోస్ట్‌మన్ పోస్టుకు దారి..


Education News
పోస్ట్‌మన్ / మెయిల్ గార్డ్ పరీక్ష సక్సెస్ టిప్స్
కేవలం పదోతరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరడానికి అవకాశం కల్పిస్తూ మరో ప్రకటన ముందుకొచ్చింది. అసలే నోటిఫికేషన్లు లేని అనిశ్చితి పరిస్థితుల్లో ఈ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దానికి తోడు పదోతరగతి అర్హత కావడంతో పోటీ మూడింతలు పెరిగే అవకాశం ఉంది. ఇంటర్, డిగ్రీ, పీజీతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారు. 301 పోస్టుల్లో మనమొక్కటి దక్కించుకోవాలంటే పక్కాగా ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. ఏ పుస్తకాలు చదవాలి? ఏ అంశాలు చదవాలి? పాతప్రశ్న పత్రాలు ఎక్కడ దొరుకుతాయి?, మోడల్ పేపర్స్ ప్రాక్టిస్ చేస్తే లాభమేంటి? వంటి సందేహాలకు సమాధానం కావాలంటే చదవాల్సిందే..
పోస్టల్ శాఖ గురించి సంక్షిప్తంగా..
భారతీయ తపాలా శాఖ దాదాపు 250 ఏళ్ల చరిత్ర కలిగి మారుమూల ప్రాంతాల్లో సైతం తన సేవలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 పోస్టల్ సర్కిళ్లలో లక్షా యాభై ఐదువేల పోస్టాఫీసులను కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ నెట్‌వర్క్‌గా అవతరించింది. మన దేశంలో సగటున ప్రతి 7,175 మందికి ఒక పోస్టాఫీసు ఉంది. ఉత్తరాలు, నోటీసులు చేరవేయడం, పార్శిల్స్ అందచేయడం, మనీ ఆర్డర్లు ఇవ్వడంతో పాటు తపాలా శాఖ పొదుపు పథకాలు, బీమా సేవలు, మ్యూచ్‌వల్ ఫండ్‌‌స, ఫారెన్ ఎక్సేంజ్, ఉపాధి కూలీలు, వృద్ధాప్య ఫించన్ల పంపిణీ వంటి కార్యకలాపాలు ప్రారంభించింది. త్వరలోనే బ్యాంకింగ్ రంగంలోకి కూడా అడుగు పెట్టనుంది.

పోస్ట్‌మన్ విధులు.. వేతనం
ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, బ్యాంక్ నోటీసులు, పార్శిళ్లు పంపిణీ చేయడం పోస్ట్‌మన్‌ల ప్రధాన విధి. వీరు ఏదైనా ఉప తపాలా కార్యాలయం కింద నిర్దేశించిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తారు. విధులు సమర్థవంతంగా నిర్వహించాలంటే స్థానికంగా ఉన్న చిరునామాల గురించి అవగాహన ఉంటే సరిపోతుంది. ప్రారంభ వేతనం అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపు రూ. 15,000 ఉంటుంది. అలాగే ప్రభుత్వ సర్వీసుల్లో ఉండే అన్ని సదుపాయాలు పొందవచ్చు.

ఖాళీల వివరాలు

పోస్ట్‌మన్ ఖాళీలు 291
హైదరాబాద్ సిటీ రీజియన్ 97
హైదరాబాద్ రీజియన్ 31
కర్నూలు రీజియన్ 47
విజయవాడ రీజియన్ 78
విశాఖపట్నం రీజియన్ 38
మెయిల్ గార్డ్ ఖాళీలు 10
మొత్తం ఖాళీలు 301


విద్యార్హతలు: పదోతరగతి / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత
వయో పరిమితి: ఆగస్టు 18, 2014 నాటికి 18-27 సంవత్సరాలు (ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు రుసుం: ఓసీ / ఓబీసీ రూ. 400, ఎస్సీ/ఎస్టీ రూ.100, మహిళలందరికి రూ.100.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌లో తెలిపిన పోస్టాఫీసుల్లో ‘‘సునాయాసం’’ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఫీజు కట్టిన కొన్ని గంటల్లో దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ సందేశం వస్తుంది. తర్వాత వెబ్‌సైట్‌లో లాగాన్ అయి నోటిఫికేషన్ చదివిన తర్వాత Click Here to Apply Online బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన దరఖాస్తు పేజీలో పూర్తి వివరాలు నింపి, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ కొట్టాలి. రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత వచ్చే యునిక్ రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 16.01.2015
ఫీజు చెల్లించడానికి చివరి తేది: 16.02.2015
పరీక్ష తేది: త్వరలోనే ప్రకటిస్తారు.
వివరాలకు: www.appost.in/

పరీక్షా విధానం
పదోతరగతి స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రంలో నాలుగు భాగాలుంటాయి. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 ప్రశ్నలుంటాయి . మార్కులు 100. సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు లేవు.

భాగం సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ 25 25
బి మ్యాథమేటిక్స్ 25 25
సి(1) ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 25
సి(2) తెలుగు లాంగ్వేజ్ 25 25
మొత్తం 100 100


క్వాలిఫైయింగ్ మార్కులు:
ప్రతి విభాగంలో నిర్ణీత అర్హత మార్కులు సాధించాలి. అవి

భాగం సబ్జెక్టు ఓసీ ఓబీసీ ఎస్సీ/ఎసీ
జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ 10 9 8
బి మ్యాథమేటిక్స్ 10 9 8
సి(1) ఇంగ్లిష్ లాంగ్వేజ్ 10 9 8
సి(2) తెలుగు లాంగ్వేజ్ 10 9 8
మొత్తం 40 37 33


సిద్ధమవ్వండిలా..
పదోతరగతి అర్హత కాబట్టి పరీక్షలో ప్రశ్నలన్ని ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. కానీ తీవ్ర పోటీ ఉండటం వల్ల పోస్టల్ అసిస్టెంట్స్ పరీక్షలాగా తికమక ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది.

జనరల్ నాలెడ్జ్ (25 మార్కులు):
ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, కంప్యూటర్ యూసేజ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. దేశాల-రాజధానులు-కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు-వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జనగణన 2011 సమాచారం, భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు, చరిత్రలో ముఖ్య సంఘటనలు, ప్రముఖ కవులు-వారి ఆస్థానాలు, కట్టడాలు-నిర్మాతలు, భారత రాజ్యాంగం సవరణలు, కమిటీలు-కమీషన్లు, ముఖ్యమైన ఆపరేషన్లు, వివిధ ఫోబియాలు, వివిధ శాస్త్రాల అధ్యయనం, భారత దేశంలోని వివిధ అవార్డులు, గ్రహీతలు, క్రీడలు - విజేతలు, ప్రదేశాలు, భారతదేశ రాష్ట్రాలు, ప్రముఖ నదీతీర నరగాలు, భారత అంతరిక్ష కార్యక్రమం వంటి జనరల్ నాలెడ్జ్ అంశాలపై దృష్టి సారించాలి. కరెంట్ అఫైర్స్ లో తాజా నియామకాలు, అవార్డులు, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, జాతీయ అంశాలు, సదస్సులు వంటి వాటిని చదవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో నిత్య జీవితంతో ముడిపడి ఉన్న అంశాలు చదవాలి. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. అలాగే జనరల్ సైన్‌‌స అయిన బయాలజీ, ఫిజికల్ సైన్స్, కెమీస్ట్రీ, జియోగ్రఫీ, పాలిటీ, చరిత్ర నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

మ్యాథమేటిక్స్ (25 మార్కులు):
గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. నంబర్ సిస్టమ్స్, సూక్ష్మీకరణలు, కరెక్షన్స్, దశాంశాలు, శాతాలు, రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, భాగస్వామ్యం, మెన్సురేషన్, కాలం-పని, కాలం -దూరం వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్‌ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పుస్తకం సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. సంబంధిత అంశాల్లో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. పోస్టల్ అసిస్టెంట్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పరీక్షల పాతప్రశ్నా పత్రాలను సాధన చేస్తే అవగాహన పెరుగుతుంది.

ఇంగ్లీష్ (25 మార్కులు):
ఈ విభాగంలో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రిపొజిషన్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్, స్పీచెస్, సింగులర్ అండ్ ప్లూరల్, టెన్సెస్, ఆంటోనిమ్స్, సిననిమ్స్ ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ స్పెల్లింగ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. రోజూ 10 కొత్త పదాలు నేర్చుకొని వాటిని వాక్యాలలో ఉపయోగించడం సాధన చేయాలి. ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం లేదా ప్రముఖ ఛానల్‌లో వచ్చే గ్రూప్ డిస్కషన్లను వినడం ఎంతో లాభిస్తుంది. సందేహం ఉన్న పదాలు వెంటనే డిక్షనరీ సహయంతో నివృత్తి చేసుకోవాలి. వ్యతిరేక పదాలు, సమానార్థాలు, వీలైనన్ని ఎక్కువగా చదవాలి. దీనివల్ల వొకాబులరీ అభివృద్ధి చెందటంతో పాటు సరైన ఉచ్ఛారణ అలవడుతుంది. చదువుతున్నప్పుడు కీలక పదాలను నోట్ చేసుకోవాలి. వీలైనన్ని ప్రీవియస్ పేపర్‌‌స ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల సరళి అర్థమై ప్రిపరేషన్ సులువవుతుంది.

రీజనింగ్ (25 మార్కులు):
అభ్యర్థి తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణా శక్తిని పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, అనాలజీ (నంబర్, ఆల్ఫాబెట్, ఫిగర్), సీటింగ్ అరేంజ్‌మెంట్, వెన్‌డయాగ్రమ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సరైన పద్దతిలో సాధన చేస్తే ఈ విభాగంలో అధిక మార్కులు పొందవచ్చు. వీలైనన్ని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల సరళి అర్థమై ప్రిపరేషన్ సులువవుతుంది.

తెలుగు లాంగ్వేజ్:
ప్రసిద్ధ కవులు వారు రాసిన గ్రంథాలు, రచనలు, బిరుదులు గురించి చదవాలి. బాషా భాగాలు, ఛందస్సు, అలంకారాలు, సంధులు, సమాసాలు, సాధన చేయాలి. తెలుగులో అక్షరాలు, వాక్యాలు, అర్థాలు, వ్యతిరేక పదాలు చదవాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు సాధన చేయాలి. స్థానికంగా వాడే పదాలు వాటి అర్థాలు, తెలుగు సంస్కృతి చరిత్ర, తాజా పరిణామాలు, వంటివాటిని కూడా చదవాలి.

రిఫరెన్స్ బుక్స్:
స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్: ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం, మలయాళ మనోరమ ఇయర్‌బుక్, ప్రతియోగితా కిరణ్ మంత్లీ మ్యాగజైన్, ఇతర దినపత్రికలు(సాక్షి)
రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్, న్యూమరికల్ ఎబిలిటీ-ఎస్ చంద్ పబ్లికేషన్స్, క్వికర్ మ్యాథ్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్ పబ్లికేషన్స్
జనరల్ ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం, టాటా మెక్‌గ్రాహిల్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ బుక్, వివిధ ఇంగ్లిష్ దినపత్రికలు
తెలుగు లాంగ్వేజ్: 6 నుంచి పదో తరగతి వరకు తెలుగు పుస్తకాలు, ఏదేని ప్రామాణికమైన తెలుగు వ్యాకరణం పుస్తకం

2014 మే 25న ఇంటర్ అర్హతతో నిర్వహించిన పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాం. వీటిని బట్టి అభ్యర్థులు ప్రశ్నా పత్రం ఏ స్థాయిలో ఉంటుందో ఒక అవగాహనకు రావచ్చు.

జనరల్ నాలెడ్జ్
 1. మానవ సేవ అవార్డు ఎవరి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశారు?
  ఎ)డా.రాజేంద్ర ప్రసాద్
  బి) ఇంధిరాగాంధి
  సి) ఆచార్య వినోభభావె
  డి) రాజీవ్ గాంధీ
  సమాధానం: డి
 2. ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
  ఎ) అక్టోబర్ 15
  బి)అక్టోబర్ 19
  సి) అక్టోబర్ 12
  డి) అక్టోబర్ 16
  సమాధానం: డి
 3. అకాడమీ అవార్డుకు మరో పేరు?
  ఎ)మ్యాథ్యూస్ అవార్డు
  బి) ఆస్కార్ అవార్డు
  సి) బాఫ్టా అవార్డు
  డి) పామ్స్ డి అఫైర్
  సమాధానం: బి
 4. కింది వాటిలో నంబర్ కీ ప్యాడ్‌పై లేని కీ ఏది?
  (A) Ctrl
  (B) Del
  (C) Enter
  (D) Num Lock
  సమాధానం: ఎ
 5. వైశాల్యపరంగా భారత్ ప్రపంచంలో ఎన్నో పెద్దదేశం?
  ఎ)2
  బి) 7
  సి) 4
  డి) 5
  సమాధానం: బి

మ్యాథమేటిక్స్

 1. If 30% of A = 20% of B, then find the value of A : B.?
  (A) 1 : 3
  (B) 3 : 2
  (C) 3 : 1
  (D) 2 : 3
  సమాధానం: డి
 2. Find the value of:783 ÷ 9 × 0.75= ?
  (A) 130
  (B) 124
  (C) 118
  (D) 116
  సమాధానం: డి
 3. Average of ten numbers is 7. If every number is multiplied by 12, what will be the average of new numbers?
  (A) 7
  (B) 9
  (C) 82
  (D) 84
  సమాధానం: డి
 4. A sum of Rs 600 amounts to Rs 720 in 4 years. What will it amount to if the rate of simple interest is increased by 2%?
  (A) Rs 724
  (B) Rs 648
  (C) Rs 768
  (D) Rs 792
  సమాధానం: సి

ఇంగ్లిష్ గ్రామర్

 1. Change the sentence in to Future Tense:
  I have missed a good chance.
  (A) I will miss a good chance
  (B) I will have missed a good chance
  (C) I will be missing a good chance
  (D) I will be missed a good chance.
  Answer: C
 2. Fill in the blank with appropriate given option:
  Who are ……. people that are standing there in the street?
  (A) a
  (B) an
  (C) the
  (D) that
  Answer: C
 3. Antonym for : FEARLESS
  (A) intrepid
  (B) craven
  (C) vacillate
  (D) oscillate
  Answer: B
 4. Choose the most suitable preposition: I differ………you.
  (A) from
  (B) of
  (C) with
  (D) for
  Answer: C

రీజనింగ్

 1. In the following question three out of four alternatives contain letters of the alphabet placed in a particular form. Find the one that does not belong to the group.
  (A) EHG
  (B) JML
  (C) PSR
  (D) UYX
  Answer: D
 2. Find out the missing number in the following:
  ? 13 49
  9 17 69
  13 11 59

  (A) 9
  (B) 5
  (C) 10
  (D) 21
  Answer:B
 3. How many 5's are there in the following sequence which are immediately preceded by an even number as well as immediately followed by an odd number ?
  854855725666458937

  (A) 3
  (B) 2
  (C) 4
  (D) None of these
  Answer: D
 4. Pointing to a boy in photograph Akhil says, “”He is the son of my mother’s only son’s son”. How is Akhil related to that boy ?
  (A) Uncle
  (B) Brother
  (C) Father
  (D) Cousin
  Answer: C
Published on 7/22/2014 6:44:00 PM
టాగ్లు:
301 Postman and Mailguard Posts at AP Postal Circle Postal department Postman Mail gurard posts postman/Mail Gurad exam tips exam procedure Postman guidance Postman and Mailguard posts at AP Postal circle examination tips Postman exam study Material Previous papers and Model Papers