Postman / Mailguard Exam Syllabus


జనరల్ నాలెడ్జ్ (25 మార్కులు):
ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, కంప్యూటర్ యూసేజ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. దేశాల-రాజధానులు-కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు-వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జనగణన 2011 సమాచారం, భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు, చరిత్రలో ముఖ్య సంఘటనలు, ప్రముఖ కవులు-వారి ఆస్థానాలు, కట్టడాలు-నిర్మాతలు, భారత రాజ్యాంగం సవరణలు, కమిటీలు-కమీషన్లు, ముఖ్యమైన ఆపరేషన్లు, వివిధ ఫోబియాలు, వివిధ శాస్త్రాల అధ్యయనం, భారత దేశంలోని వివిధ అవార్డులు, గ్రహీతలు, క్రీడలు - విజేతలు, ప్రదేశాలు, భారతదేశ రాష్ట్రాలు, ప్రముఖ నదీతీర నరగాలు, భారత అంతరిక్ష కార్యక్రమం వంటి జనరల్ నాలెడ్జ్ అంశాలపై దృష్టి సారించాలి. కరెంట్ అఫైర్స్ లో తాజా నియామకాలు, అవార్డులు, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, జాతీయ అంశాలు, సదస్సులు వంటి వాటిని చదవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో నిత్య జీవితంతో ముడిపడి ఉన్న అంశాలు చదవాలి. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ గురించి కనీస పరిజ్ఞానం అవసరం. అలాగే జనరల్ సైన్‌‌స అయిన బయాలజీ, ఫిజికల్ సైన్స్, కెమీస్ట్రీ, జియోగ్రఫీ, పాలిటీ, చరిత్ర నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

రీజనింగ్:
అభ్యర్థి తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణా శక్తిని పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, అనాలజీ (నంబర్, ఆల్ఫాబెట్, ఫిగర్), సీటింగ్ అరేంజ్‌మెంట్, వెన్‌డయాగ్రమ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సరైన పద్దతిలో సాధన చేస్తే ఈ విభాగంలో అధిక మార్కులు పొందవచ్చు. వీలైనన్ని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల సరళి అర్థమై ప్రిపరేషన్ సులువవుతుంది.

మ్యాథమేటిక్స్ (25 మార్కులు):
గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. నంబర్ సిస్టమ్స్, సూక్ష్మీకరణలు, కరెక్షన్స్, దశాంశాలు, శాతాలు, రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, భాగస్వామ్యం, మెన్సురేషన్, కాలం-పని, కాలం -దూరం వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్‌ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పుస్తకం సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. సంబంధిత అంశాల్లో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. పోస్టల్ అసిస్టెంట్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పరీక్షల పాతప్రశ్నా పత్రాలను సాధన చేస్తే అవగాహన పెరుగుతుంది.

ఇంగ్లీష్ (25 మార్కులు):
ఈ విభాగంలో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రిపొజిషన్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్, స్పీచెస్, సింగులర్ అండ్ ప్లూరల్, టెన్సెస్, ఆంటోనిమ్స్, సిననిమ్స్ ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ స్పెల్లింగ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. రోజూ 10 కొత్త పదాలు నేర్చుకొని వాటిని వాక్యాలలో ఉపయోగించడం సాధన చేయాలి. ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం లేదా ప్రముఖ ఛానల్‌లో వచ్చే గ్రూప్ డిస్కషన్లను వినడం ఎంతో లాభిస్తుంది. సందేహం ఉన్న పదాలు వెంటనే డిక్షనరీ సహయంతో నివృత్తి చేసుకోవాలి. వ్యతిరేక పదాలు, సమానార్థాలు, వీలైనన్ని ఎక్కువగా చదవాలి. దీనివల్ల వొకాబులరీ అభివృద్ధి చెందటంతో పాటు సరైన ఉచ్ఛారణ అలవడుతుంది.  దువుతున్నప్పుడు కీలక పదాలను నోట్ చేసుకోవాలి. వీలైనన్ని ప్రీవియస్ పేపర్‌‌స ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల సరళి అర్థమై ప్రిపరేషన్ సులువవుతుంది.

తెలుగు లాంగ్వేజ్(25 మార్కులు):
ప్రసిద్ధ కవులు వారు రాసిన గ్రంథాలు, రచనలు, బిరుదులు గురించి చదవాలి. బాషా భాగాలు, ఛందస్సు, అలంకారాలు, సంధులు, సమాసాలు, సాధన చేయాలి. తెలుగులో అక్షరాలు, వాక్యాలు, అర్థాలు, వ్యతిరేక పదాలు చదవాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు సాధన చేయాలి. స్థానికంగా వాడే పదాలు వాటి అర్థాలు, తెలుగు సంస్కృతి చరిత్ర, తాజా పరిణామాలు, వంటివాటిని కూడా చదవాలి.

Published on 1/17/2015 3:23:00 PM
టాగ్లు:
Postman / Mailguard Exam Syllabus Postal Exams Syllabus