ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2016 - 17


అభివృద్ధిని వేగవంతం చేయడానికి.. రెండంకెల వృద్ధి రేటును నిలకడగా కొనసాగించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కొత్త అవకాశాలను తీసుకురావడానికి 2016-17 బడ్జెట్ అవకాశం కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 2016-17 సంవత్సరానికి రూ.1.35 లక్షల కోట్ల బడ్జెట్‌ను మార్చి 10న శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ.

బడ్జెట్ ముఖ్యాంశాలు..

 • 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1.35 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాంచారు. ఇందులో రూ. 49,134.44 కోట్లు ప్రణాళికా వ్యయం కాగా, రూ.86,554.55 ప్రణాళికేతర వ్యయం.
 • 2015-16లో రూ.1.13 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సవరించిన అంచనాలు రూ. 1.12 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రణాళికా వ్యయం కింద బడ్జెట్ అంచనాలు రూ. 34,412 కోట్లు కాగా, సవరించిన అంచనాలు రూ. 38,671 కోట్లు. అంటే 12.38 శాతం అధికం. మరోవైపు ప్రణాళికేతర వ్యయాన్ని రూ. 76,636 కోట్లుగా ప్రతిపాదించగా, 6.5 శాతం తక్కువగా రూ.73,545 కోట్లతోనే సరిపెట్టారు.
 • 2014-15 నుంచి కొనసాగుతున్న రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి రూ.3,000 కోట్లు అందుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇందులో సీఎస్‌టీ పరిహారం రూ. 935 కోట్లు, పోలవరం నిర్మాణానికి రూ.3,500 కోట్లు, 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ. 1,000 కోట్లు ఉండనున్నాయి.
 • 2015-16లో రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోని మొత్తం 7 జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున కేంద్రం నుంచి సహాయం అందింది. రాజధాని నిర్మాణానికి రూ.850 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.345 కోట్లు కేంద్రం ఇచ్చింది. మిగతా హామీలను కేంద్రం విస్మరించింది.
 • 2015-16 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉన్నందున, 2016-17లో రాష్ట్ర సొంత ఆదాయం 16 శాతం పెరుగుతుందని అంచనా. అంటే రాబడి రూ. 49,764 కోట్ల నుంచి రూ.57,813 కోట్లకు పెరుగుతుందని అంచనా.
 • జాతీయస్థాయిలో వృద్ధిరేటు 7.3 శాతం నమోదు కాగా, ఏపీలో 10.9 శాతం నమోదయింది.
 • రూ.13,897 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. అమరావతి నిర్మాణానికి రూ. 15-18 వేల కోట్లు అవసరమని అంచనా.
 • కాపు కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు కేటాయింపు.
 • 2016-17లో అన్ని గృహాలకు ఎల్పీజీ సౌకర్యం.
 • 2016 చివరి నాటికి 10-15 ఎంబీపీఎస్ సామర్థ్యంతో ఇంటింటికీ నెట్ కనెక్షన్.
 • 2022 నాటికి అందరికీ గృహ సదుపాయం లక్ష్యాన్ని చేరడానికి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలు నిర్మాణం
 • విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి గత ఏడాది కంటే 67 శాతం అధికంగా రూ.750 కోట్లు.
 • 12,358 పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి ఉత్తర్వులు.
 • ప్రస్తుతమున్న లబ్ధిదారులకు ప్రతినెలా ఏడాదిపాటు పింఛన్ ఇవ్వాలంటే రూ. 5,545 కోట్లు అవసరం. అయితే బడ్జెట్‌లో రూ. 2.998 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఇది అవసరమైన మొత్తంలో 54 శాతం మాత్రమే.
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.65 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.35 కోట్ల కంటే ఇది 30 కోట్లు అదనం.

Education News

2016-17 బడ్జెట్ స్వరూపం..

మొత్తం బడ్జెట్

1,35,689కోట్లు

ప్రణాళికేతర వ్యయం

86,555 కోట్లు

ప్రణాళికా వ్యయం

49,134 కోట్లు

కేంద్ర పన్నుల వాటా రూపంలో

24637

కేంద్ర గ్రాంట్లు

26849

రాష్ట్ర సొంత పన్ను ఆదాయం

52318

వ్యాట్

37435

ఎక్సైజ్

5756

రవాణా

2412

స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్

5180

రాష్ట్ర పన్నేతర ఆదాయం

5495

గనుల ఆదాయం

1705

అటవీ

922

రెవెన్యూ లోటు

4868

ద్రవ్య లోటు

20497

జీఎస్‌డీపీ

6,83,382

జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు

2.99%


సాగుకు రూ.16,250కోట్లు
సేంద్రియ వ్యవసాయం, నీటికుంటల తవ్వకం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను మార్చి 10న రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. గతేడాదికంటే రూ.రెండు వేల కోట్ల పెంపుతో 2016-17 సంవత్సరానికి రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి చేసే ప్రణాళిక వ్యయం రూ.7,691.90 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం రూ.8,558.68 కోట్లు.

ముఖ్యమైన కేటాయింపులు (రూ.కోట్లలో)..

రుణమాఫీకి

3512

ఉపాధి హామీ పథకం కింద కుంటలకు

5094.83

ఉచిత విద్యుత్‌కు

3000

పంటల బీమాకు

344

నాణ్యమైన విత్తనాల తయారీకి

160

వడ్డీ లేని, పావలావడ్డీ రాయితీకి

177

పశుసంవర్థక శాఖకు

819.35

ఉద్యానవన విభాగానికి

102

బిందు, తుంపరసేద్యానికి

369.58

పట్టు పరిశ్రమకు

121.56

వెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి

179.92

భూసార పరీక్షలు, సూక్ష్మపోషకాలకు

80

సేంద్రియ వ్యవసాయం

68.67

వ్యవసాయ యాంత్రీకరణ

161.25

కరువును తట్టుకునే వంగడాలకు

50

సిబ్బంది సామర్థ్య పెంపునకు

61.71

చంద్రన్న రైతు క్షేత్రాల నిర్వహణ

17.5

రసాయన ఎరువుల అత్యవసర నిల్వలకు

64.5

పామాయిల్ తోటల సాగు ప్రోత్సాహానికి

55.09

రైతు బజార్లు, యాంత్రీకరణకు

102


విద్యుత్ సబ్సిడీలకు 3 వేల కోట్లు
రూ.5,148 కోట్ల మేర ఆర్థికలోటుతో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం కేవలం రూ.3 వేలకోట్ల సబ్సిడీతో సరిపెట్టింది. ఫలితంగా రూ.2,148 కోట్ల మేర ఈ సంవత్సరం విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడే వీలుంది

విద్యుత్ రంగానికి కేటాయింపులు (రూ.కోట్లలో)

2015-16

4252.83

2016-17

3703.05


కేంద్ర నిధులు రూ.51,486 కోట్లు
కేంద్ర పన్నులు, ప్రయోజిత పథకాల, ఇతర గ్రాంట్ల రూపంలో రూ.51,486 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా. ఇందులో కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.24,637 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.26,849 కోట్లు ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు రూ.20,497 కోట్లు కాగా... రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర రూపంలో వచ్చే నిధులు రూ.57,813 కోట్లు. ఇందులో రాష్ట్ర సొంత పన్నుల రూపంలో రూ.52,318 కోట్లు కాగా, పన్నేతర రూపంలో వచ్చే ఆదాయం రూ.5,495 కోట్లుగా ఉన్నాయి.

సబ్సిడీలు, గ్రాంట్ల కేటాయింపుల్లో రూ.1486 కోట్లు తగ్గుదల
గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్‌లో సబ్సిడీలు, గ్రాంట్లకు కేటాయింపుల్లో రూ.1,486 కోట్లు తగ్గింది. గత బడ్జెట్‌లో సబ్సిడీలు, గ్రాంట్ల కోసం రూ.14,816 కోట్లను కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.13,330 కోట్లనే కేటాయించారు.

పన్ను, పన్నేతర ఆదాయం రంగాల వారీగా గత, ఈ బడ్జెట్‌లో అంచనాలు (కోట్లలో)

రంగం

2015-16

2016-17

వ్యాట్

32840

37435

ఎక్సైజ్

4680

5756

రవాణా

1977

2412

స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్

5180


గనులు

1359

1705

అటవీ

1072

922


ప్రణాళికేతర పద్దు కింద ప్రధానమైన వ్యయం

రంగం

2015-16

2016-17

జీతాలు

30404

33776

పెన్షన్లు

11827

16140

వడ్డీల చెల్లింపు

11189

12258

రుణాల చెల్లింపు

5087

5554

జీతాలేతర వ్యయం

2839

3196

సబ్సిడీలు-గ్రాంట్లు

14816

13330

రైతుల రుణ మాఫీ

4300

3512

విద్యుత్ సబ్సిడీ

4230

3586

బియ్యం సబ్సిడీ

2300

2519పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
ప్రాథమిక విద్యాశాఖకు తాజా బడ్జెట్‌లో రూ.17,502 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.14,624 కోట్ల కంటే ఇది రూ.2878 కోట్లు అదనం. తాజా కేటాయింపులో ప్రణాళికేతర పద్దు రూ.14,883 కోట్లు కాగా ప్రణాళికా పద్దు రూ.2,619 కోట్లు. గతేడాది ప్రణాళికేతర పద్దు రూ.12,522 కోట్లు కాగా ఈసారి పదో వేతన సంఘం సిఫార్సుల అమలు తదితర కారణాలతో రూ.2,361 కోట్లు అదనంగా ఇచ్చారు. అలాగే గతేడాది ప్రణాళిక పద్దుకు రూ.2,102 కోట్లు కేటాయించగా ఈసారి రూ.2,619 కోట్లు ఇచ్చారు.

ఉన్నత, సాంకేతిక విద్యకు రూ.3,019 కోట్లు
తాజా బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద ఉన్నత విద్యకు రూ.2,266 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.753 కోట్లు కలిపి మొత్తం రూ.3,019 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపు రూ.2,393 కోట్లతో పోలిస్తే రూ.698 కోట్లు అధికం. కానీ రూ.3,019 కోట్లలో ప్రణాళికేతర పద్దు రూ.2,231 కోట్లు కాగా ప్రణాళిక పద్దు రూ.788 కోట్లు మాత్రమే.

బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసం రూ.కోట్లలో ఇలా..

శాఖ

సంవత్సరం

ప్రణాళికేతర

ప్రణాళిక

మొత్తం

ఉన్నత విద్య

2015-16

1221

396

1617

2016-17

1586

680

2266

తేడా

365

284

649

సాంకేతిక విద్య

2015-16

593

183

776

2016-17

645

108

753

తేడా

52

-75

-23


కొత్త వర్సిటీల ఏర్పాటుకు కేటాయింపులు

వర్సిటీ

నిధులు (రూ.కోట్లలో)

ఉర్దూ

20

తెలుగు

10

ఓపెన్

10

విద్యా

8


జాతీయ వర్సిటీలకు కేటాయింపులు (రూ.కోట్లలో)...

ఎన్‌ఐటీ

9

ఐఐఐటీ

9

గిరిజన వర్సిటీ

2

ఒంగోలు ఐఐఐటీ

6


ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్రంలోని సంప్రదాయ యూనివర్సిటీల నుంచి 2016-17కు రూ.832.72 కోట్లు కావాలని ప్రతిపాదనలు అందించగా ప్రభుత్వం 725.94 కోట్లు కేటాయించింది. రూ.106 కోట్లను తగ్గించింది.

యూనివర్సిటీల వారీగా కేటాయింపులు...

వర్సిటీ

కేటాయింపు (రూ.కోట్లలో)

ఆంధ్రా

298.25

ఎస్వీ

163.8

నాగార్జున

57.99

శ్రీకృష్ణదేవరాయ

68.77

అంబేడ్కర్ ఓపెన్

11.97

పద్మావతి

43.88

పీఎస్సార్‌తెలుగు

3

ద్రవిడ

12.09

నన్నయ

10.14

యోగివేమన

18.6

అంబేడ్కర్

7.4

కృష్ణా

9.87

రాయలసీమ

7.8

విక్రమసింహపురి

12.38

ఆర్జీయూకేటీ

184.26

జేఎన్‌టీయూకే

51.57

జేఎన్‌టీయూఏ

55.32


పరిశ్రమల రూ.612 కోట్లు
2016-17 వార్షిక బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి రూ.1,800 కోట్లు అవసరమని ఆ శాఖ ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం మాత్రం రూ.612 కోట్లు ప్రణాళిక పద్దు కింద అంచనా వేసింది. 2015-16లో కేటాయింపులు రూ. 526 కోట్లతో పోలిస్తే కొద్దిగా ఎక్కువే.
2015-16లో పరిశ్రమలకు రూ.500 కోట్ల వరకు రాయితీలు చెల్లించాలి. ఇవి కాకుండా 2016-17లో మరో రూ.600 కోట్ల మేర అవసరం ఉంటుందనేది అంచనా. అయితే బడ్జెట్‌లో కేవలం రూ.300 కోట్లు ప్రతిపాదించింది.

అమరావతికి రూ.1,500 కోట్లు
తాజా బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు కేటాయించింది. ఇందులో అమరావతి మెట్రో రైల్‌కు రూ. 300 కోట్లు, రాజధాని సామాజిక భద్రత నిధికి రూ. 70.50 కోట్లు, భూ సమీకరణ కోసం 1017.87 కోట్లు, భవిష్యత్తు అభివృద్ధి నిధి పేరిట రూ. 126.63 కోట్లు కేటాయించారు.

నైపుణ్యాభివృద్ధికి రూ.375 కోట్లు
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి సంస్థకు బడ్జెట్లో రూ.375.7 కోట్లు కేటాయించారు. గతేడాది ఏర్పాటైన ఈ సంస్థకు ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.387.22 కోట్లు అంచనా బడ్జెట్‌గా కేటాయించగా రూ. 355.34 కోట్లు సవరించిన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఆరోగ్యశ్రీకి 578 కోట్లు
పథకం నిర్వహణ అంచనాలను బట్టి రూ. 913 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తే ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 578 కోట్లు కేటాయించింది. గతేడాది రూ. 500 కోట్లు కేటాయించగా, రూ. 350 కోట్లు బకాయిలు పడ్డారు. 2014-15 సంవత్సరానికి కూడా రూ. 200 కోట్లు బకాయి ఉంది. ఈ పరిస్థితుల్లో రూ. 913 కోట్లు అవసరమని చెబితే అందులో రూ. 578 కోట్లు మాత్రమే ఇచ్చారు. 108 అంబులెన్సుల నిర్వహణకు అధికారులు రూ. 60 కోట్లు కావాలని ప్రతిపాదించగా రూ. 53 కోట్లు కేటాయించారు. 104 వాహనాల నిర్వహణకు రూ. 50 కోట్లు కావాలని ప్రతిపాదించగా రూ. 45 కోట్లు ఇచ్చారు. ప్రజారోగ్యానికి గతేడాది ప్రణాళికా, ప్రణాళికేతర కేటాయింపులు రూ. 5,728.22 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ. 6,153.75 కోట్లు ఇచ్చారు. ఉద్యోగుల వైద్యానికి రూ. 200 కోట్లు కేటాయించారు.

శాఖల వారీగా కేటాయింపుల
ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు కలపి శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలు(రూ. కోట్లలో)

శాఖ

కేటాయించిన మొత్తం

వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం

6815.09

పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య

1340.65

అటవీ, శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం

357.26

ఉన్నత విద్య

2644.64

ఇంధనం, మౌలిక వసతులు

4020.31

పాఠశాల విద్య

17502.65

ఆహారం, పౌరసరఫరాలు

2702.2

ఆర్థిక

36313.53

సాధారణ పరిపాలన

498.69

వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమం

6103.76

పోలీసు శాఖ

4785.41

గృహ నిర్మాణం

1132.83

జల వనరులు

7978.8

పరిశ్రమలు, వాణిజ్యం

975.77

ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్

360.22

కార్మిక, ఉపాధి

398.01

న్యాయ శాఖ

767.51

శాసనసభా వ్యవహారాలు

114.39

పట్టణాభివృద్ధి

4728.95

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్

1.43

ప్రణాళిక

1136.55

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

16115.43

రెవెన్యూ

3119.72

నైపుణ్య అభివృద్ధి

376.39

వెనుకబడిన తరగతుల సంక్షేమం

4430.17

సాంఘిక సంక్షేమం

3236.01

గిరిజన సంక్షేమం

1563.37

మైనార్టీ సంక్షేమం

710.57

మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం

1331.74

రవాణా, రోడ్లు, భవనాలు

3387.8

యువజన, క్రీడలు,పర్యాటక సర్వీసులు

739.16

మొత్తం

1,35,688.99


Education News
2 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.1132 కోట్లే!

ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.6 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా కేవలం రూ.1132 కోట్లు మాత్రమే ప్రకటించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద రెండు పడక గదులు, ఒక హాలు, వంట గది, బాత్‌రూంతో పాటు మరుగుదొడ్డి నిర్మించాలి. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాకు 12,500, విజయనగరం-10,500, విశాఖపట్నం-12,500, తూ.గోదావరి- 19,750, ప.గోదావరి- 19,750, కృష్ణా- 15,500, గుంటూరు-18,000 ప్రకాశం-14,250, నెల్లూరు-10,500, చిత్తూరు-15,250, వైఎస్సార్-10,500, అనంతపురం-14,750, కర్నూలుకు 14,750 ఇళ్లు, రాష్ట్ర రిజర్వ్ కోటా కింద మరో 13,250 ఇళ్లను మంజూరు చేశారు.

‘జలవనరుల’కు 7,325.21 కోట్లు
2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.4,678.13 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో రూ. 9,177.11 కోట్లకు కేటాయింపులు పెంచారు. 2016-17లో 7,325.21 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. అయితే అందులో రూ. 3,500 కోట్లు కేంద్రం నుంచే అందుతాయని అంచనా వేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.160 కోట్లు.
హంద్రీ-నీవా పూర్తి చేయడానికి రూ. 3,614.18 కోట్లు అవసరమని జల వనరుల శాఖ అంచనా వేయగా, రూ.504 కోట్లు మాత్రమే కేటాయించారు. గాలేరు-నగరికి రూ.1,318.15 కోట్లు ఇవ్వాలని కోరితే.. కేవలం రూ.348 కోట్లే ఇచ్చారు.

ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు (రూ.కోట్లలో)

ప్రాజెక్టు పేరు

కేటాయింపులు

2014-15

2015-166

2015-16

2016-17

సవరించిన అంచనాలు

పోలవరం

339

1032

3122.15

3660

తుంగభద్ర హైలెవల్ కెనాల్ స్టేజ్-1

15

18

18

19

తుంగభద్ర హైలెవల్ కెనాల్ స్టేజ్-2

20

40

45.67

56.74

వంశధార స్టేజ్-1

3

18

18

8.97

కేసీ కెనాల్ ఆధునికీకరణ

8.4

4.9

62.05

38

సోమశిల

24.9

124.98

271.58

58.78

గోదావరి డెల్టా ఆధునికీకరణ

141.13

30

169.79

85

పెన్నా డెల్టా ఆధునికీకరణ

10

11

108.6

10

ఏలేరు కాలువల ఆధునికీకరణ

13.5

11

27.6

19.37

శ్రీశైలం కుడికాలువ

(నీలం సంజీవరెడ్డి సాగర్)

12.48

5.88

48.33

39.05

తెలుగుగంగ

89.6

42.62

174.55

78.12

పులిచింతల

26.21

20.11

49.87

43.41

నీరడి బ్యారేజ్

(వంశధార స్టేజ్-2 కింద)

32.93

63

32.81

56.77

గాలేరు నగరి

55.14

169.58

452

348

పులివెందుల బ్రాంచ్ కెనాల్

27.81

6

52

84

కృష్ణా డెల్టా ఆధునికీకరణ

120.14

111.08

304.69

112.89

హంద్రీ నీవా

100.28

212

380.36

504.2

వెలిగొండ

76.58

153.89

268.94

220

చాగలనాడు లిఫ్ట్

2

2

0.02

1.5

తారకరామ లిఫ్ట్

0.78

1.07

0.5

3.01

తోటపల్లి బ్యారేజీ

20

107

80.16

52.53

గురురాఘవేంద్ర లిఫ్ట్

15

12

23.95

20.01

గుండ్లకమ్మ

5

6.05

17.31

10.44

పుష్కరం లిఫ్ట్

29.7

65

43.16

54

తాటిపూడి లిఫ్ట్

40

70

39.33

55

వెంకటనగరం పంపింగ్

15

20

6.2

15

చింతలపూడి లిఫ్ట్

35.04

22

276.03

91.03

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి

3

3

0.01

2

కోరిసపాడు లిఫ్ట్

7

6.39

6.39

7.45

ప్రకాశం బ్యారేజీ ఆధునికీకరణ

--

0.55

--

0.7

మూసురుమిల్లి

--

16

2.57

11.89

నాగార్జునసాగర్ ఆధునికీకరణ(విదేశీ నిధులు)

--

841.5

505.59

260


రాష్ర్ట అప్పులు రూ.1,90,513 కోట్లు
2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర మొత్తం అప్పులు రూ.1,90,513.00 కోట్లకు పెరగనున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 24.74 శాతం మేరకే అప్పులుండాలి. అయితే దాన్ని మించిపోయి 27.88 శాతానికి చేరతాయని అంచనా. ఆ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం అప్పులు 1,90,513.00 కోట్లకు చేరతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి తలసరి అప్పు రూ.38,102కు పెరగనుంది. నిజానికి 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో తలసరి అప్పు రూ.29,667. ఏడాదికాలంలోనే రూ.8,435 కోట్ల మేరకు అదనంగా తలసరి అప్పు పెరిగింది.

ఆర్థిక సంవత్సరం అప్పుల శాతం

ఆర్థిక సంవత్సరం

అప్పుల శాతం

2015-16

24.33

2016-17

24.74

2017-18

25.09

2018-19

25.16

2019-20

25.22

Education News

Published on 3/12/2016 5:19:00 PM

Related Topics