తెలంగాణ బడ్జెట్ 2016-17


ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌లో సింహభాగం జల వనరులకే కేటాయించింది తెలంగాణ సర్కారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ‘మన నీళ్లు, మన నియామకాలు, మన నిధులు’ వంటి హామీల్లో ప్రాజెక్టులకే పెద్ద పీట వేశారు. లక్షా ముప్పై వేల కోట్ల బడ్జెట్‌లో ప్రాజెక్టులకు ఏకంగా రూ.25 వేల కోట్లను కేటాయించారు. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టు, భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకే రూ.15 వేల కోట్లు ప్రతిపాదించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక అభివృద్ధి నిధి కింద బడ్జెట్‌లో రూ.4,675 కోట్లు కేటాయించారు. అనుకోని అవసరాలకు కేటాయించేందుకు వీలుగా వీటిని ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ల దగ్గర అందుబాటులో ఉంచుతారు. బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలతో సహా అన్ని వర్గాల్లోని పేద కుటుంబాలకు విస్తరించటం వంటి ముఖ్య అంశాలు బడ్జెట్‌లో పొందుపరిచారు.

ఈ మేరకు 2016-17 బడ్జెట్‌ను (రూ. 1,30,415 కోట్లు) మార్చి 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ప్రణాళికేతర పద్దు కింద రూ.62,785.14 కోట్లు కేటాయించగా అంతకంటే దాదాపు రూ.5 వేల కోట్లు అధికంగా ప్రణాళిక పద్దు కింద రూ.67,630.73 కోట్లు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తెలంగాణ సహా, ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా

బడ్జెట్ విశ్లేషణ మీ కోసం..

Education News


బడ్జెట్ (2016-17) స్వరూపం (రూ. కోట్లలో)

ప్రణాళికేతర వ్యయం

62785.14

ప్రణాళిక వ్యయం

67630.73

రెవెన్యూ రాబడి

1,00,924.73

మొత్తం వ్యయం

1,30,415.85

రెవెన్యూ మిగులు

3718.37

ద్రవ్యలోటు

23467.28


Education News


సాగునీటి పారుదల శాఖకు 26,652 కోట్లు

2016-17 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు ప్రణాళికా వ్యయం కిందే మొత్తంగా రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేశారు. గతేడాది ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కన్నా సుమారు రూ.15 వేల కోట్లు అధికంగా కేటాయించారు. వీటిలో పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో మొత్తంగా రూ.15 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి సాగునీటి రంగానికి బడ్జెట్‌లో మొత్తంగా రూ.26,625.32 కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి.. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.23,893.66 కోట్లు, చిన్ననీటి పారుదలకు రూ.2,452.52 కోట్లు కేటాయించారు. పరీవాహక అభివృద్ధి విభాగానికి రూ.30.14 కోట్లు, వరద నిర్వహణకు రూ.249 కోట్లు కేటాయించారు.

ప్రాణహితకు సంవత్సరాలవారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)

సంవత్సరం

కేటాయింపులు

2010-11

700

2011-12

608

2012-13

1050

2013-14

782

2014-15

1820

2015-16

1515

2016-17

6971


ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా (రూ.కోట్లలో)

ప్రాజెక్టు

2015-16

2016-17

కాళేశ్వరం

-

6286

ప్రాణహిత

1515

685.3

పాలమూరు ఎత్తిపోతల

100

7860.88

సీతారామ, భక్తరామదాసు

-

1151.59

జూరాల

97.5

75

దేవాదుల

498

695

ఎస్సారెస్పీ- 1

80.5

270.83

ఎస్సారెస్పీ-

23

36

ఇందిరమ్మ వరద కాల్వ

747

505.27

కల్వకుర్తి

225

295

నెట్టంపాడు

248

124

బీమా

157

124

కోయిల్‌సాగర్

24

59.71

ఆర్డీఎస్

2.5

14

లెండి

5

19.32

దిగువ పెన్‌గంగ

5

124.69

నిజాంసాగర్

89.5

220

సింగూరు

17

27.5

అలీసాగర్, గుత్ప

3

16

ఎల్లంపల్లి

558

350

కంతనపల్లి

125

200

నాగార్జునసాగర్ ఆధునికీకరణ

196.47

440.18

ఎస్‌ఎల్‌బీసీ

600

1417.1

చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్టు

2

3

కడెం

3

9.37

పాలెంవాగు

5

5

కిన్నెరసాని

1

10

సుద్దవాగు

40

4.2

స్వర్ణ

2

4.5

మత్తడివాగు

5

8

ఎన్టీఆర్ సాగర్

1.5

12

కొమరం భీమ్ ప్రాజెక్టు

37.5

60

ఘణపూర్

14

1

జగన్నాధ్‌పూర్

23

30

వైరా

1

10


Education News


కోటి ఎకరాల ఆయక ట్టు దిశగా అడుగులు
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణం భూమి ఉంది. ఇందులో 1.67 కోట్ల విస్తీర్ణం భూమి సాగుకు యోగ్యంగా ఉంది. అయితే ఇందులో ప్రస్తుతం కేవలం 48.22 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులో ఉంది. మరో కోటి 20 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తేవాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 60 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే లక్ష్యంతో భారీ ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయి. 2004లో చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను రూ.1.30 లక్షల కోట్లతో చేపట్టగా అందులో రూ.46 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.84 వేల కోట్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉంది. రీ డిజైన్ పేరిట ఆ వ్యయం కాస్తా ఇప్పుడు లక్ష కోట్లకు చేరింది. వీటి కింద సుమారు 60 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా అందులో 8.87 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. ఇంకా 51 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది.

ఆయకట్టు లక్ష్యాలు ఇలా..(ఎకరాల్లో)
2015-16 జూన్ లక్ష్యం: 6.28 లక్షలు
2016-17 జూన్ లక్ష్యం: 11.34 లక్షలు
2017-18 జూన్ లక్ష్యం: 5.55 లక్షలు
2018-19 జూన్ లక్ష్యం: 3.92 లక్షలు

Education News

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.7,258 కోట్లు
 • చిన్న, సన్నకారు రైతులకు పంటల బీమా ప్రీమియంలో సాయానికి రూ.134 కోట్లు
 • రైతులకు విత్తనాల సరఫరాకు రూ.60.33కోట్లు, సీడ్‌చైన్ పథకాన్ని బలోపేతం చేసేందుకు రూ.33.80కోట్లు
 • కేంద్ర సహకారంతో నిర్వహించే పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకానికి రూ.4.75 కోట్లు
 • సూక్ష్మ సేద్యానికి రూ.140కోట్లు
 • జాతీయ ఉద్యాన ప్రాజెక్టుకు 70 కోట్లు
 • క్షేత్రస్థాయి వెటర్నరీ సంస్థలకు మౌలిక సదుపాయాల కోసం రూ.54.96 కోట్లు
 • గడ్డి, దాణా అభివృద్ధి కోసం 13.50 కోట్లు
 • వెటర్నరీ సేవలకు రూ.28.37 కోట్లు
 • జంతువులు, కోళ్ల ఉత్పత్తి ప్రోత్సాహకానికి రూ.21.06 కోట్లు
 • మత్స్యశాఖ అభివృద్ధికి రూ.70.15 కోట్లు
 • చేప విత్తన క్షేత్రాల కోసం రూ.29 కోట్లు
 • ‘చుక్కనీటితో ఎక్కువ పంట’ కోసం రూ.112 కోట్లు

వైద్యారోగ్యశాఖకు రూ.5,966.88కోట్లు
2016-17 బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,966.88 కోట్ల మేర ప్రతిపాదించింది. ఇందులో ప్రణాళిక కింద రూ.2,462.83కోట్లు, ప్రణాళికేతర బడ్జెట్ రూ.3,504.05కోట్లు చూపారు. మొత్తంగా వైద్యారోగ్యశాఖకు గతేడాది కంటే రూ.1,036 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్ మాత్రం గత ఏడాదితో ప్రణాళిక బడ్జెట్‌తో దాదాపు సమానంగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌లో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, 40 చోట్ల డయాలసిస్ కేంద్రాలు, మరో 40 చోట్ల డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు, ఉన్న వాటిని మార్చడానికి రూ.600 కోట్లు కేటాయించారు. డయాగ్నస్టిక్ పరికరాలు, పాత పడకల మార్పు, సివిల్ పనుల మరమ్మతులకు రూ.316 కోట్లు ఇచ్చారు. ఔషధాలు తదితరాల కోసం రూ.225 కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం, సేవలకు రూ.100 కోట్లు కేటాయించారు.

ఆరోగ్యశ్రీకి రూ.464 కోట్లు
వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) విభాగానికి గతేడాది కంటే తక్కువగా రూ.784.87కోట్లు కేటాయించారు. ఈ విభాగంలో భాగంగా ఉన్న ఆరోగ్యశ్రీకి రూ.344 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి మరో రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.189 కోట్లు కేటాయించారు. బోధనాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణకు రూ.20 కోట్లు, కాలేజీలు, ఆసుపత్రుల్లో వాహనాల కొనుగోలుకు రూ.6 కోట్లు, విభాగంలో మానవ వనరుల అభివృద్ధికి రూ.26.75 కోట్లు కేటాయించారు.

108, 104 సర్వీసుల మెరుగుకు చర్యలు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని విభాగాలకు గత బడ్జెట్‌లో రూ.1,218.19 కోట్లు ఇవ్వగా... ఈసారి రూ. 1,137.69 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో కీలకంగా 108, 104 సర్వీసులకు కొత్త వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.49 కోట్లు కేటాయించారు.

పలు విభాగాలకు ప్రణాళిక బడ్జెట్ కేటాయింపులు (రూ.కోట్లలో)

శాఖ

2014-15

2015-16

2016-17

వైద్య విద్యా శాఖ

904.18

798.95

784.87

వైద్యవిధాన పరిషత్

74.00

100

205.02

నిమ్స్ ఆస్పత్రికి

135.97

135.97

120

ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ

30.99

64.1

50

ఎంఎన్‌జీ కేన్సర్ ఆసుపత్రి

4.16

4.16

23.4

ఆయుష్

12.35

16.03

28.8

యోగాధ్యయన పరిషత్

0.83

0.83

3.97

డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టరేట్-పరిపాలన

0.6

0.6

7.01

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్

0.41

0.41

1.22

డెరైక్టర్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం14

120.2

150.82

8.96

కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం

970.89

1218.19

1137.69

మొత్తం

2284.09

2460.24

2462.83


2016-17 బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు (రూ. కోట్లలో)


ప్రణాళికేతర

ప్రణాళిక

మొత్తం

వ్యవసాయం, సహకారం

4801.33

1599.48

6400.81

వ్యవసాయ మార్కెటింగ్

135.97

221.76

357.72

పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ

400.08

247.56

647.64

వెనుకబడిన తరగతుల సంక్షేమం

310.05

2227.46

2537.51

మహిళ, శిశు సంక్షేమం

70.75

1481.84

1552.58

ఇంధనం

5151.46

190

5341.46

పర్యావరణం, అడవులు

222.28

50

272.29

ఆర్థిక

20,076.39

75

20151.39

ఆహారం, పౌరసరఫరాలు

2291.53

21.34

2,312.87

సాధారణ పరిపాలన

321.62

356.28

677.91

వైద్యం, ఆరోగ్యం

3504.05

2462.83

5966.89

ఉన్నత విద్య

1,753.26

410.75

2164

హోం

3617.8

1200

4817.8

గృహనిర్మాణ శాఖ

16.59

843.79

860.37

పరిశ్రమలు, వాణిజ్యం

107.46

859.63

967.1

ఐటీ శాఖ

1.95

251.76

253.71

మౌలిక సదుపాయాలు,పెట్టుబడి

9.83

21.09

30.92

నీటిపారుదల

1652.35

25000

26652.35

కార్మిక, ఉపాధి

388.8

36.53

425.33

న్యాయశాఖ

721.7

43.19

764.89

శాసన వ్యవహారాలు

98.05

--

98.05

మైనారిటీ సంక్షేమం

4.44

1200

1204.44

పురపాలక, పట్టణాభివృద్ధి

2646.21

2169.2

34815.44

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

1811.21

8919.5

10730.71

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్

1.2

--

1.2

రెయిన్ షాడో

1.16

1.16

రెవెన్యూ

1918.55

109.91

2028.46

ఎస్సీ అభివృద్ధి

570.66

6551.55

7122.21

సెకండరీ ఎడ్యుకేషన్

7290.95

1283.7

8574.64

రవాణా, రోడ్లు మరియు భవనాలు

3525.03

4372.55

847.53

గిరిజన సంక్షేమం

375.9

3376.47

3752.37

యువజన అభ్యుదయం, పర్యాటక

125.23

232.44

107.21


Education News


విద్యాశాఖకు రూ.10,738.62 కోట్లు
పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.11,216.09 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈసారి దానిని రూ.10,738.62 కోట్లకు తగ్గించారు. ముఖ్యంగా ప్రణాళికేతర పద్దులో ప్రభుత్వం భారీగా కోత విధించింది. గతేడాది ప్రణాకేతర పద్దు కింద రూ.7,976.43 కోట్లు చూపగా.. ఈసారి రూ.7,290.94 కోట్లు కేటాయించింది. రూ.685.49 కోట్ల మేర కోత పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 2015-16 బడ్జెట్‌లో కరువు భత్యం (డీఏ) కింద రూ.1,250 కోట్లు ప్రతిపాదించగా సవరించిన అంచనాల మేరకు రూ.550 కోట్ల వరకు వెచ్చించింది. దీంతో ఆ సవరించిన అంచనాల ప్రకారం ఈసారి (2016-17) నాన్‌ప్లాన్ బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపులు తగ్గించి, డీఏ కింద రూ.500 కోట్ల మేర కేటాయించారు.
రాష్ట్రంలో ఒక్క పాఠశాల విద్యాశాఖకే రూ.14 వేల కోట్లకు పైగా నిధులు కావాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తే కేవలం రూ.8,574 కోట్ల కేటాయింపులతో సరిపెట్టింది.

విద్యా శాఖ బడ్జెట్ స్వరూపం ఇదీ.. పాఠశాల విద్య

కేటగిరీ

2015-16

2016-17

ప్రణాళికేతర

7976.43

7290.94

ప్రణాళిక

1078.06

1283.69

మొత్తం

9054.49

8574.63


ఉన్నత విద్యాశాఖ

ప్రణాళికేతర

1500.12

1489.87

ప్రణాళిక

152.27

231.1

మొత్తం

1652.39

1720.97


సాంకేతిక విద్య

ప్రణాళికేతర

253.8

263.38

ప్రణాళిక

255.41

179.64

మొత్తం

509.21

443.02

 • కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాల్లో రాష్ట్ర వాటా పెరగడంతో కిందటేడాది కేటాయింపుల కంటే ఈసారి 205.63 కోట్లు అదనంగా కేటాయించారు. ఇక నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర సాయం 60 శాతం రాష్ట్రాల వాటా 40 శాతంగా ఉండనున్నాయి.

Education News


పోలీసుశాఖకు రూ. 4,817 కోట్లు
2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద రూ. 4,817 కోట్లు కేటాయించింది. గతేడాది ప్రణాళిక వ్యయం కింద కేవలం రూ. 200 కోట్లే కేటాయించగా ఈ ఏడాది ఆరు రెట్లు అధికంగా రూ. 1,200 కోట్లు కేటాయించింది. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 3,504.70 కోట్లు ఖర్చు కావడంతో ఈ ఏడాది రూ. 3,617 కోట్లు కేటాయించింది.
అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీటీ)కు దాదాపు రూ. 140 కోట్లు కేటాయించింది.
ఏళ్లుగా నిరాదరణ కు గురవుతున్న అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేలా ప్రణాళిక పద్దుల కింద రూ. 111 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ ప్రణాళిక పద్దుల కింద కేవలం రూ. 41 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి దాదాపు మూడు రెట్లు పెంచింది. రాష్ట్రంలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేకపోవడంతో తక్షణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 64 కోట్లు కేటాయించింది.

ఇంధన శాఖకు రూ.5,341.45 కోట్లు
ఇంధన శాఖకు గత బడ్జెట్లో రూ.7,999.96 కోట్ల కేటాయింపులు జరపగా, తాజా బడ్జెట్‌లో రూ.5,341.45 కోట్లతో సరిపెట్టింది. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు గత బడ్జెట్‌లో జరిపిన రూ.4,257.24 కోట్ల కేటాయింపులను రూ.3,192.93 కోట్లకు తగ్గిస్తూ తాజాగా సవరణలు చేసింది. తాజా బడ్జెట్‌లో రూ.4,470.10 కోట్లు కేటాయించింది. సోలార్ పంపు సెట్లు, సౌర విద్యుత్ పథకం, బోరుబావుల విద్యుదీకరణ పథకాలకు నిధులే కేటాయించలేదు.
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఈఆర్‌సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్) నివేదికలో 2016-17లో మొత్తం రూ.30,207 కోట్ల ఖర్చులను చూపాయి. ఆదాయం రూ.21,418 కోట్లు వస్తుందని, విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1,958 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చూపాయి. మిగతా రూ.6,831 కోట్ల లోటును వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందుకు రూ.4470.10 కోట్లే కేటాయించింది.

విద్యుత్ రంగానికి కేటాయింపులిలా.. (రూ.కోట్లలో)

పద్దు

2015-16

2015-16

2016-17

అంచనాలు

సవరణ

అంచనాలు

ప్రణాళిక

1372.64

864.11

190

ప్రణాళికేతర

6027.32

4699.11

5151.45

మొత్తం

7999.96

5563.22

5341.45


వృద్ధిరేటు 11.67 శాతం
గత రెండేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ స్థూల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని, 2015-16లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల ఉత్పత్తి 11.67 శాతం మేర వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది జాతీయ సగటు వృద్ధి రే టు 8.6 శాతం కంటే ఎక్కువని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2014-15 సంవత్సరంలో 12.7 శాతం మెరుగుపడి రూ.1,29,182గా లెక్క తేలిందన్నారు. 2015-16లో 10.70 శాతం పెరిగి రూ.1,43,023గా ఉండొచ్చని అంచనా వేశారు. ఇది కూడా జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.93,231 కంటే ఎక్కువే.

దీపం పథకానికి రూ.21 కోట్లు
రాష్ట్రంలోని పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకానికి రూ.37.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.21.61కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే 6,55,354 మందికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 5,43,412 మంది అర్హులను గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు.

సర్వశ్రేయోనిధికి రూ.50 కోట్ల గ్రాంటు
దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధికి ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగిస్తారు.

మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1,552 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్‌లో రూ. 1,552 కోట్లను కేటాయించింది. ఇందులో ప్రణాళికా బడ్జెట్ కింద రూ. 1,481. 83 కోట్లు కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 70.74 కోట్లు కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్‌లో గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 166 కోట్లు అదనంగా కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్‌లో కూడా రూ. 47 లక్షలు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు బంగారుతల్లి పథకానికి నిధులు కేటాయించలేదు. సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 697. 37 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాంఘిక భద్రత, సంక్షేమం కోసం రూ. 730 .91 కోట్లు కేటాయించగా, ఈసారి తగ్గింది. ఐసీడీఎస్‌లో వృత్తి సేవల కింద అంగన్‌వాడీ వర్కర్ల చెల్లింపులకు వివిధ పద్దుల కింద వందలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ. 396.77 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు కేవలం రూ. 35.68 కోట్లు మాత్రమే. బాలికా సంరక్షణ పథకం కింద రూ. 26.62 కోట్లు కేటాయించారు. ఐసీడీఎస్ వేతనాలకు కూడా గత సంవత్సరం కంటే రూ. 67 కోట్లు తగ్గించి బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈసారి రూ. 50 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. గర్భిణులు, శిశువుల పౌష్టికాహారం కోసం కిందటేడు కంటే రూ. 200 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం.

ఆర్టీసీకి రూ.236 కోట్లు కేటాయింపు
ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి కేవలం రూ.236 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తంలో సగం కూడా విడుదల చేయలేదు. గతేడాది ఆర్టీసీ సిబ్బంది వేతనాలు సవరించిన సమయంలో ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం ప్రస్తుత బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తలేదు. బడ్జెట్ ప్రతిపాదనలు చూసి ఆర్టీసీ యాజమాన్యం కంగుతినాల్సి వచ్చింది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళిక పద్దు కింద రూ.40 కోట్లు ప్రకటించింది. బస్‌పాస్ రాయితీల రూపంలో నష్టపోతున్న మొత్తాన్ని రీయింబర్స్ చేసే క్రమంలో రూ.110 కోట్లు చూపింది. ప్రణాళికేతర పద్దు కింద మరో రూ.86 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.150 కోట్లు ప్రకటించినా సవరించిన అంచనాలో దాన్ని రూ.91 కోట్లకు తగ్గించింది. గత బడ్జెట్ గడువు మరో పక్షం రోజులే ఉండగా ఇప్పటికీ నయా పైసా విడుదల కాలేదు. దీంతో తాజాగా కేటాయించిన నిధులు ఎంత వరకు విడుదల అవుతాయో చూడాల్సిందే.

తలసరి అప్పు రూ.35,373
రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్ల అప్పులు ఉండగా... 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 లక్షల కోట్లకు చేరుతున్నాయి. అంటే రుణభారం రెట్టింపవుతోంది. ఇదే సమయంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్లు, ఈ ఏడాది నిర్మించే 2.60 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ.15 వేల కోట్లు, హైదరాబాద్‌లో నాలుగు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు అవసరమని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.50 వేల కోట్ల దాకా అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో అప్పుల భారం వచ్చే ఏడాది రూ.2 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.35,373 చేరుతోంది.

Education News


‘రెవెన్యూ’కు రూ.1,384.13 కోట్లు
గత ఏడాది బడ్జెట్లో రూ.1,687 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది కేటాయింపుల్లో రూ.300 కోట్లకుపైగా కోత పెట్టి రూ.1,384.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం కింద రూ.46.76 కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ.1337.37 కోట్లు ఉన్నాయి.

మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్‌బండ్‌లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు. ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది.

‘డబుల్’ ఇళ్లకు అప్పులే దిక్కు!
రాష్ట్రంలో పేదలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ‘అప్పుల’తో నెట్టుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగానే బడ్జెట్‌లో నామమాత్రంగా రూ.860 కోట్లే కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు, రాజధాని హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వాటిని హ డ్కోతోపాటు ఇతర సంస్థల నుంచి రుణం తెచ్చి పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

‘డబుల్’ ఇళ్లకు కేటాయింపులు (రూ.లలో)

2016-17

2015-16

ప్రణాళిక

843

832

ప్రణాళికేతర

17

42

మొత్తం

860

874


పరిశ్రమలకు రూ.967.09 కోట్లు
గత ఏడాది పరిశ్రమల శాఖకు రూ.973.73 కోట్లను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద ప్రతిపాదించగా.. ఈ ఏడాది రూ.967.09 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో రూ.859.63 కోట్లను ప్రణాళికా వ్యయం కింద ప్రతిపాదించారు. గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఇప్పటి వరకు రూ.689.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు సవరణ ప్రతిపాదించారు. గ్రామీణ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలకు గతంలో రూ.562.88 కోట్లు ప్రతిపాదించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.778.63 కోట్లు ప్రతిపాదించారు.

రోడ్లు, భవనాల శాఖకు రూ.4,322 కోట్లు
తాజా బడ్జెట్‌లో రోడ్లు, భవనాల శాఖకు రూ. 4,322 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఇది దాదాపు రూ. 11,600 కోట్లు. వీటిని నిర్వహించే క్రమంలో గత బడ్జెట్‌లో రూ. 5,917 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చేసరికి రూ. 2,576 కోట్లనే ఖర్చు చేయగలిగారు.
 • ముఖ్యమైన జిల్లా రహదారుల నిర్మాణం కోసం రూ. 1,137 కోట్లు కేటాయించారు.
 • గజ్వేల్ ప్రాంతీయ అభివృద్ధి మండలి, ఇతర అనుసంధాన రోడ్ల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు కేటాయించారు.
 • ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానంగా నిర్మించే రేడియల్ రోడ్ల కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు.
 • కొత్త రైల్వే లైన్ల కోసం రూ. 50 కోట్లు ప్రతిపాదించారు.
 • కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, జిల్లా కలెక్టరేట్ భవనాల కోసం రూ. 3.50 కోట్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం భవనం కోసం రూ. కోటి, తెలంగాణ జర్నలిస్టుల భవన నిర్మాణం కోసం రూ. కోటి, తెలంగాణ కళాభారతి, ఇతర భవనాల కోసం రూ. 50 కోట్లు, రాజ్‌భవన్‌లో నిర్మాణాల కోసం రూ. 50 కోట్లు, సీనియర్ అధికారుల నివాస భవనాల నిర్మాణం కోసం రూ. 20 కోట్లు ప్రతిపాదించారు.
 • తెలంగాణ రోడ్ సెక్టార్ కోసం రూ. 60 కోట్లు చూపారు.
 • కోర్ నెట్‌వర్క్ రోడ్లకు రూ. 360 కోట్లు ప్రతిపాదించారు.

రహదారులకు కేటాయింపులు (రూ.కోట్లలో)

2016-17

2015-16

మొత్తం

4322

5917

ప్రణాళికేతర

778

1178

ప్రణాళిక

3544

4739


పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 11,031 కోట్లు
2015-16 ఆర్థిక బడ్జెట్‌లో వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు రూ.13,184 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో కేవలం రూ. 11,031 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ తగ్గింపు వసూళ్లు రూ. 300 కోట్లు చూపి నికర కేటాయింపులను రూ. 10,731 కోట్లుగా పేర్కొన్నారు. ఆసరా పథకం మినహా మిషన్ భగీరథ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.

పంచాయతీరాజ్ విభాగానికి గతేడాది మొత్తం రూ. 6,927.48 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో రూ. 4,686.16 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి విభాగానికి గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను స్వల్పంగా పెంచుతూ రూ. 6,344.55 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ. 2,102.96 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 2,583.20 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ. 6,336.30 కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 8.25 కోట్లను మాత్రమే చూపారు.

పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్య కేటాయింపులను పరిశీలిస్తే సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 3.50 కోట్లు, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సాయంగా రూ. 58.65 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 240.08 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 819.50 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద మొత్తం రూ. 1,468.56 కోట్లు కేటాయించారు.

గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం కింద మొత్తం రూ. 6,344.55 కోట్లు చూపగా ఇందులో వివిధ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,260 కోట్లు కే టాయించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టనున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2,712.55 కోట్లు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3.74 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. వడ్డీలేని రుణాలకు గతేడాదికన్నా కేటాయింపులు పెంచారు. గతంలో రూ. 84.61 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 148.43 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి బ్యాంకుకు ప్రత్యేక గ్రాంటును రూ. 11 కోట్లకు పెంచారు. గ్రామీణ జీవనోపాధికి రూ. 57.36 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 133 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2,450 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు రూ. 84 కోట్లు కేటాయించారు.

కార్పొరేషన్లకు భారీ నిధులు
వరంగల్‌కు రూ.300 కోట్లు, మరో 4 కార్పొరేషన్లకు రూ.400 కోట్లు
యాదాద్రి, వేములవాడ ఆలయాలకు చెరో రూ.100 కోట్లు
జలమండలికి రూ.1,000 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.650 కోట్ల సహాయం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లకు తలా రూ.100 కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి మాత్రం నిధుల్లో కోతలు పెట్టింది. యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవకు తగినట్లుగా ఈ రెండు ఆలయాల అథారిటీలకు చెరో రూ.100 కోట్లు కేటాయించారు.

ప్రణాళికా వ్యయం కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజీ బోర్డు (జలమండలి)కి రూ.1,000 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.650 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద మున్సిపాలిటీలకు రూ.325.23 కోట్లను కేటాయించారు.

మరిన్ని ప్రధాన కేటాయింపులు
ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు కోసం హెచ్‌ఎండీఏ రూ.235 కోట్ల రుణం
మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.140 కోట్లు
రాష్ట్ర ఆర్థిక సంఘం కింద మున్సిపాలిటీలకు రూ.191.86 కోట్లు,
కేంద్ర పథకాలైన అమృత్‌కు రూ.121.63 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.61.09 కోట్లు.
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు నిధులు రూ.132.28 నుంచి రూ.66.36 కోట్లకు తగ్గింపు
పురపాలక శాఖకు 2015-16 బడ్జెట్ అంచనా,

సవరించిన బడ్జెట్, తాజా బడ్జెట్ అంచనాలు(రూ.కోట్లలో)

పద్దు

2015-16

2015-16(సవరణ)

2016-17 (అంచనాలు)

ప్రణాళిక

3175.52

2087.98

2169.23

ప్రణాళికేతర

848.32

735.76

2646.2

మొత్తం

4023.84

2823.74

4815.43


మిగులు తగ్గుతోందా..!
2013-14 బడ్జెట్‌లో రూ.301.02 కోట్ల రెవెన్యూ మిగులు చూపిన ప్రభుత్వం, ఆడిట్ అనంతరం రూ.368.65 కోట్ల మిగులుందని లెక్కతేల్చింది. గతేడాది బడ్జెట్‌లో రూ.531 కోట్లు మిగులును అంచనా వేసి, కేవలం రూ.60.54 కోట్లకు సవరించుకుంది. గతేడాది సవరణల్లో రూ.16,911 కోట్లు ద్రవ్యలోటు చూపింది. ఈసారి దాన్ని రూ.23,467 కోట్లకు పెంచింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌డీపీలో 3 శాతం మించకుండా గరిష్ఠ రుణపరిమితి పాటించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రెవెన్యూ మిగులున్నందున తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతం పెంచాలని ప్రభుత్వం రెండేళ్లుగా కోరుతున్నా ఇప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాలేదు. కానీ తాజా బడ్జెట్‌లోనూ ప్రభుత్వం 3.5 శాతం ద్రవ్యలోటును అంచనా వేసింది. కేంద్ర పన్నుల వాటా, ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ల ద్వారా గతేడాది రూ.25 వేల కోట్లు రాగా ఈసారి రూ.28,512 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రత్యేక ప్యాకేజీతో పాటు రూ.1,500 కోట్ల సీఎస్‌టీ బకాయిలు వస్తాయని లెక్కలేసింది.

Education News


సంక్షేమ శాఖలకు రూ. 16,169.11 కోట్లు
 • సంక్షేమ రంగానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బడ్జెట్ కలుపుకుని మొత్తం 16,651.11 కోట్లు కేటాయించారు.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా,శిశు, మైనారిటీ సంక్షేమ శాఖలకు ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద మొత్తం 16,169.11 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది రూ.1,870 కోట్లు ఎక్కువ.
 • ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో పాటు కొత్తగా బీసీ, ఈబీసీలకు కల్యాణలక్ష్మి కింద ఈ ఏడాది రూ.738 కోట్లు కేటాయించారు.
 • ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.2,218 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1,332 కోట్లు, సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థకు రూ.1.006 కోట్లు కేటాయించారు.
 • కొత్త పద్దు కింద డిపార్ట్‌మెంట్ అటాచ్డ్ కాలేజీ హాస్టళ్లకు కొత్తగా రూ.100 కోట్లు, ప్రీ, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు అదనపు సదుపాయాల కింద రూ.130 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కింద రూ.700 కోట్లు, కల్యాణలక్ష్మి కింద రూ. 200 కోట్లు కేటాయించారు.

శాఖ

(ప్రణాళిక,ప్రణాళికేతర)

(ప్రణాళిక,ప్రణాళికేతర)

2015-16

2016-17 (రూ.కోట్లలో)

ఎస్సీ అభివృద్ధి

6154

7122.21

గిరిజన సంక్షేమం

3309

3752.37

బీసీ సంక్షేమం

2172

2537.51

మహిళా, శిశు సంక్షేమం

1559

1552.58

మైనారిటీ సంక్షేమం

1105

1204.44

మొత్తం

14299

16169.11


Telanagna Budget 2016-17 Documents

Annual Financial Statement & Explanatory Memorandum
Statement of Demands for Grants
Detailed Estimates of Revenue & Receipts
Legislature
General Administration, Youth Advancement, Tourism & Culture Department, Information Technology & Communications & Public Enterprises Department
Law Department & Home Department
Revenue Department
Finanace Department & Planning Department
Infrastructure & Investment Department and Transport, Roads & Buildings Department
Education Department
Health, Medical & Family Welfare Department
Municipal Administration & Urban Development Department
Labour, Employment, Training & Factories Department & Department for Women, Children, Disabled & Senior Citizens
Agriculture & Co-Operation & Food, Civil Supplies & Consumers Affairs Department
Housing Department, Social Welfare Department, Backward Classes Welfare Department & Minority Department
Irrigation & Command Area Development Department
Panchayat Raj & Rural Development Department
Environment, Forests, Science & Technology Department & Energy Department
Industries & Commerce Department
Animal Husbandry, Dairy Development & Fisheries Department
Public Account
ప్రభుత్వ పూచీలను, ఋణ పరిస్థితిని, కంపెనీలకు ఇతర సంస్థలకు తనఖాపెట్టిన సెక్యూరిటీలను తెలిపే పట్టిక‌
Government Guarantees, Debt position and Securities lent to Companies and other Undertakings
Budget in Brief
Annual Plan
Scheduled Castes Sub-Plan (SCSP)
Tribal Sub-Plan (TSP)
Published on 3/16/2016 3:14:00 PM

Related Topics