తెలంగాణ సోషియో, ఎకనామిక్ అవుట్ లుక్ - 2016


వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఒడిదుడికులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే-2016 ఆందోళన వ్యక్తం చేసింది. సాగును లాభసాటిగా మార్చడంతో పాటు సామాజిక రంగంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా కళ్లకు కట్టింది. 2016-17 రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌తో పాటు సామాజిక, ఆర్థిక సర్వే-2016 ను కూడా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మార్చి 14న శాసనసభకు సమర్పించారు.
ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడం, సాంఘిక సంక్షేమం, సమ్మిళిత వృద్ధి లక్ష్యాలుగా ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతను సర్వే నొక్కి చెప్పింది. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక, జలవనరులు, ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ ఉద్దేశపూర్వక వివక్షకు గురైంది. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ మిగులు బడ్జెట్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వచ్చారు. దాంతో సామాజిక, ఆర్థికాభివృద్ధిలో సమతూకం లోపించింది’ అని వ్యాఖ్యానించింది. అయితే తెలంగాణ ఆవిర్భవించిన 22 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, అమలు చేసిన విధానాల ద్వారా రాష్ట్రం 11.7 శాతం వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలిచిందని ఆర్థిక సర్వే పేర్కొంది.

సర్వే ముఖ్యాంశాలు
దేశ ఆర్థిక రంగంలో రాష్ట్ర వాటా 4 శాతం
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సూచికగా నిలిచే జీఎస్‌డీపీ 2015-16లో 5.83 లక్షల కోట్లని అంచనా. ఇందులో 11.7 శాతం చొప్పున పెరుగుదల ఉంటుంది. దేశ ఆర్థిక రంగంలో తెలంగాణ వాటా 4.1 శాతం. 2012-13లో జాతీయ వృద్ధి రేటు (5.62 శాతం) కంటే తక్కువగా (2.41 శాత మే) ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆవిర్భావం నుంచీ పెరుగుతూ, ప్రస్తుతం జాతీయ రేటును మించిపోయింది. వర్షాభావంతో పంటలు దెబ్బతిని వృద్ధి రేటు మందగించింది. అయినా పశు సంపద (12.2 శాతం), మత్స్య సంపద (17.8 శాతం) వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది.

స్థూల రాష్ట్ర ఉత్పత్తి (ప్రస్తుత ధరలతో)
2014-15 : రూ.5,22,001 కోట్లు(13.4% వృద్ధి)
2015-16 : రూ.5,83,117 కోట్లు (11.7% వృద్ధి)

తలసరి ఆదాయం (2014-15) తొలి సవరించిన అంచనాల ప్రకారం
అత్యధికం - రూ.2,94,220 - హైదరాబాద్
అత్యల్పం - రూ.76,921 - అదిలాబాద్

పట్టణ జనాభా పెరుగుదలలో టాప్
ఇటు విస్తీర్ణపరంగానూ (1.12 లక్షల చ.కి.మీ.), అటు జనాభాపరంగానూ (3.5 కోట్లు) మనది దేశంలో 12వ అతి పెద్ద రాష్ట్రం. జనాభా వృద్ది రేటు జాతీయ స్థాయిలో 17.7 శాతం కాగా రాష్ట్రంలో 13.58గా నమోదైంది. పట్టణ జనాభా వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణదే అగ్రస్థానం. 2001కి ముందు 25.13 శాతమున్న పట్టణ జనాభా 2011కల్లా 38.12 శాతానికి చేరింది. రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది ఒక్క హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు!

ఎక్కడెంత జనాభా
గ్రామ జనాభా: 61.12 %
పట్టణ జనాభా: 38.88%
2001-2011 మధ్య పట్టణ జనాభా వృద్ధి - 38.12%

లింగ నిష్పత్తి
1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు
అత్యధికం: నిజామాబాద్ జిల్లా - 1000 : 1040
అత్యల్పం: హైదరాబాద్ జిల్లా 1000 : 954

పురుషులకంటే స్త్రీలు ఎక్కువ ఉన్న జిల్లాలు:
నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్

పదేళ్లలో పర్యాటకులు మూడింతలు
మెడికల్, బిజినెస్, ఎకోటూరిజాలు రాష్ట్ర పర్యాటక రంగానికి కీలకం. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక దశాబ్దకాలంలో మూడింతలైంది. 2005లో 3.26 కోట్ల మంది రాగా 2015 నాటికి అది 9.46 కోట్లకు చేరింది. దేశీయ పర్యాటకుల సంఖ్య పెరగ్గా విదేశీయుల రాక కాస్త మందగించింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు దేశీయ పర్యాటకులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు విదేశీయులు ఎక్కువగా వస్తున్నారు. 2015లో 1.26 లక్షల విదేశీ పర్యాటకులొచ్చారు. వీరిలో 1.22 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే వచ్చారు! 40 శాతం మంది పర్యాటకులు జూలైలోనే వస్తున్నారు.

దేశీయ పర్యాటకులు: 7,23,99,113
అత్యధికం - 2,32,27,277 - వరంగల్
అత్యల్పం - 6880 - నిజామాబాద్

విదేశీ పర్యాటకులు - 75171
అత్యధికం - 70,000 (హైదరాబాద్)
అత్యల్పం - 0 - కరీంనగర్, ఖమ్మం, మెదక్

తగ్గుతున్న శిశు మరణాలు
రాష్ట్రంలో శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. 2004-15 మధ్య 2.86 శాతం మేర తగ్గింది. 2011-13 మధ్య ప్రతి లక్ష మందికి 92 ఉన్న మాతా మరణాల రేటు ప్రస్తుతం 38కి తగ్గింది. ఈ విషయంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాతా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలకు సగటున 19.8 ఏళ్ల వయసులో పెళ్లిళ్లవుతున్నాయి. అయితే బాల్య వివాహాలు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.

మానవాభివృద్ధి సూచీలో అట్టడుగున మెదక్
మెదక్ మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రంగారెడ్డి, వరంగల్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. దశాబ్దకాలంలో ఆరోగ్య రంగంలో కరీంనగర్ జిల్లా గణనీయ పురోగతి కనబరిచింది. రాష్ట్ర జీడీపీలో మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కీలకంగా మారాయి.

అప్పుల కోరల్లో రైతన్న
రుణ ప్రణాళిక ప్రతిపాదన మేరకు వ్యవసాయ రంగానికి రూ.40,547 కోట్లు ప్రతిపాదించగా.. రూ. 48,247 కోట్లు వితరణ చేశారు. అయినా రాష్ట్రంలో రైతులెదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి అప్పులే. 74 శాతం మంది రైతులు అప్పుల కోరల్లో చిక్కుకున్నారు. పంట రుణాల మాఫీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 35.3 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రెండు విడతల్లో రూ.8,080 కోట్లు విడుదల చేశారు. దీనిద్వారా అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 5.99 లక్షలు, నల్లగొండలో 4.97 లక్షలు, వరంగల్‌లో 4.04 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.

ఆదుకుంటున్న పశు పోషణ
సాగు కరువు కోరల్లో చిక్కడంతో రైతులకు అదనపు ఆదాయం, ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంలో పశుపోషణే కీలకంగా మారింది. దీనిపై 29 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రాష్ట్రంలో పశుసంపద విలువ సుమారు రూ.25,293 కోట్లు. రాష్ట్ర ఆదాయంలో 5.9 శాతం వీటి ద్వారా సమకూరింది.

నీటి సదుపాయం గల భూమి (2014-15 నాటికి) - 25.29 లక్షల హెక్టార్లు
సాగునీరు అందుతున్న భూమి - 17.26 లక్షల హెక్టార్లు

సాగునీటి సదుపాయాలు (2014-15)
మొత్తం చెరువుల కింద ఉన్న భూమి - 1.13 లక్షల హెక్టార్లు
కాల్వల కింద ఉన్న భూమి - 2.43 లక్షల హెక్టార్లు
బావులు, గొట్టపు బావుల కింద - 21.16 లక్షల హెక్టార్లు
ఇతర జల వనరుల కింద ఉన్న భూమి - 0.57 లక్షల హెక్టార్లు

సాగవుతున్న నికర విస్తీర్ణం (హెక్టార్లలో - అత్యధికం)
చెరువుల కింద - 70,017 - వరంగల్ జిల్లా
కాల్వల కింద - 80,864 - నల్గొండ జిల్ల్లా
గొట్టపు బావుల కింద - 2,12,626 - మహబూబ్‌నగర్ జిల్లా
బావుల కింద - 3,88,636 కరీంనగర్ జిల్లా

పట్టణ యువతకు ఉపాధే సవాలు
దేశ ఆర్థిక రంగంలో సేవా రంగానిది కీలక పాత్రయినా ఆ స్థాయిలో ఉపాధి కల్పించలేకపోతోంది. ఈ రంగం ద్వారా 17.8 శాతం మందికే ఉపాధి దొరుకుతోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా వేగంగా క్షీణిస్తున్నా ఏకంగా 55.6 శాతం మంది దానిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.1 శాతమున్న నిరుద్యోగిత రేటు పట్టణాల్లో 6.6 శాతం కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. 15-19 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిరుద్యోగిత శాతాన్ని 7.7గా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో యువతకు, ప్రత్యేకించి పట్టణ యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. నిరుద్యోగితలో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది.

రాష్ట్ర జనాభాలో స్వయం ఉపాధి పొందుతున్న వారు - 45.8%
కాజువల్ లేబర్:
35.4%
వేతన జీవులు: 16.1%
కాంట్రాక్టు కార్మికులు: 2.7%

ఆహారేతర పంటలదే పైచేయి
నీటిపారుదల ద్వారా సాగయ్యే విస్తీర్ణం గత రెండేళ్లలో బాగా పడిపోయింది. 2013-14లో 22.8 లక్షల హెక్టార్లుండగా 2014-15కల్లా 17.26 లక్షల హెక్టార్లకు తగ్గింది. రాష్ట్రంలో సాగునీటికి బావులే ప్రధాన ఆధారం (84 శాతం)గా ఉన్నాయి. 1955-56లో బావుల కింద సాగు 16 శాతం మాత్రమే ఉండేది! ఇక కాల్వల ద్వారా 10 శాతం, చెరువుల కింద కేవలం 4 శాతం సాగవుతోంది.

పంటల సాగు (లక్షల హెక్టార్లలో)
వరి :
14.15
మొక్కజొన్న తృణ ధాన్యాలు/ : 6.92
చిరుధాన్యాలు : 22.06
ఆహార ధాన్యాలు : 26.13
సోయాబీన్ : 2.5
పత్తి : 16.93

పండ్ల సాగు, ఉత్పత్తులు
మామిడి సాగు 2,04,106.40 హెక్టార్లు
మామిడి ఉత్పత్తి 18,19, 452 మె.టన్నులు
బత్తాయి సాగు 1,33,303.20 హెక్టార్లు
బత్తాయి ఉత్పత్తి 14,78,051.1 మె.టన్నులు
ఉల్లి ఉత్పత్తి 2,71,984 మెట్రిక్ టన్నులు

కూరగాయల సాగు
బెండ:
18,715.3 హెక్టార్లు
ఆకుకూరలు - 2,628 హెక్టార్లు
క్యాబేజీ - 3,919.5 హెక్టార్లు
టమాటా - 53,185.4 హెక్టార్లు

ఆర్థిక రంగంలో ఐటీదే అగ్రస్థానం
రాష్ట్ర ఆర్థిక రంగంలో 62 శాతం వాటా తో సేవల రంగానిది కీలక పాత్ర. ఉపాధి కల్పనలో రియల్టీ, ఐటీ, టూరిజం, హోటల్స్ తదితర రంగాలు కీలకం. రాష్ట్రంలో 10,885 కంపెనీలు రూ.89,257కోట్ల టర్నోవర్ సాధించాయి. ఇందులో ఒక్క ఐటీ రంగం వాటానే రూ.68,258 కోట్లు! 3.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకుటి.హబ్, ఐటీఐఆర్ వంటివాటికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

చిన్న కమతాలదే పెద్ద వాటా
రాష్ట్రంలో సగటున ఒక్కో కుటుంబానికి 2.8 ఎకరాల(1.12 హెక్టార్లు) కమతముం ది. ఇది జాతీయ సగటు (1.6 హెక్టార్లు) కన్నా తక్కువే. జనాభా పెరుగుదలతో కమతాల విస్తీర్ణం తగ్గుతోంది. రాష్ట్రంలో 86 శాతం చిన్న, మధ్య తరహా కమతాలే. వీటిలో చిన్న కమతాలు 24 శాతం, మధ్య తరహావి 62 శాతం. 2-10 హెక్టార్ల విస్తీర్ణమున్న కమతాలు 14 శాతమున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సగటు కమతం విస్తీర్ణం హెక్టారు కంటే తక్కువగా ఉండటం భూ పంపిణీ తీరుకు అద్దం పడుతోంది.

భూములు:
మొత్తం భూమి - 112.08 లక్షల హెక్టార్లు
అటవీ ప్రాంతం - 25.4 లక్షల హెక్టార్లు
వ్యవసాయ భూమి - 43.8 లక్షల హెక్టార్లు
బీడు భూమి - 14.0 లక్షల హెక్టార్లు

మొత్తం భూ కమతాలు :55,53,982
మొత్తం కమతాల విస్తీర్ణం:
61,96,825.58 హెక్టార్లు
హెక్టారు కన్నా తక్కువున్న కమతాలు: 34,41,087
10 హెక్టార్ల కన్నా ఎక్కువున్న కమతాలు - 15,775

అడవులు:
మొత్తం విస్తీర్ణం -
27,292 చ.కి.మీ.లు
రిజర్వ్‌డ్ - 19,696.23
రక్షిత అడవులు - 6,953.47
మిగతా అడవులు: 642.30
అత్యధికం: ఆదిలాబాద్ - 7,232
అత్యల్పం:హైదరాబాద్, రంగారెడ్డి 731

ఫార్మాదే ప్రధాన పాత్ర
రాష్ట్ర స్థూల ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా 24 శాతం. కానీ ఆ రంగమూ ఇటీవల ఒడిదుడికులు ఎదుర్కొంటోంది. పారిశ్రామికంలో తయారీ రంగం వాటా 55 శాతం. ఇది 8.4 శాతం మేర వృద్ధి సాధిస్తుందని అంచనా. 2008-09తో పోలిస్తే ఇప్పటివరకు 40 శాతం వృద్దిరేటుతో కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 10,279 పరిశ్రమలున్నాయి. వీటిలో 7,018 కార్పొరేటేతర రంగానివే. ఇవి 2.83 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుండగా... 3,124 కార్పొరేట్ పరిశ్రమల ద్వారా 3.97 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. తయారీ రంగంలో ఫార్మాసూటికల్స్ (29 శాతం), విద్యుత్ ఉపకరణాల (11 శాతం)ది ప్రధాన పాత్ర. 5,787 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 64,604 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

పరిశ్రమలు (2012-13)
మొత్తం పరిశ్రమలు - 10,279
అత్యధికం - 3,797 - రంగారెడ్డి
అత్యల్పం - 285 - అదిలాబాద్

2011 గణాంకాల ప్రకారం అక్షరాస్యత 66.5 శాతం
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత 66.5 శాతముంది. గ్రామీణ ప్రాంతాల్లో 57.3, పట్టణాల్లో 81.1 శాతముంది. ఎస్సీల్లో 58.8 శాతం, ఎస్టీల్లో 49.5 శాతమే అక్షరాస్యులున్నారు. అయితే అక్షరాస్యుల్లో 79 శాతం ప్రాథమిక విద్యతోనే సరిపెడుతున్నారు. 15-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో అక్షరాస్యత శాతం 87. ప్రాథమిక స్థాయిలోనే 23.1శాతం మంది డ్రాపౌట్లుగా మిగులుతున్నారు. 87 శాతం పాఠశాల్లో తాగునీరు, 75 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యాలున్నాయి.

అక్షరాస్యత:
మొత్తం - 66.54%

పురుషులు - 75.04%
మహిళలు - 57.99%
అత్యధికం: హైదరాబాద్ - 83.25 %
అత్యల్పం: మహబూబ్‌నగర్ - 55.04 %

పాఠశాలలు - ఉపాధ్యాయులు
మొత్తం పాఠశాలలు - 43,293

మొత్తం ఉపాధ్యాయులు - 2,34,879
1-5 తరగతి వరకు పాఠశాలలు
- 25,331 (ఉపాధ్యాయులు - 84,084)
6-10 తరగతి వరకు పాఠశాలలు - 9,937 (ఉపాధ్యాయులు - 94,524)

తెలంగాణ గురించి క్లుప్తంగా..
తెలంగాణ విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీలు
మొత్తం జనాభా: 3,50,03,674
అత్యధికం: రంగారెడ్డి జిల్లా - 52,96,741
అత్యల్పం: నిజామాబాద్ జిల్లా - 25,51,335
జిల్లాలు: 10
మొత్తం పట్టణాలు: 68
రెవెన్యూ డివిజన్లు: 42
కార్పొరేషన్లు: 06
మునిసిపాలిటీలు: 37
నగర పంచాయతీలు : 25
జిల్లా పరిషత్‌లు: 09
మండల ప్రజాపరిషత్‌లు: 438
గ్రామ పంచాయతీలు: 8,660
రెవెన్యూ మండలాలు : 464
రెవెన్యూ గ్రామాలు: 11,140

బ్యాంకులు (2015 సెప్టెంబర్‌నాటికి)
రాష్ట్రంలో మొత్తం బ్యాంకుల శాఖలు: 4,383
అత్యధికం: హైదరాబాద్ 1,094
అత్యల్పం: ఆదిలాబాద్ 243


ఆసుపత్రులు
అల్లోపతి అసుపత్రులు - 206
ప్రభుత్వ అల్లోపతి వైద్యులు - 4,713
అత్యధికం - 36 - హైదరాబాద్
అత్యల్పం - 14 - కరీంనగర్
మొత్తం పీహెచ్‌సీలు - 613
పడకలు - 20,450

సంప్రదాయ వైద్యం
ఆసుపత్రులు - 11
వైద్యులు: 655
ఆయుర్వేద ఆసుపత్రులు - 4
యునాని ఆసుపత్రులు - 3
హోమియో ఆసుపత్రులు - 3
ప్రకృతి వైద్యం - 1
మొత్తం పడకలు - 717

కుటుంబాలు (సగటు కుటుంబానికి నలుగురు)
మొత్తం కుటుంబాలు - 83,03,612
మొత్తం ఆవాసాలు -1,00,78,599
ఇళ్లు లేని వారు - 83,969
అత్యధికం - 20,107 - రంగారెడ్డి
అత్యల్పం - ఖమ్మం - 3822

రహదారులు (2013-14)
మొత్తం రోడ్లు: 90,880 కి.మీ.లు
పంచాయతీ రాజ్ రోడ్లు: 70,201 కి.మీ.లు
రోడ్లు, భవనాల శాఖ రోడ్లు: 24,244 కి.మీ.లు
జాతీయ రహదారులు: 2,592 కి.మీ.

పోలీసు బలగాలు (2013-14)
సివిల్ బలగాలు - 63211
అత్యధికం - 6319 - హైదరాబాద్
అత్యల్పం - 726 - రంగారెడ్డి

ఆర్మ్‌డ్ రిజర్వ్/స్పెషల్ పోలీస్ బలగాలు - 22,321


TELANAGANA SOCIO ECONOMIC OUTLOOK 2016
Published on 3/17/2016 3:17:00 PM

Related Topics