తెలంగాణ బడ్జెట్ 2017-18


తొలి రెండు పూర్తిస్థాయి బడ్జెట్లలో సంక్షేమం, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వీటితో పాటు కుల వృత్తుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించింది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అత్యంత వెనుకబడిన వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మార్చి 13న రూ. 1,49,646 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘మైగ్రేషన్ నుంచి రివర్స్ మైగ్రేషన్- వలస బాట పట్టిన తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష’ అంటూ వార్షిక బడ్జెట్‌ను ఆయన ఆవిష్కరించారు.
Education News బడ్జెట్‌లో తొలిసారిగా సామాజిక వర్గాల వారీగా నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. గొర్రెల పెంపకానికి రూ.4 వేల కోట్లు, చేపల పెంపకానికి రూ.1,000 కోట్ల రుణాలు సేకరించనుంది. నాయిబ్రాహ్మణ, రజకులకు కలిపి రూ.500 కోట్లు, విశ్వకర్మలుగా పిలిచే ఐదు కులాలకు రూ.200 కోట్లు, చేనేతకు రూ.1,200 కోట్లు బడ్జెట్‌లో పొందుపరిచింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన ఎంబీసీ వర్గాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం ఇదే తొలిసారి. సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి పేరుపై తొలి పథకం కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ-షాదీముబారక్ ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయం రూ.75,116కు పెంపు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను బడ్జెట్‌లో పొందుపరిచారు.

ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం సూచనలకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. ప్రణాళిక-ప్రణాళికేతర వ్యయాలను క్యాపిటల్-రెవెన్యూ పద్దులుగా మారుస్తూ వాటికి నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులుగా నామకరణం చేశారు. మొత్తం బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు కాగా అందులో నిర్వహణ పద్దు రూ.61,607.20 కోట్లు, ప్రగతి పద్దు రూ. 88,038.80 కోట్లు. ఈ సందర్భంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా బడ్జెట్ విశ్లేషణ మీ కోసం... Education News

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం
 • 2016-17లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 10.1 శాతంగా అంచనా. 2015-16 జీఎస్‌డీపీ 9.5 శాతం.
 • 2016-17లో రాష్ట్ర జీఎస్‌డీపీ విలువ రూ.6,54,294 కోట్లుగా అంచనా. (2015-16తో పోలిస్తే 13.7 శాతం వృద్ధి).
 • 2016-17లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,58,360 గా అంచనా.
 • 2016-17లో 7.5 శాతానికి చేరుకున్న పారిశ్రామిక వృద్ధి. 6.3 శాతంగా నమోదైన వ్యవసాయం రంగం వృద్ధి.

2017-18లో ప్రభుత్వం ప్రకటించిన వరాలు
 • రెండేళ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ. అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు 75 శాతం సబ్సిడీతో పంపిణీ. పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోలు. గొర్రెల మేతకు అనువుగా అటవీ భూముల్లో స్టైలో గ్రాస్ పెంపకం.
 • రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి. పెంపకంతోపాటు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలతోపాటు రిటైల్ మార్కెట్లను నిర్మిస్తుంది
 • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంపు.
 • రజక, నాయి బ్రాహ్మణుల పథకాలకు రూ.500 కోట్లు. నాయిబ్రాహ్మణులు ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటు చేసుకు నేందుకు ప్రభుత్వ పెట్టుబడి. రజకులకు వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లు, ఐరన్ బాక్సుల పంపిణీ. దోబీఘాట్ల నిర్మాణం
 • విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు అవసరమైన ఆర్థిక సహకారం. రూ.200 కోట్లు కేటాయింపు. బట్టలు కుట్టే మేర, గీత కార్మికులకు, కుమ్మరి పనివారికి పరికరాల పంపిణీ
 • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు
 • అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ
 • ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆసరా ఫించన్లు. ఏప్రిల్ నుంచి అమలు
 • సైనికుల సంక్షేమ చర్యలకు సంక్షేమ నిధి
 • జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు
 • వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడు ఎస్సీ కాలేజీలు, కొత్త స్టడీ సర్కిళ్లు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభం. మైనారిటీలకు 130 రెసిడెన్షియల్ స్కూళ్లు
 • వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు 330 గోదాంల నిర్మాణం
 • కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం దిగువన రూ.506 కోట్లతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. ఈ ఏడాది రూ.193 కోట్ల కేటాయింపు
 • వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం. నేత కార్మికులకు రూ.1,200 కోట్లు .శ్రీ
 • ఇమామ్‌లు, మౌజాములకు ఇచ్చే రూ.వెయ్యి గౌరవ వేతనం రూ.1500కు పెంపు
 • అంగన్‌వాడీ టీచర్ల జీతం రూ.10,500కు పెంపు. హెల్పర్ల జీతం రూ.6,000కు పెంపు
 • వీఆర్‌ఏల జీతం రూ.10,500కు పెంపు. దీనికి అదనంగా రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు రూ.5 వేల జీతం

తలసరి అప్పు రూ.42,857
2017-18లో ఆర్థిక సంవత్సరం నాటికి అప్పులు రూ.1.40 లక్షల కోట్లుగా అంచనా (2016-17 బడ్జెట్ సవరణల ప్రకారం అప్పులు 1.14 లక్షల కోట్లు ). ఈ ఏడాది అప్పులపై చెల్లించే వడ్డీలకు రూ.11,138 కోట్లు అవసరమని పేర్కొన్న ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.42,857 ఉంటుంది.

Download Telangana Budget Documents:
Education News Budget Speech
Education News Budget at a Glance
Education News Annual Financial Statement
Education News Annual Plan
Education News Scheduled Castes Sub-Plan
Education News Scheduled Tribes Sub-Plan
Education News Budget Estimates 2017-2018


బడ్జెట్ (2017-18) స్వరూపం Education News
రాష్ట్ర సొంత పన్నులు రూ. 62,619
పన్నేతర ఆదాయం రూ. 6,601.37
కేంద్రం పన్నుల వాటా రూ. 17,005
కేంద్రం నుంచి గ్రాంట్లు రూ. 26,857.67
రెవెన్యూ రాబడి రూ. 1,13,083.04
రెవెన్యూ వ్యయం రూ. 1,08,511.73
పెట్టుబడి వ్యయం రూ. 30,929.94
రుణాలు, అడ్వాన్సులు రూ. 5,544.85
పెట్టుబడులకు చెల్లింపులు రూ. 4,659.48
మొత్తం వ్యయం రూ. 1,49,646
ద్రవ్య లోటు రూ. 26,096.31
రెవెన్యూ మిగులు రూ. 4,571.30

నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు
బడ్జెట్‌లో 2016-17 మాదిరే ఈసారీ సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.23,675.73 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 1,324.27 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆయకట్టుకు నీరందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులిచ్చారు. మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20టీఎంసీలు), కోయిల్‌సాగర్ (3.90 టీఎంసీ) ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నందున ఈ నాలుగు ప్రాజెక్టులకే బడ్జెట్‌లో రూ.1,633.36 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6,681 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు రూ.4 వేల కోట్లు కేటారుయించారు.

కాళేశ్వరం కేటాయింపులు ఇలా..

ఏడాది

నిధులు(రూ.కోట్లలో)

2010-11

700

2011-12

608

2012-13

1,050

2013-14

782

2014-15

1820

2015-16

1515

2016-17

2,280 (సవరణ తర్వాత)

2017-18

6,681


ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో)

ప్రాజెక్టు

2016-17

2017-18

కాళేశ్వరం

6,286

6,681.87

ప్రాణహిత

685.30

775.44

పాలమూరు ఎత్తిపోతల

7,860.88

4,000

సీతారామ, భక్తరామదాస

1151.59

990

డిండి

500

500

ఎల్లంపల్లి

350

397.97

కంతనపల్లి

200

505

సాగర్ ఆధునీకరణ

440.18

488.17

జూరాల

75

50

దేవాదుల

695

1,500

ఎస్సారెస్పీ-1

270.83

198.25

ఎస్సారెస్పీ-2

36

150

ఇందిరమ్మ వరద కాల్వ

505.27

799.30

కల్వకుర్తి

295

1,000

నెట్టంపాడు

124

235

భీమా

124

200

కోయిల్‌సాగర్

59.71

198.36

ఆర్డీఎస్

14

20

లెండి

19.32

30

దిగువ పెన్‌గంగ

124.69

360

నిజాంసాగర్

220

108.42

సింగూరు

27.50

49.50

అలీసాగర్, గుత్ప

16

51.50

ఎస్‌ఎల్‌బీసీ

1,417.10

900

కడెం

9.37

207.72

పాలెంవాగు

5

30

కిన్నెరసాని

10

10

సుద్దవాగు

14.20

20

స్వర్ణ

4.50

20

మత్తడివాగు

8

10

ఎన్టీఆర్ సాగర్

12

15

కొమరం భీం ప్రాజెక్టు

60

150

ఘనఫూర్

1

73

జగన్నాథ్‌పూర్

30

75


2016-17 బడ్జెట్‌లో సవరించిన అంచనాలు (రూ.కోట్లలో)

ప్రాజెక్టు

2016-17 కేటాయింపు

సవరణ

పాలమూరు

7,860.89

2,851.88

కాళేశ్వరం

6,280

2,280

దేవాదుల

695

509

కంతనపల్లి

200

155

Education News

మైనర్ ఇరిగేషన్‌కు రూ.2,000 కోట్లు

బడ్జెట్‌లో చిన్న నీటి పారుదలకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 వేల కోట్లు కేటాయించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది సుమారు రూ.250 కోట్ల మేర ఎక్కువ. ఇందులో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయకు రూ.1,283 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 7 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద తొలి విడతో 9 వేలు, రెండో విడతలో 8 వేల చెరువుల పునరుద్ధరణను చిన్న నీటి పారుదల శాఖ పూర్తి చేసింది. చిన్ననీటి పారుదలకు 2016- 17లో బడ్జెట్‌లో రూ.2,253 కోట్లు కేటాయించగా వాటిని రూ.1,745.09 కోట్లకు సవరించారు.

కోటి ఎకరాల ఆయకట్టు దిశగా అడుగులు
రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి నీటిని అందించేందుకు 2004-05లో రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను చేపట్టారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, భక్తరామదాస ప్రాజెక్టులను చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాలని సంకల్పించగా ఇప్పటివరకు కొత్తగా 11,36,108 ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 5,21,211 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించగలిగారు. కల్వకుర్తి కింద 1.60 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, భీమాలో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. దేవాదుల కింద కూడా 60 వేల ఎకరాల నుంచి 1,22,670 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. సింగూరు కింద 40 వేల ఎకరాలకు నీరందించారు. మరోవైపు ఈ ఏడాది జూన్, జూలై నాటికి కొత్తగా మరో 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. ఇందులో 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఎస్సారెస్పీ స్టేజ్-2, ఎల్లంపల్లి, లోయర్ పెన్‌గంగ, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఈ 17 ప్రాజెక్టులకే బడ్జెట్‌లో రూ.11,022 కోట్ల మేర కేటాయింపులు చేసింది.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 5,942 కోట్లు
2017-18 బడ్జెట్లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ రంగాలకు రూ.5,942 కోట్ల కేటాయించారు (2016-17లో కేటాయింపులు రూ.6,758 కోట్లు). ఇందులో చివరి విడత రుణ మాఫీకి రూ.4 వేల కోట్లు కాగా మిగిలిన రూ.1,942 కోట్లు వ్యవసాయ రంగానికి వాస్తవ కేటాయింపులు.

ముఖ్య కేటాయింపులు... Education News
మార్కెటింగ్ శాఖకు రూ.457.29
పశుసంవర్థక శాఖకు రూ.594 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.300 కోట్లు
సన్నచిన్నకారు రైతుల పంటల బీమాకి రూ.200 కోట్లు
వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ.250 కోట్లు
రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీకి రూ.126.61 కోట్లు
ప్రొ.జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి రూ. 85.50 కోట్లు
శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి రూ.12.60 కోట్లు
ఉద్యాన శాఖ కార్యకలాపాలకు రూ.17 కోట్లు
వేర్‌హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.349.88 కోట్లు
సూక్ష్మసేద్యం కోసం రూ.56 కోట్లు
బ్లూ రెవెల్యూషన్ కోసం రూ.19.54 కోట్లు

సంక్షేమ రంగానికి రూ.30,592 కోట్లు
2017-18 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, మహిళాశిశు సంక్షేమ శాఖలకు కలిపి రూ.30,592.46 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇవి రూ. 8,642.82 కోట్లు (39.37 శాతం) అదనం. ( 2016-17 కేటాయింపులు రూ. 21,949.64 కోట్లు)

కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
బడ్జెట్‌లో మార్పుల నేపథ్యంలో షెడ్యుల్డ్ కులాల (ఎస్సీ) సబ్‌ప్లాన్ స్థానంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీఎస్‌డీఎఫ్), షెడ్యూల్డ్ తెగల కులాల (ఎస్టీ) సబ్ ప్లాన్ స్థానంలో గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీఎస్‌డీఎఫ్) విధానాలని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర అభివృద్ధి చర్యల్లో భాగంగా ఈ కొత్త పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు కాకపోతే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయనుంది. Education News
 • బడ్జెట్‌లో ఎస్సీల కోసం రూ.14,375.12 కోట్లు కేటాయించారు. 43 ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. 2016-17 బడ్జెట్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయించినది రూ.10,483.96 కోట్లుకాగా ఈ సారి కేటాయింపులు రూ.3,891.16 కోట్లు అదనం.
 • బడ్జెట్‌లో గిరిజనాభివృద్ధికి (ఎస్టీఎస్‌డీఎఫ్‌కు) రూ.8,165.87 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రూ.1,766.16 కోట్లు అందుతాయని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రూ.5,579.5 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ.9.28 కోట్లు కేటాయించింది. 2016-17 బడ్జెట్‌లో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ప్రభుత్వం రూ. 6,171.15 కోట్లు కేటాయించగా ఈ సారి రూ.1,994.72 కోట్లు అదనంగా ఇచ్చారు. SCSDF, STSDF IMAGES

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.5,070 కోట్లు
2017-18 బడ్జెట్‌లో బీసీలకు రూ.5,070.36 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు) కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ దానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రారంభం కానున్న బీసీ గురుకుల పాఠశాలల కోసం రూ. 161 కోట్లు ఇచ్చారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.753.31 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.252 కోట్లు కేటాయించారు. 2016-17లో బీసీలకు కేటాయించిన నిధులు రూ. 2,537.51 కోట్లు.

మైనార్టీ సంక్షేమం
మైనారిటీ సంక్షేమ శాఖకు 2017-18 రూ. 1,249.66 కోట్లు కేటాయించారు. ఇందులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.180 కోట్లు, బ్యాంకుల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలకు రూ.150 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.23 కోట్లు, వక్ఫ్ బోర్డుకు రూ.50 కోట్లు కేటాయించారు. మైనారిటీ గురుకులాల కోసం రూ.425 కోట్లు, దావత్ ఏ ఇఫ్తార్, క్రిస్‌మస్‌కు రూ.30 కోట్లు, ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.40 కోట్లు కేటాయించారు. ఈ శాఖకు 2016-17లో రూ. 1,204.44 కోట్లు ఇచ్చారు.

మహిళా, శిశు సంక్షేమం
బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి రూ.1,552.58 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.881.77 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.849.72 కోట్లు కేటాయించారు. మహిళల సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.106.36 కోట్లు, పౌష్టికాహార పంపిణీకి రూ.675.02 కోట్లు ఇచ్చారు. ఐసీడీఎస్ పథకానికి రూ.12 కోట్లు, గర్ల్ చైల్డ్ పరిరక్షణ పథకానికి రూ.10 కోట్లు కేటాయించారు.

వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,976 కోట్లు
బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు రూ.5,976.17 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది రూ. 3,310.09 కోట్లు కాగా ప్రగతి పద్దు కింద 2,666.08 కోట్లు కేటాయించారు. డ్రగ్స్‌ రూ.300 కోట్లు, మెడికల్ కాలేజీలకు రూ.42.24 కోట్లు, ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్ పరికరాల కొనుగోలుకు రూ.45 కోట్లు, ఆరోగ్యం, వైద్య విద్యలో మానవ వనరులను అభివృద్ధిపరచడం కోసం రూ.201 కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య విద్యకు రూ.505.18 కోట్లు కేటాయించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రానికి రూ.862.78 కోట్లు రానున్నాయి. వాటి ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సిబ్బంది నియామకాలు చేపడతారు. 2016-17లో వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నిధులు రూ.5,966.89 కోట్లు.
అలాగే హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒకటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని బడ్జెట్లో ప్రస్తావించారు. వీటికోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకు బ్యాంకు రుణం తీసుకునే అవకాశముంది.

కేసీఆర్ అమ్మ ఒడి, కేసీఆర్ కిట్
కాబోయే అమ్మలకు ‘కేసీఆర్ అమ్మఒడి’ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా పేద గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చేయించుకుంటే రూ.12 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. రూ.4 వేల చొప్పున మూడు విడతలుగా ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. ఆడ శిశువులు జన్మిస్తే అదనంగా మరో రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే బాలింతకు, పుట్టిన నవజాత శిశువుల సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘కేసీఆర్ కిట్లు’అని నామకరణం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.605 కోట్లు కేటాయించింది.

వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని ముఖ్య కేటాయింపులు...
 • డ్రగ్స్‌, మెడిసిన్‌‌స కేంద్రీకృత కొనుగోలుకు రూ.245.19 కోట్లు.
 • నిమ్స్‌లో బీపీఎల్ కింద ఆరోగ్యశ్రీలోకి రాని పేదల వైద్యం కోసం రూ.10 కోట్లు. నిమ్స్‌లో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌ కోసం రూ.2 కోట్లు. నిమ్స్ అభివృద్ధికి రూ.36 కోట్లు కేటాయింపు.
 • 108, 104 అత్యవసర సర్వీసులకు కొత్త వాహనాల కొనుగోలుకు రూ.20 కోట్లు
 • మృతదేహాల తరలింపు ఉచిత వాహనాలకు రూ.10.25 కోట్లు.
 • 108 సేవలకు 53.56 కోట్లు, 104 సేవలకు 33.24 కోట్లు.
 • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు రూ.15.38 కోట్లు
 • ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ, సేవల కోసం రూ.40 కోట్లు
 • తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు సాయం కోసం రూ.65.15 కోట్లు.

విద్యా శాఖకు రూ. 12,705 కోట్లు
2017-18 బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.12,705 కోట్లు లభించాయి. ఇందులో పాఠశాల విద్యకు రూ.1,990.66 కోట్లు కేటాయించారు. 2016-17లో ప్రభుత్వం ఈ శాఖకు చేసిన కేటాయింపులు రూ. 10,736 కోట్లు.

విభాగాల వారీగా కేటాయింపులు (రూ. కోట్లలో)

విభాగం

2016-17 (సవరణ)

2017-18 కేటాయింపులు

పాఠశాల విద్య

8,224.63

10,215.30

ఉన్నత విద్య

1,680.97

2,110.57

సాంకేతిక విద్య

443.02

379.85

మొత్తం

10,348.62

12,705.72


పద్దుల వారీగా కేటాయింపుల వివరాలు.. (రూ. కోట్లలో)

విభాగం

గతేడాది నాన్ ప్లాన్

ప్లాన్

ప్రస్తుతం నిర్వహణ పద్దు

ప్రగతి పద్దు

పాఠశాల విద్య

6,940.94

1,283.69

8,157.04

2,058.26

ఉన్నత విద్య

1,489.87

191.10

1,546.98

563.58

సాంకేతిక విద్య

263.38

179.64

318.99

60.85

మొత్తం

8,694.19

1,654.43

10,023

2,682.69


విశ్వవిద్యాలయాలకు రూ.820 కోట్లు
రాష్ట్రంలో యూనివర్సిటీల నిర్వహణ, అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.820 కోట్లు కేటాయించారు. ఇందులో వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ. 400.06 కోట్లు కాగా ప్రగతి పద్దు కింద మరో రూ. 420.89 కోట్లు ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీకి శతాబ్ది ఉత్సవాలు, అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఉన్నత విద్యలో వేతనాలు, ఖర్చులకు నిర్వహణ (ప్రణాళికేతర) పద్దు కింద రూ.1,546 కోట్లు, ప్రగతి (ప్రణాళిక) పద్దు కింద రూ.563 కోట్లు కేటాయించారు.

వివిధ వర్సిటీలకు కేటాయింపులు (రూ.కోట్లలో)

యూనివర్సిటీ

2016-17లో

2017-18లో

ఉస్మానియా

238.19

469.16

కాకతీయ

67.03

125.75

అంబేడ్కర్ ఓపెన్

8.03

29.08

తెలుగు వర్సిటీ

15.38

36.95

తెలంగాణ వర్సిటీ

28.29

50.66

మహాత్మాగాంధీ

15.00

56.95

శాతవాహన

21.69

28.4

పాలమూరు

8.10

45.76


ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ.1,939.31 కోట్లు
ఈ బడ్జెట్‌లో ఫీజు పథకానికి రూ.1,939.31 కోట్లు కేటాయించారు. అయితే రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించి ఫీజు బకాయిలు రూ.2,827.45 కోట్లు ఉన్నాయి.

పట్టణాభివృద్ధికి రూ.5,599 కోట్లు
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మొత్తంగా రూ. 5,599 కోట్లు కేటాయించింది. ఇందులో మాసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి మరో రూ.377.35 కోట్లు ఇచ్చారు. వరంగల్ నగరాభివృద్ధికి అభివృద్ధికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రయోజిత పథకాలైన స్మార్ట్ సిటీకి రూ.150.94 కోట్లు, అమృత్‌కు మరో రూ.203.96 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్లు కేటాయించింది.

యాదగిరిగుట్ట ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు, వేములవాడ ఆలయ అభివృద్ధికి మరో రూ.100 కోట్ల కేటాయింపులు చేశారు.

అభివృద్ధి పనులకు రుణాలు
రుణాల చెల్లింపునకు హైదరాబాద్ జల మండలికి రూ.1,420.50 కోట్లు కేటాయించగా, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం కేటాయించింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.250 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణ సహాయం కింద హెచ్‌ఎండీఏకు ఇవ్వనుంది. పురపాలికలు, కార్పొరేషన్లకు మరో రూ.192 కోట్ల రుణాలను కేటాయించింది.

హోంశాఖకు రూ.4,828 కోట్లు
హోంశాఖలోని విభాగాల ఆధునీకరణ, టెక్నాలజీ వినియోగం, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో రూ.4,828 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింది రూ.3,852.21 కోట్లు కాగా ప్రగతి పద్దు కింద రూ.975.95 కోట్లు కేటాయించారు.

పోలీసు శాఖలో కేటాయింపులు...
సీక్రెట్ సర్వీసెస్‌కు రూ.11.6 కోట్లు
హైదరాబాద్ నగర పోలీస్‌కు రూ.509.21 కోట్లు
ఆధునీకరణకు రూ.76 కోట్లు
నిర్మాణాలకు రూ.94 కోట్లు
అగ్నిమాపక కేంద్రాలకు రూ.12 కోట్లు
‘గిరిజన’ పథకాలకు రూ.15 కోట్లు
కేంద్రం నుంచి రూ.101 కోట్లు

పంచాయతీరాజ్ శాఖకు రూ.14,723 కోట్లు
పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయటంతో పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.14,723 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,891.09 కోట్లను నిర్వహణ పద్దుగా చూపగా, అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.12,832.32 కోట్లు కేటాయించింది.

గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి నిర్వహణ పద్దు కింద బడ్జెట్లో రూ.58.41 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ప్రగతి పద్దు కింద రూ.7,384 కోట్లు చూపింది. రూర్బన్, టీఆర్‌ఐజీపీ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం తదితర పథకాల అమలు కోసం రూ.330 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఉపాధిహామీ పథకానికి రూ.3 వేల కోట్లు కేటాయించారు.

ఆసరాకు భారీ కేటాయింపులు
సామాజిక భద్రతా పింఛన్ల పథకం ‘ఆసరా’కు ప్రభుత్వం రూ.5,330.59 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ప్రస్తుతం 36 లక్షల మంది లబ్ధిదారులుండగా, నెలనెలా పింఛన్ల కోసం ఏడాదికి రూ.4,800 కోట్లు అవసరమవుతున్నాయి. ఏప్రిల్ 1నుంచి ఒంటరి మహిళలకూ ఆసరా కింద ఆర్థిక భృతి అందించాలని నిర్ణయించడంతో సుమారు 2 లక్షల మందికి మరో రూ,.247 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.

మిషన్ భగరీథకు రూ.3 వేల కోట్లు
రూ.42 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన మిషన్ భగరీథ కార్యక్రమానికి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. బ్యాంకుల నుంచి రుణాలతో కలిపి 2017-18లో ఈ ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పరిశ్రమల శాఖకు రూ.985.15 కోట్లు
ఈ బడ్జెట్‌లోనూ పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం కొనసాగించింది. పరిశ్రమలు, వాటి పరిధిలోని లిడ్‌క్యాప్, చేనేత, చక్కెర, గనుల శాఖకు కలిపి మొత్తం రూ.985.15 కోట్లు కేటాయించింది. ఇందులో పరిశ్రమల ప్రోత్సాహక రాయితీల కింద రూ.155.39 కోట్లు, విద్యుత్ రాయితీలకు రూ.180 కోట్లు కేటాయించింది. మెదక్ జిల్లాలోని నిమ్జ్ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం కేటాయింపులను రూ.200 కోట్లకు పెంచింది.

ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు
అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీకి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. రాయితీ పాస్‌ల కింద రూ.520 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలుకు రుణంగా రూ.140 కోట్లు, ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ తీసుకున్న రుణాల చెల్లింపుకు రూ.334 కోట్లు కేటాయించింది.

రోడ్లు భవనాల శాఖకు రూ.5,300 కోట్లు
వార్షిక పద్దులో రోడ్లు భవనాల శాఖకు మొత్తంగా రూ.5,300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో రోడ్ల నిర్మాణానికి రూ.2700 కోట్లుగా పేర్కొంది. గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.50 కోట్లు, రేడియల్ రోడ్స్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. భవనాల విభాగానికి రూ.1,100 కోట్లు కేటాయించారు. కొత్త సచివాలయం కోసం రూ.50 కోట్లు కేటాయించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.600 కోట్లు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్లకు రూ.30 కోట్లు ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ.వెయ్యి కోట్లు
2017-18 బడ్జెట్‌లో సీఎం అధ్వర్యంలోని ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)కి రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించారు. 2016-17లో ఈ నిధికి రూ. 4,800 కోట్లు కేటాయించారు.

ఇతర శాఖలు కేటాయింపులు
 • పర్యాటక శాఖకు రూ.93 కోట్లు
 • విద్యుత్ శాఖకు రూ. రూ.4,484.3 కోట్లు.
 • దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించేందుకు రూ.50 కోట్లు.
 • పౌరసరఫరాల శాఖకు రూ.1,759.9 కోట్లు
 • ఐటీ రంగానికి రూ. రూ.252 కోట్లు
 • హరిత హారానికి రూ. 50 కోట్లు
 • కార్మిక, ఉపాధి, శిక్షణకు రూ.625 కోట్లు. ఇందులో ఐటీఐ విద్యార్థుల కోసం తలపెట్టిన సంకల్ప్ పథకానికి రూ.24.20 కోట్లు కేటాయింపు.
Published on 3/15/2017 5:48:00 PM

Related Topics