రైల్వే బడ్జెట్- సమగ్ర వివరణ


పోటీ పరీక్షల్లో కీలక పాత్ర వహించే బడ్జెట్‌లు, నివేదికలు, జనాభా లెక్కలపై అభ్యర్థులు అవగాహన పెంచుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. వీటికి సంబంధించిన అంశాలనుంచి పరీక్షల్లో దాదాపు 15 శాతం ప్రశ్నలు వస్తుంటాయి.

2012-13 సంవత్సరానికి రైల్వే మంత్రి దినేష్ త్రివే ది బడ్జెట్‌ను మార్చి,14 న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.61,100 కోట్లు. ఇందులో కేంద్రం నుంచి రూ.24,000 కోట్లు,అంతర్గత వనరుల ద్వారా రూ.18,050కోట్లు,మార్కెట్ రుణాలు రూ.15,000, ఇతరాలు రూ.1050 కోట్లు సమీకరించనుంది. రైలు మార్గాలు, వంతె నలు, సిగ్నలింగ్ టెలికాం, బోగీలు, వ్యాగన్ల సంఖ్య పెంపు, రైల్వే స్టేషన్లు, సరుకు రవాణా టెర్మినల్లు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అన్ని తరగతులపై చార్జీలు పెంచారు. అయితే దీనిపై వచ్చిన విమర్శల వల్ల మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత మంత్రిగా నియమితులైన ముకుల్ రాయ్ చార్జీలు తగ్గిస్తున్నట్లు లోక్‌సభలో ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌పై సమగ్ర వివరణ...మీ కోసం

రైల్వే బడ్జెట్ సమగ్ర స్వరూపం: (సవరించిన అంచనాలు(రూ.వేల కోట్లలో))
2011-12 12-13
స్థూల ట్రాఫిక్ వసూళ్లు 103.92 132.55
నిర్వహణ వ్యయం 98.61 112.40
నికర ఆదాయం 7.14 22.23
డివిడెండ్ 5.65 6.68
నిర్వహణ రేషియో 95.0% 84.9%
మొత్తం మిగులు 1.49 15.56

ముఖ్యమైన ప్రతిపాదనలు:
 1. కకోద్కర్ కమిటీ సిఫార్సుల మేరకు స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన నియంత్రణ సంస్థగా రైల్వే రక్షణ అథారిటీ ఏర్పాటు చేయడం.
 2. ఆధునికీకరణ పథకాల ఆచరణకు పిట్రోడ కమిటీ సిఫార్సుల మేరకు కమిషన్‌ను ఏర్పాటు చేయడం.
 3. మార్కెటింగ్, భద్రతా, పరిశోధనకు రైల్వే బోర్డులో ఇద్దరు కొత్త సభ్యులు.
 4. కకోద్కర్, శ్యామ్ పిట్రోడా కమిటీ సూచనల మేరకు ట్రాక్‌లు, వంతెనలు, సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, సరుకు రవాణా పెంచడం, స్టేషన్‌ల ఆధునికీకరణ, ప్రయాణీకుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించారు.
 5. విపత్తులను ఎదుర్కోవడానికి కావాల్సిన నెపుణ్యం సాధించడానికి బెంగళూరు, ఖరగ్‌పూర్, లక్నో వద్ద మూడు భద్రతా గ్రామాలు(సేఫ్టీ విలేజ్)ఏర్పాటు చేస్తారు.
 6. వచ్చే ఐదేళ్లలో రైల్వే లెవెల్ క్రాసింగ్‌లను తొలగించి వాటి స్థానంలో వంతెనలు నిర్మించడానికి రైల్-రోడ్ గ్రేడ్ సపరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు.
 7. రైల్వే టారిఫ్ నియంత్రణ అథారిటీ ఏర్పాటుకు పరిశీలన.
 8. అన్ని స్టేషన్‌లను ఆధునికీకరించడానికి ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను పీపీపీ (పబ్లిక్ ప్రైవే టు పార్టనర్‌షిప్)పద్ధతిలో ఏర్పాటు చేస్తారు.
 9. ప్రస్తుతమున్న రైల్వే గూడ్‌‌స షెడ్‌‌స అభివృద్ధి, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్‌‌కలు ఏర్పాటుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.
 10. రైల్వే వ్యాగన ్ల లీజు, కంటైనర్‌ల తయారీ ,మొదలైన వాటిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం.
 11. ప్రయాణీ కుల సౌకర్యార్థం చత్తీస్‌గఢ్‌లో మూడు కొత్త కారిడార్‌లను ఏర్పాటుకు ఒప్పందం.
 12. వ్యయాన్ని పంచుకునే పద్ధతిపై ఆంధ్రప్రదేశ్‌తో 12 రైల్వే ప్రాజెక్టులు, ఏర్పాటుకు ప్రతిపాదన ప్రణాళిక సంఘం వద్ద ఆమోదం కోసం మరో నాలుగు ప్రాజెక్టులు.
పొరుగు దేశాలతో సంబంధాలు
 1. నేపాల్‌కు రైలు నడపడానికి జోగ్ బానీ-బీరట్‌నగర్, జయ్‌నగర్-బిజల్‌పుర-బర్దిబాస్ కొత్త లైన్లు నిర్మాణంలో ఉన్నాయి.
 2. అగర్తల నుంచి బంగ్లాదేశ్‌లోని అకౌరాకు కొత్త లైన్ నిర్మాణం 2012-13లో చేపట్టనున్నారు. (ప్రస్తుతం కోల్‌కత్తా -ఢాకా మధ్య మైత్రి ఎక్ ్సప్రెస్ నడుస్తోంది.)
మెట్రోపాలిటన్ ప్రాజెక్టులు:
 1. ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను వాణిజ్యపరంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు.
 2. నేషనల్ ైహైస్పీడ్ రైల్ అథారిటీ ఏర్పాటు.
 3. 2012-13లో ఢిల్లీ-జైపూర్,అజ్మీర్ -జోధ్‌పూర్ హైస్పీడ్ కారిడార్ పరిశీలన.
 4. చెన్నై- బెంగళూరు, హబీబ్‌గంజ్- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య రెండు డబుల్ డెక్కర్ రైళ్ల ఏర్పాటు.
రైల్ ఆధారిత పరిశ్రమలు:
 1. రాయబరేలిలోని కోచ్ ప్యాక్టరీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం
 2. ఒరిస్సాలోని గంజామ్ జిల్లా సీతాపల్లిలో వ్యాగన్ల పరిశ్రమ ఏర్పాటు.
 3. కేరళ ప్రభుత్వ సహాయంతో పాలక్కడ్ వద్ద రైలు కోచ్‌ల పరిశ్రమ, అలాగే అదనపు కోచ్‌ల తయారీ విభాగాలను గుజరాత్‌లోని ఖచ్, కర్ణాటకలోని కోలార్ వద్ద ఏర్పాటు చేస్తారు.
 4. మధ్యప్రదేశ్‌లోని విదిషాలో అధిక హార్‌‌సపవర్ డీజిల్ ఇంజన్‌లకు ట్రాక్షన్ ఆల్టర్నేటివ్‌‌స తయారీకి ప్లాంట్ ఏర్పాటు.
గ్రీన్ ఇనీషియేటివ్‌‌స
 1. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కే రళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో 72 మెగావాట్ల సామర్థ్యమున్న గాలిమరలను ఏర్పాటు చేయనున్నారు.
 2. 200 గ్రీన్ రైల్వే స్టేషన్‌లను పూర్తిగా సౌర విద్యుత్తు వినియోగంలోకి తేవడం.గ్రీన్ రైలును ప్రవేశపెట్టడం.
 3. 1000 మానవ సహిత లెవెల్ క్రాసింగ్‌లకు సౌరవిద్యుత్తు అందిస్తారు.
 4. 2500 కోచ్‌ల్లో గ్రీన్ టాయిలెట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
 5. డీజిల్ లోకోమోటివ్‌‌సలో కాలుష్య పరిశీలనకు మొబైల్ టెస్ట్ కార్లను ఏర్పాటు చేస్తారు.
ప్రయాణీకుల సదుపాయాలు
 1. అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో 321 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం. వాటిలో 2012-13 సంవత్సరానికి 50 పూర్తి చేస్తారు.
 2. ఈమెయిల్, ఎస్సెమ్మెస్ ద్వారా బుక్-ఎ-మీల్ సదుపాయం ప్రవేశపెట్టనున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన హైజెనిక్ ఆహార పదార్థాలు లభ్యం.
 3. శతాబ్ది రాజధాని, దురంతో రైళ్లలో రైలు బంధు మాగజీన్‌లు.
 4. 151 పోస్టాఫీసుల ద్వారా పీఆర్‌ఎస్ (రిజర్‌‌వడ్) టికెట్ల విక్రయం.
 5. రైలు ఉండే ప్రదేశాన్ని గుర్తించే వ ్యవస్థ ద్వారా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్, ఇంటరె ్నట్ రూపంలో సమాచారం చేరవేసే శాటిలైట్ బేస్డ్ రియల్‌టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టం(సిమ్రాన్) ఏర్పాటు
 6. స్టేషన్లు, రైళ్ల పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు ప్రతే ్యక హౌస్ కీపింగ్ వ్యవస్థ ఏర్పాటు.
 7. వికలాంగులకు ప్రతి రైళ్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బోగీలు.
 8. అధునాతన లాండ్రీ సేవలు, ప్రధాన స్టేషన్లలో ఏసీ లాంజ్‌లు.
 9. నాణేలు, నోట్లతో టికెట్‌లు జారీ చేసే యంత్రాలు ఏర్పాటు.
 10. ఈ టికెట్ తీసుకున్న వారు మొబైల్‌కి వచ్చిన ఎస్సెమ్మెస్‌ను ఆధారంగా చూపిస్తే సరిపోతుంది.
క్రీడలు:
 1. 10 మంది రైల్వే ఉత్తమ క్రీడాకారులకు రైల్ ఖేల్త్న్ర అవార్డు ప్రదానం చేస్తారు.
 2. 2011-12 సంవత్సరానికి ఇప్పటికే 7 మంది క్రీడాకారులకు అర్జున, ధ్యాన్‌చ ంద్ పురస్కారాలు ప్రదానం చేశారు.
 3. 2012 లండన్ ఒలింపిక్స్‌కు 5 మంది రైల్వే ఉద్యోగులు అర్హత సాధించారు.
కొత్త రైళ్లు, సబ్ అర్బన్ సర్వీసులు
 1. దేశ వ్యాప్తంగా 75 ఎక్స్‌ప్రెస్‌లు, 21 ప్యాసింజర్‌లను కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. అలాగే 9 డెము సర్వీసులు, 8 మెము సర్వీసులు ప్రవేశపెడతారు.
 2. ముంబై సబర్బన్‌లో 75 రైళ్లు. కలకత్తా సబ్‌అర్బన్ ప్రాంతంలో 44 కొత్త సర్వీసులు, చెన్నైలో 18 రైళ్లు ఏర్పాటు చేయనున్నారు.
రాయితీలు:
 1. ప్రయాణీకులకు ఇస్తున్న మొత్తం రాయితీలు సంవత్సరానికి రూ.800 కోట్ల పైమాటే.
 2. అప్లాస్టిక్ ఎనీమియా, సికిల్‌సెల్ ఎనీమియాతో బాధపడేవారికి సెకండ్, థర్‌‌డ ఏసీ, చైర్ కార్, స్లీపర్ తరగతుల చార్జీల్లో 50 శాతం రాయితీ.
 3. ఇజ్జత్ పథకం కింద ప్రయాణించే దూరం 100 నుంచి 150 కి.మీ కు పెంచారు. పేదలకు నిర్ధేశించిన ఈ పథకం కింద చార్జీ రూ.25
భద్రత:
 1. గుర్తించిన 202 స్టేషన్లలో 2012-13 చివరి కల్లా సమగ్ర భద్రతా వ ్యవస్థ ఏర్పాటు.
 2. ఆర్పీఎఫ్, జీఆర్‌పీ భద్రతా 3500 రైళ్లకు పొడగింపు.
 3. ఆలిండియా ప్యాసింజర్ హైల్ప్‌లైన్‌తో ఆర్పీఎఫ్ హెల్ప్‌లైన్ ఏకీకరిస్తారు.
ఉద్యోగుల సంక్షేమం, నియామకం:
 1. ఉద్యోగులకు వారి పని ప్రదేశాల్లో వెల్‌నెస్ పోగ్రామ్ ప్రవేశపెట్టడం.
 2. నైపుణ్యం కల్గిన, టెక్నికల్ ఉద్యోగులకు తగినంత విశ్రాంతి కల్పించడం.
 3. 2012-13 సంవత్సరానికి లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించడం. 2011-12 కి 80 వేల మందిని నియమించారు.
ఇతరాలు:
 1. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను 3 నుంచి 5 రూపాయలకు పెంచారు.
 2. ఇండియన్ రైల్వేస్ బెంగళూరు సిటీ స్టేషన్‌లో ‘బ్లూఫై’ను ప్రవేశపెట్టింది. బ్లూటూత్, వైఫైల ద్వారా ఇంటర్నెట్‌ను అందించే సదుపాయమే ఈ ‘బ్లూఫై’. 2012 మార్చి 2న దీన్ని దేశంలో తొలిసారిగా ఈ స్టేషన్‌లో ప్రవేశపెట్టారు. ప్రయాణికులు ఈ స్టేషన్‌లో తమ సెల్‌ఫోన్ బ్లూటూత్ లేదా వైఫై ఓపెన్ చేసి ఇంటర్నెట్‌కు అనుసంధానం కావచ్చు. రైల్వే సమాచారం తెలుసుకోవచ్చు.
 3. ఛార్జీల మొత్తాన్ని రౌండాఫ్ చేయాలని నిర్ణయించారు. అంటే రూ. 5కు దగ్గరగా ఉన్న సంఖ్యలను 5గా పదికి దగ్గరగా ఉన్న చార్జీలను 10గా మార్చుతారు. ఉదాహరణకు చార్జీ రూ.18 ఉంటే దానిని రూ.20గా చేస్తారు. రూ. 13 రూపాయలు ఉంటే రూ. 15గా పరిగణిస్తారు
 4. 12 వ ప్రణాళిక కాలంలో దాదాపు 6,500 కి.మీ లైన్లను విద్యుదీకరించనున్నారు.
 5. 19 వేల కిలోమీటర్ల పట్టాల ఆధునికీకరణ చేసి, రైళ్ల వేగాన్ని 160 కి.మీ కు పెంచనున్నారు. 2017 కల్లా దేశంలోని మొత్తం రైళ్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చనున్నారు.
 6. కొత్త శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను హోరా-న్యూజల్పాయ్ గురి మధ్య నడపనున్నారు.
 7. రాష్ర్టంలోని సత్తెనపల్లి, దువ్వాడ, మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండలను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించారు.
 8. వెయిట్ లిస్టింగ్‌లో ఉన్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు.
 9. కాశ్మీర్ లోయకు రైలు నడిపే దిశగా పిర్‌పంజాల్ శ్రేణి మీదుగా 11 కి.మీ పొడవున నిర్మాణం చేపడతారు.
అంకెల్లో బడ్జెట్.....
మొత్తం బడ్జెట్ 60,100 కోట్లు
కొత్త లైన్ల పొడవు.. 725 కి.మీ.(ఖర్చు: 6,872 కోట్లు)
కొత్త డబ్లింగ్ పనులు 700 కి.మీ.(ఖర్చు: రూ.3,393 కోట్లు)
ఈ ఏడాది గేజ్ మార్పిడి లక్ష్యం 800 కి.మీ. (ఖర్చు: రూ.1,950 కోట్లు)
ఈ ఏడాది లైన్ల విద్యుదీకరణ లక్ష్యం  
100 కి.మీ. ఖర్చు: రూ.828 కోటు  
ఈ ఏడాది భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య 1,00,000 పోస్టులు
దేశ వ్యాప్తంగా కొత్తగా ప్రారంభం 75 ఎక్స్‌ప్రెస్‌లు 21 ప్యాసింజర్‌లు
ముంబైలో అదనపు సేవలు 75 సబర్బన్ రైళ్లు
కోల్‌కతాలో కొత్త సర్వీసులు 50 మెట్రో రైళ్లు
కోల్‌కతాలో కొత్తగా సేవలు 44 సబర్బన్ రైళ్లు
చెన్నైలో అదనంగా.. 18 సబర్బన్ రైళ్లు
కొత్త డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్‌లు 9 డెమూ
కొత్త మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు 8 మెమూలు
దేశంలో ఇప్పటికే ఉన్న సర్వీసుల పొడిగింపు 39 రైళ్లు
రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు 23
కొత్త ఎస్కలేటర్లు 321 వీటిలో 50 ఈ ఏడాదే పూర్తి చేస్తారు
మన రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో దక్కింది. 18 కొత్త ఎక్స్‌ప్రెస్‌లు

చరిత్రలో కొన్ని ముఖ్య సంఘటనలు
1853: ఏప్రిల్ 16న దేశంలో మొదటి సారిగా 14 బోగీల ఫాల్క్‌ల్యాండ్ స్టీమ్ ఇంజిన్ ముంబై ( ఛత్రపతి శివాజీ టెర్మినస్)నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న థానే నడిచింది

1893: నల్లవాడనే కారణంతో మహాత్మా గాంధీకి దక్షిణాఫ్రికాలో 1893లో అవమానం జరిగింది. డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లే రైల్లో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎక్కారంటూ గాంధీని పీటర్‌మారిట్జ్‌బర్గ్ వద్ద నిర్దాక్షిణ్యంగా ఫ్లాట్‌ఫాంపైకి తోసివేశారు.

1975: జనవరి 2న బీహార్‌లోని సమస్తిపూర్. అప్పటి రైల్వేమంత్రి ఎల్‌ఎన్ మిశ్రా ఓ రైల్వేలైన్ ప్రారంభించడానికి వచ్చారు. ఒక్కసారిగా భారీ పేలుడు. శర్మతోపాటు చాలామంది చనిపోయారు. అసలు ఈ బాంబు పేలుడుకు కారణమెవరు? మంత్రిని ఎందుకు హతమార్చారు? ఈ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు.

2002: ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి కరసేవకులతో వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు గుజరాత్‌లోని గోధ్రాలో కొందరు నిప్పు పెట్టారు. ఎస్ 6 బోగీలోని 58 మంది మసైపోయారు. ఈ ఘటన మతకల్లోలాలకు దారితీసింది. 2 వేలకు పైగా అసువులుబాశారు.

మరికొన్ని....
 1. భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బోంబే నుంచి థానే మధ్య (35 కిలోమీటర్లు) నడిచింది. దీన్నే భారత్‌లో తొలి రైలుగా పేర్కొంటారు.
 2. దక్షిణ భారత్‌లో తొలి రైలు మద్రాస్ నుంచి వాల్లజా రోడ్ వరకు 1856 జూలై 1న పరుగు పెట్టింది.
 3. 1871-74 మధ్య పలు ప్రయాణికుల రైళ్లలో గ్యాస్ దీపాలు అమర్చారు. 1874లో సీట్లు లేని నాలుగో తరగతి కోచ్‌లు తీసుకొచ్చారు.
 4. 1952లో ప్రయాణికుల బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు తప్పనిసరి చేశారు.
 5. దూరప్రాంత రైళ్లలో రెండో తరగతి స్లీపర్ క్లాస్ బోగీలను 1967లో ప్రవేశపెట్టారు.
 6. తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది.
 7. రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్‌లు (ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1907లో వాటిని ఏర్పాటుచేశారు.
 8. తొలి రైల్వే వంతెన: ముంబై-థానే మార్గంలోని దపూరీ వయాడక్ట్
 9. తొలి, భూగర్భ రైల్వే: కలకత్తా మెట్రో
 10. చిన్న పేరు కల్గిన రైల్వేస్టేషన్ ‘ఇబ్’. ఇది హౌరా-నాగ్‌పూర్ ప్రధాన మార్గంలో ఉంది. ఆనంద్-గోద్రా సెక్షన్‌లోని ‘ఒద్’ స్టేషన్ పేరు కూడా చిన్నదే.
 11. పెద్ద పేరు కల్గిన స్టేషన్ ‘శ్రీ వెంకటనరసింహరాజువారి పేట’. ఇది అరక్కోణం-రేణిగుంట సెక్షన్‌లో ఉంది.
 12. అత్యధిక దూరం ప్రయాణించే రైలు: హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ (జమ్మూతావి నుంచి కన్యాకుమారి వరకు 3,715 కిలోమీటర్లు)
 13. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు)... ప్రతిరోజూ అత్యధిక దూరం ప్రయాణించే రైలు: కేరళ ఎక్స్‌ప్రెస్ (3,054 కిలోమీటర్లు 42.5 గంటల్లో)
 14. ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు: త్రివేండ్రమ్ రాజధాని (525 కిలోమీటర్లు 6.5 గంటల్లో)
 15. ప్రపంచంలోనే పొడవైన ప్లాట్‌ఫాం: ఖరగ్‌పూర్ (2,733 అడుగులు)
 16. పొడవైన రైల్వే వంతెన: సోనె నదిపై నెహ్రూ సేతు (10044 అడుగులు)
 17. పొడవైన టన్నెల్: కొంకణ్ రైల్వేలోని కుర్బుడ్ టన్నెల్ (6.5 కి.మీ.)
 18. ఎక్కువ హాల్ట్‌లు కల్గిన రైలు: హౌరా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్(115 హాల్ట్‌లు)
 19. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. అమెరికా, రష్యా, చైనాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
 20. సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యం లేదు.
 21. దేశవ్యాప్తంగా 64,015 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంది. అందులో విద్యుదీకరణ కల్గిన ట్రాక్ 14,261 కిలోమీటర్లు. 7,092 స్టేషన్లు, దాదాపు 16 లక్షల మందికి పైగా సిబ్బంది భారతీయ రైల్వే సొంతం.
 22. భారత్‌లోని రైలు అత్యధిక వేగం గంటకు 184 కిలోమీటర్లు. 2000 సంవత్సరంలో నిర్వహించిన పరీక్షలో భాగంగా ఢిల్లీ-ఘజియాబాద్ మార్గంలో ఈ వేగం నమోదైంది.
 23. తొలి డబల్ డెక్కర్ రైలు 2005లో ముంబై సెంట్రల్, సూరత్ మధ్య నడిచింది.
 24. ఎక్కువ రాష్ట్రాల ద్వారా ప్రయాణించే రైలు పేరు నవయుగ్ ఎక్స్‌ప్రెస్. మంగళూరు-జమ్ముతావి మధ్య నడిచే ఈ ట్రైన్.. కర్ణాటక, కేరళ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ద్వారా వెళ్తుంది.
Published on 4/2/2012 6:23:00 PM

Related Topics