ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21


కరోనా వంటి విపత్కర కాలంలోనూ రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జూన్ 16న అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ 2020-21ను ప్రవేశపెట్టారు.
Budget 18-19మొత్తం రూ.29,159.97 కోట్లతో వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి రూ.6,885.60 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లను కేటాయించారు.

ప్రధాన కేటాయింపులు (రూ.కోట్లలో)
వ్యవసాయ శాఖకు ప్రతిపాదనలు 15,399.52
ఉద్యాన శాఖ 653.02
పట్టు పరిశ్రమ శాఖ 92.18
పశు సంవర్థక శాఖ 854.77
మత్స్యశాఖ అభివృద్ధి 299.27
సహకార శాఖ 248.38

కొన్ని ముఖ్య ప్రతిపాదనలు (రూ.కోట్లలో)
రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి ప్రతిపాదనలు 6,885.60
ధరల స్థిరీకరణ నిధి 3,000
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 4,450
వ్యవసాయ ఉపాధి హామీ పథకానికి 6,270
శీతలీకరణ గిడ్డంగులు, గోదాముల నిర్మాణం 200
రైతు భరోసా కేంద్రాలకు 100
వైఎస్సార్ ఉచిత పంటల బీమా 500
ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లకు 50.36
వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలు 65
వైఎస్సార్ వడ్డీ లేని పంట రుణాలు 1,100
దురదృష్టవశాత్తు మరణించే రైతులకు ఎక్స్‌గ్రేషియో 20
ఏపీ అగ్రీ మిషన్‌కు 2.61
రారుుతీపై విత్తన సరఫరాకు 200
వ్యవసాయ యాంత్రీకరణకు 207.83
సమీకృత వ్యవసాయ విధానానికి 141.73
ప్రకృతి వ్యవసాయ విధానానికి 225.51
ప్రకృతి విపత్తుల సహాయ నిధి 2,000
సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు 150.985
సూక్ష్మసేద్య పథకానికి 411.95
ఆరుుల్ పామ్ తోటల సాగు ప్రోత్సాహకానికి 44.70
వైఎస్సార్ పశు నష్టపరిహార పథకానికి 50
పశు వైద్యశాలల మందుల సరఫరాకు 56.74
పాల సేకరణ కేంద్రాల బలోపేతానికి 50
దూడల సంరక్షణ పథకానికి 5
పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలకు 25
ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ కేంద్రాలు, జెట్టీలకు 100
మూడు యూనివర్శిటీలకు కేటాయింపులు(రూ.కోట్లలో)..
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 402
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 88.60
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.73

వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
 • దళారుల నియంత్రణకు త్వరలో కొత్తచట్టాన్ని తీసుకువస్తాం.
 • వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలుకు 2020 ఏడాది ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
 • విత్తనాలు, ఎరువుల నాణ్యత నిర్ధారణకు వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటు.
 • రైతు సంక్షేమం కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు
 • విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్-155251 ఏర్పాటు
 • శీఘ్రగతిన వ్యవసాయ మండళ్ల ఏర్పాటు
 • త్వరలో విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ల నియామకం
 • ఉద్యాన వర్శిటీ నుంచి కొత్త వంగడాల రూపకల్పన
 • బైవోల్టిన్ పట్టు పరిశ్రమ ప్రోత్సాహానికి చర్యలు.. ‘ఉపాధి’ పథకం కింద మల్బరీ తోటల పెంపకం
 • 147 నియోజకవర్గస్థారుు పశువ్యాధి నిర్ధారణా కేంద్రాల ఏర్పాటు
 • సహకార రంగ సంస్కరణకు చర్యలు, త్వరలో కంప్యూటరీకరణ
 • పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
 • వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేసి బంజరు భూములను వ్యవసాయ భూములుగా మారుస్తాం
 • రైతు పండించే పంటల్ని ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్ జనతా బజార్లను ప్రారంభిస్తాం
 • ప్రతి గ్రామంలో గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం
 • రాయలసీమలో ప్రకృతి వ్యవసాయ పరిశోధన, శిక్షణ, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నాం
ధరల స్థిరీకరణ నిధికి రూ. 3,000 కోట్లు Budget 18-19
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించని పక్షంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2020-21 బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లను కేటాయించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు సైతం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.

పశు సంవర్థక, మత్స్యశాఖకు రూ. 1280 కోట్లు
గామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే పశు సంవర్థక, మత్స్య శాఖలకు 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,280.11 కోట్లు కేటాయించింది. ఇందులో పశు సంవర్థక శాఖకు రూ.980.48 కోట్లు.. మత్స్యశాఖకు 299.63 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయం తరువాత పశుపోషణ ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు నష్టపరిహారం, రాజన్న పశువైద్యం, పశు విజ్ఞానబడి వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. అలాగే, రైతుభరోసా కేంద్రాల్లో పశువులకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి గత ఏడాది పశు సహాయకులను నియమించింది.

విద్యుత్తుకు రూ.6,949 కోట్లు కేటాయింపు
విద్యుత్ రంగానికి 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.6,949.65 కోట్లు కేటాయించింది. 2018-19తో పోలిస్తే ఇది రూ.4,811.43 కోట్లు ఎక్కువ. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేసేందుకు వీలుగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రధానంగా ప్రస్తావించారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.4,500 కోట్లు కేటారుుంచింది. రబీ నాటికి వంద శాతం ఫీడర్ల ద్వారా సరఫరా కోసం ప్రత్యేకంగా లైన్లు, సబ్ స్టేషన ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

విద్యుత్తుకు ఏ సంవత్సరం ఎంత బడ్జెట్ (రూ.కోట్లల్లో)
సంవత్సరం కేటాయింపులు
2017-18 3,617.33
2018-19 2,138.22
2019-20 (రివైజ్డ్) 11,592.04
2020-21 (అంచనా) 6,949.65
Published on 6/18/2020 4:25:00 PM

Related Topics