బడ్జెట్ ముఖ్యాంశాలు:


Budget 2015 - 16
 • ఈసారి ప్రణాళిక వ్యయం కింద రూ. 52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 63,306 కోట్లను సర్కారు ప్రతిపాదించింది.
 • తొలి బడ్జెట్‌లో రూ. 301.02 కోట్ల మిగులు చూపించిన ప్రభుత్వం.. ఈసారి రూ. 531 కోట్లు చూపించింది.
 • ద్రవ్యలోటు రూ. 16,969 కోట్లుగా అంచనా. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో ఇది 3.49 శాతం.
 • ఈ ఏడాది పన్నుల ద్వారా మొత్తం రూ.46,494.75 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. గతేడాదితో పోల్చితే వ్యాట్ ద్వారా రూ. 11,116 కోట్ల అదనపు రాబడే లక్ష్యం.
 • మద్యం అమ్మకాల ద్వారా రూ. 12 వేల కోట్ల ఆదాయం రాబట్టుకునే ప్రయత్నం.
 • ఇసుక క్వారీలు, విక్రయాల ద్వారా రూ. 1500 కోట్లకుపైగా ఆదాయం అంచనా.
 • గత ఏడాది భూముల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ. 6,500 కోట్లు వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. వెయ్యి కోట్ల రాబడి వచ్చింది. ఈసారి ఏకంగా రూ. 13,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
 • గత ఏడాది ఉద్యోగుల జీతాలకు రూ.16,965.33 కోట్లు ఖర్చు చేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,045.23 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు రూ.8,235.87 కోట్లు అవసరం.
 • మిషన్ కాకతీయలో భాగంగా 9,308 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రూ.2,083 కోట్లు కేటాయించింది.
 • భారీ నీటిపారుదల, చిన్న నీటిపారుదల, వ్యవసాయం, పాఠశాల, ఉన్నత విద్య, గ్రామీణాభివద్ధి, విద్యుత్ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది.
 • ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆహార భద్రత, ఆసరా, కళ్యాణలక్ష్మి, రైతు రుణాల మాఫీ, పథకాలకు సముచిత నిధులు కేటాయించింది.
 • ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ నిర్బంధ విద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పనను ఈ బడ్జెట్టులో ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
విభాగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు (రూ.కోట్లలో)

విభాగం

ప్రణాళికేతర

ప్రణాళిక

మొత్తం

వ్యవసాయం, సహకారం

4930

1598

6528

పశుసంవర్థక, డెయిరీ, మత్స్యాభివృద్ధి

517

233

750

మార్కెటింగ్

141

464

605

బీసీ సంక్షేమం

247

1925

2172

పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికం

271

283

554

ఉన్నత విద్య

1754

408

2162

విద్యుత్

6027

1373

7400

మాధ్యమిక విద్య

7976

1078

9054

ఆహార, పౌరసరఫరాలు

2300

40

2340

ఆర్థిక

20408

150

20558

సాధారణ పరిపాలన

348

105

452

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

2473

2459

4932

పోలీసు విభాగం

3960

353

4313

గృహనిర్మాణం

42

832

874

నీటిపారుదల

3234

8500

11734

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు

10

21

31

పరిశ్రమలు, వాణిజ్యం

114

859

974

ఐటీ, కమ్యూనికేషన్స్

2

132

134

కార్మిక, ఉపాధి కల్పన

381

70

451

న్యాయ శాఖ

767

50

817

శాసన వ్యవహారాలు

76

0

76

పురపాలక, పట్టణాభివృద్ధి

848

3176

4024

మైనార్టీ సంక్షేమం

5

1100

1105

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్

1

0

1

ప్రణాళిక విభాగం

66

764

830

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

1959

11225

13184

రెవెన్యూ

2084

266

2350

వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి

1

0

1

షెడ్యూల్ కులాల అభివృద్ధి

607

5547

6154

రహదారులు-భవనాలు

1178

4739

5917

గిరిజన సంక్షేమం

431

2878

3309

మహిళా,శిశు సంక్షేమం

78

1481

1559

యువజన, పర్యాటక సాంస్కృతిక

70

274

344

మొత్తం

63306

52383

115689

Budget 2015 - 16
Budget 2015 - 16

Published on 3/12/2015 5:31:00 PM