ఇతర రంగాలు - కేటాయింపులు


పోలీసు కమిషనరేట్ల ఆధునీకరణకు 220 కోట్లు
 • హైదరాబాద్ కమిషనరేట్‌కు నిధులను రూ.150 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌కు రూ.70 కోట్లు కేటాయించింది.
 • న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రభుత్వం గత బడ్జెట్‌లో కేటాయించిన విధంగానే ఈ బడ్జెట్‌లోనూ రూ.100 కోట్లు ఇచ్చింది.
రెండు పడక గదుల ఇళ్లకు రూ. 397.67 కోట్లు
 • రూ. 3.50 లక్షల వ్యయంతో నిరుపేదలకు రెండు పడకలతో సొంత ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. కానీ ఈ తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి దక్కింది రూ. 397.67 కోట్లే.
 • ఇందులో సాధారణ పద్దు కింద రూ. 184.90 కోట్లను ఇవ్వగా.. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 77.54 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ. 129.23 కోట్లు కేటాయించారు.
  Budget 2015 - 16
 • కొత్త బస్సుల కొనుగోలు, ఇతర అవసరాలకు ఆర్టీసీకి రూ.159 కోట్లు
 • ఎర్రగడ్డలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది.
 • అర్హత పొందిన బీపీఎల్ కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.6 కేజీల చొప్పున అందిస్తున్న బియ్యం, సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అందజేస్తున్న సన్నబియ్యానికి కలిపి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.2,200 కోట్లు కేటాయించింది. దీని ద్వారా సుమా రు 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు, 30 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది.
 • అర్హులైన పేదింటి మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి గతేడాది రూ.96 కోట్లివ్వగా ఈసారి రూ.50 కోట్లకు కుదించారు. ఈ నిధులతో సుమారు 3.15 లక్షల మందికి మాత్రమే దీపం కనెక్షన్లిచ్చే అవకాశముంది.
 • కొత్త పర్యాటక ప్రాజెక్టులకు రూ.20 కోట్లు కేటాయించారు. తెలంగాణ సాంస్కృతిక కేంద్రానికి మాత్రం రూ.100 కోట్లిచ్చింది. హైదరాబాద్, వరంగల్‌లలో సాంస్కృతిక సముదాయాలకు రూ.10 కోట్లు తదితర కేటాయింపులు చేసింది.
 • యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే నిమిత్తం ఏర్పాటు చేసిన అధారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు.
 • రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి చెల్లిస్తున్న మొత్తం రూ.16,965.33 కోట్లు. ఇటీవలే వేతన సవరణ స్కేళ్లను అమలు చేయాలని నిర్ణయించినందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెల్లించే మొత్తం రూ. 20,045.23 కోట్లు.
 • పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించే పింఛన్లు మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 6580.46 కోట్లు ఉంటే వచ్చే ఏడాదికి అంటే 2015-16కు అది రూ. 8,235.87 కోట్లు అవుతుంది.
 • రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై చెల్లించే వడ్డీ మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి రూ. 5925.06 కోట్లుకాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది రూ. 7554.91 కోట్లు.
 • తాజా బడ్జెట్‌లో స్మార్ట్ సిటీల పథకానికి రూ. 181.28 కోట్లను కేటాయించారు. ఇందులో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ. 31.26 కోట్లను, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ. 18.91 కోట్లను ఇచ్చింది.
 • రెవెన్యూ విభాగానికి బడ్జెట్లో రూ.1,686.80 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం 1,437.56 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం కింద రూ.249.24 కోట్లు చూపారు.
 • తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా అమరులైన వారికి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే నిమిత్తం ప్రభుత్వం రూ.90 కోట్లను బడ్జెట్లో కేటాయించింది.
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖకు ఈ బడ్జెట్లో కేవలం రూ.134 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.132కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.2 కోట్లుగా చూపారు.

Budget 2015 - 16

Published on 3/12/2015 5:58:00 PM