Sakshi education logo
Sakshi education logo
Careers Categories

గత సంవత్సరం కంటే క్లిష్టంగా ఉన్న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష.. మెయిన్స్‌కి 9వేల మంది మాత్రమే..!

Join our Community

facebook Twitter Youtube
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు.. సివిల్ సర్వీసెస్ 2020 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది.
Edu newsమొత్తం మూడంచెల ఎంపిక ప్రక్రియలో.. తొలిదశ ప్రిలిమినరీ పరీక్షకు.. దేశవ్యాప్తంగా దాదాపు ఆరున్నర లక్షల మంది హాజరైనట్లు అంచనా! రెండు తెలుగు రాష్ట్రాల నుంచి.. సుమారు నలభై వేల మంది ప్రిలిమ్స్ రాశారు. ఇప్పుడు వీరందరికి అనేక సందేహాలు. ముఖ్యంగా ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత ఉంటుంది?! ఎన్ని మార్కుల శ్రేణిలో ఉంటే.. మెయిన్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చు.. మెయిన్ ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలేంటి?! అనే ప్రశ్నలెన్నో!! ఈ నేపథ్యంలో.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష సరళి.. జనవరి 8 నుంచి జరగనున్న మెయిన్‌లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ...

సివిల్ సర్వీసెస్ మెయిన్.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన, రెండో దశ. ప్రిలిమ్స్‌లో చూపిన సత్తా, అందుబాటులో ఉన్న ఖాళీలను అనుసరించి మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్ట్‌కు 12 మంది చొప్పున మెయిన్‌కు అర్హత సాధిస్తారు. సివిల్స్-2020 నోటిఫికేషన్ ప్రకారం-మొత్తం పోస్టుల సంఖ్య 796. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 1:12 నిష్పత్తి విధానంలో తొమ్మిదిన్నర వేల మందికి మాత్రమే మెయిన్‌కు అర్హత లభిస్తుంది.

క్లిష్టంగానే ప్రిలిమ్స్..
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ప్రిలిమ్స్ పరీక్ష కొంత క్లిష్టంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జనరల్ స్టడీస్ పేపర్-1లో దాదాపు 40 శాతానికిపైగా ప్రశ్నలు ఆర్థిక,సామాజిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు, చరిత్ర నుంచే వచ్చాయి. జనరల్ సైన్స్‌లోనూ అనువర్తిత అంశాల ఆధారంగా ప్రశ్నలు అడిగారు. ఆయా టాపిక్స్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేసిన అభ్యర్థులే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నల తీరు ఉంది. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు సైతం ఆయా అంశాల భావనలపై స్పష్టత ఉంటేనే సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి.

ఇంకా చదవండి: part 2: సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష సబ్జెక్ట్‌ల వారీగా ప్రశ్నల విశ్లేషణ ఇలా..!
Published on 10/17/2020 5:35:00 PM

Related Topics