Sakshi education logo
Sakshi education logo
Careers Categories

ఇంటర్‌తోనే కేంద్ర కొలువు కొట్టే అవకాశం.. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్ విడుదల..

Join our Community

facebook Twitter Youtube
మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. సుస్థిరమైన కెరీర్.. ఇది చాలా మంది యువత కల. ఇలాంటి కొలువును అందించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్)-2020 నోటిఫికేషన్ విడుదలైంది.
Career guidanceఇంటర్మీడియట్ విద్యార్హతతోనే చిన్న వయసులోనే కేంద్ర కొలువులను సొంతం చేసుకునేందుకు చక్కటి అవకాశం.. సీహెచ్‌ఎస్‌ఎల్. ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు, అర్హతలు, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...

ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్..
పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, ఇతర కార్యాలయాల్లో ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం ఏటా సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునేందుకు ఇది ఒక సువర్ణావకాశం.

మొత్తం పోస్టులు..
{పస్తుత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యపై ఎస్‌ఎస్‌సీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. శాఖల వారీగా పోస్టుల వివరాలను తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

అర్హతలు..
లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ /సార్టింగ్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్(కాగ్ మినహా) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డేటాఎంట్రీ ఆపరేటర్(కాగ్)పోస్టులకు మాత్రం మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

వయసు..
2021 జనవరి1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలుత టైర్-1 ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారికి రెండో దశలో టైర్-2 డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. మూడో దశలో టైర్-3 స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్. తుది ఎంపిక టైర్1, టైర్-2 ఆధారంగానే జరుగుతుంది. టైర్-3 అనేది అర్హత పరీక్ష మాత్రమే.

టైర్-1 పరీక్ష(సీబీటీ)..
ఈ పరీక్షను ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ అనే నాలుగు విభాగాల ప్రశ్నలుంటాయి. ప్రతీ విభాగం నుంచి 25ప్రశ్నలు చొప్పున మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-50మార్కులు; జనరల్ ఇంటెలిజెన్స్ 25ప్రశ్నలు-50మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50మార్కులకు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతీ తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.

టైర్-2 పరీక్ష(డిస్క్రిప్టివ్)..
టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2 పరీక్షకు ఎంపిక అవుతారు. టైర్-2 పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ విధానంలో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 60నిమిషాలు. ఇందులో 2 ప్రశ్నలుంటాయి. వ్యాస రూప విధానంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వ్యాస రూప సమాధానమైతే 200-250 పదాల్లో రాయాలి. ఉత్తరం లేదా దేనికైనా దరఖాస్తు చేయడం గురించి రాయమంటే 150-200 పదాల్లో పూర్తిచేయాలి. ఈ పరీక్ష హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాల్సి ఉంటుంది.

టైర్-3..
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా కంప్యూటర్‌పై 15 నిమిషాలకు 2000 నుంచి 2200 కీ డిప్రిషన్స్ ఇవ్వాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) విభాగంలోని ఉద్యోగాలకు 15 నిమిషాలకు 3700-4000 కీ డిప్రిషన్స్ తప్పనిసరి. ఏదైనా సమాచారం ఇచ్చి దాన్ని కంప్యూటర్‌లో టైప్ చేయమంటారు. తప్పులు టైప్ చేస్తే మార్కులు తగ్గిస్తారు. టైపింగ్ టెస్ట్‌కు సంబంధించి ఇంగ్లిష్ లేదా హిందీ ఏదైనా మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంగ్లిష్ అయితే నిమిషానికి 35, హిందీ అయితే నిమిషానికి 30 పదాలు చొప్పున టైప్ చేయాల్సి ఉంటుంది. పది నిమిషాల కాలవ్యవధితో ఈ పరీక్ష ఉంటుంది.
 
Published on 11/19/2020 3:24:00 PM

Related Topics