Sakshi education logo
Sakshi education logo
Careers Categories

అబ్రాడ్‌లో చదవాలనుకునే వారికి అవకాశం ఐఈఎల్‌టీఎస్(IELTS)..పరీక్ష విధానం ఇలా..

Join our Community

facebook Twitter Youtube
విదేశీ చదువులకు ద ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌టీఎస్) పరీక్షలో ప్రతిభ కీలక ప్రామాణికంగా నిలుస్తోంది. ఐఈఎల్‌టీఎస్ స్కోరుతో ఆస్ట్రేలియూ, యూకే తదితర యూరప్ దేశాల్లోని టాప్ వర్సిటీల్లో ప్రవేశాలు లభిస్తాయి.
Edu news ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ అభ్యర్థులకు ఉపయోగపడేలా ఐఈఎల్‌టీఎస్ స్కోరు, పరీక్ష విధానం, సిలబస్ గురించి తెలుసుకుందాం...

ఐఈఎల్‌టీఎస్.. అంతర్జాతీయ విద్యార్థుల ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్ష. ఐఈఎల్‌టీఎస్‌లో లిజనింగ్ (వినడం), రీడింగ్ (చదవడం), రైటింగ్(రాయడం), స్పీకింగ్ (మాట్లాడటం) విభాగాలు ఉంటాయి.

లిజనింగ్..
విద్యార్థి అన్ని దేశాల ‘యూస’లను అర్థం చేసుకోగలడా లేదా అనేదే ఈ విభాగం ముఖ్య ఉద్దేశం. ఎగ్జామినర్ చెప్పే సంభాషణను విని.. దానికి సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ సంభాషణ అన్ని ‘యూస’ల్లోనూ ఉండవచ్చు. 30 నిమిషాల సమయంలో 40 ప్రశ్నలను ఎదుర్కోవాలి.

రీడింగ్
నిర్ణీత అంశానికి సంబంధించి చదివిన విషయూన్ని లేదా కాన్సెప్టును విద్యార్థి ఏ స్థారుులో అర్థంచేసు కోగలడనే కోణంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ విభాగంలో 60 నిమిషాల వ్యవధిలో మూడు ప్యాసేజ్‌లను చదివి.. దాదాపు 40 ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్యాసేజ్‌కు కచ్చితంగా 20 నిమిషాలు మాత్రమే కేటారుుంచాలనే నిబంధన అమల్లో ఉంది.

రైటింగ్..
ఇందులో విద్యార్థికున్న ఇంగ్లిష్ రాత నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో గ్రాఫ్ లేదా టేబుల్ ఇచ్చి దానిపై విశ్లేషణ రాయమంటారు. రెండో సెక్షన్‌లో ఒక అంశానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను చదివి.. విద్యార్థి తనదైన విశ్లేషణ చేయూలి. మొదటి సెక్షన్‌కు 150 పదాలు, రెండో సెక్షన్‌కు 250 పదాలతో సమాధానం రాయాలి.

ఇంకా చదవండి: part 2: ఐఈఎల్‌టీఎస్‌కి ఇలా సన్నద్ధమవ్వండి.. సాధించండి..
Published on 11/20/2020 4:05:00 PM

Related Topics