Sakshi education logo
Sakshi education logo
Careers Categories

ఫిబ్రవరి 6న గేట్ ఎగ్జామ్.. ఈ చివరి రోజుల్లో ప్రిపేర్ అవ్వాల్సిన కీలక అంశాలపై దృష్టి సారించండిలా..

Join our Community

facebook Twitter Youtube
దేశంలో ఎక్కువ మంది హాజరయ్యే పరీక్షల్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గేట్) ఒకటి. తాజాగా గేట్-2021కు అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది.
Career guidance

ఫిబ్రవరి 6 నుంచి గేట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, తీవ్రపోటీ ఉండే గేట్‌లో విజయానికి అభ్యర్థులు అందుబాటులో ఉన్న చివరి పదిహేను రోజులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి.. పరీక్ష తీరుతెన్నులతో పాటు ప్రిపరేషన్ పరంగా అనుసరిం చాల్సిన వ్యూహాలపై ప్రత్యేక కథనం...

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో గేట్‌ది ప్రత్యేక స్థానం. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్లకు జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీ బాంబే.. ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో గేట్-2021ను నిర్వహించనుంది.

ఎగ్జామ్ ప్యాట్రన్..
గేట్‌ను 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 10 ప్రశ్నలు జనరల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు. పరీక్ష సమయం మూడు గంటలు. గేట్ నాన్ ఇంజనీరింగ్ ప్రశ్నపత్రంలో జనరల్ ఆప్టిట్యూడ్, అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇంజనీరింగ్ పశ్నపత్రంలో జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పిపరేషన్-కీలక అంశాలు
గేట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. ఇప్పటికే సదరు సిలబస్ అధ్యయనాన్ని పూర్తిచేసిన వారికి పరీక్షలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరీక్షకు అందుబాటులో ఉన్న ఈ చివరి పదిహేను రోజులను ఎలా సద్వినియోగం చేసుకున్నారనే దానిపై అభ్యర్థుల ర్యాంకులు ఆధారపడి ఉంటాయి. ఈ దిశగా పరీక్షార్థులు కొన్ని అంశాలపై దృష్టిసారించాలి.

ఇంకా చదవండి: part 2: ఇలా చదివితేనే గేట్-2021లో విజయం సాధించడం సులువు..

Published on 1/23/2021 4:04:00 PM

Related Topics