Sakshi education logo
Sakshi education logo
Careers Categories

ఒకే పరీక్షతో నాలుగు ప్రభుత్వ అకాడమీల్లో ప్రవేశం కల్పించే.. సీడీఎస్ పరీక్ష ఫిబ్రవరి 7న..

Join our Community

facebook Twitter Youtube
Career guidance

భారత త్రివిధ దళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు యువత ఎంతో ఆసక్తి చూపిస్తుంది. అలాంటి గ్రాడ్యుయేట్లకు అనువైన పరీక్ష.. ‘కంబైన్డ్‌ డిఫెన్‌‌స సర్వీస్’ (సీడీఎస్). ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షను యూపీఎస్సీ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుంది. సీడీఎస్-1 ఎగ్జామ్ ఫిబ్రవరి 7న జరుగనుంది.

ఒక పరీక్ష.. నాలుగు అకాడమీలు..
సీడీఎస్ ఎగ్జామ్‌లో విజయం సాధించినవారికి ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), ఇండియన్ నావెల్ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్‌ఏ), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో ప్రవేశం లభిస్తుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌కు పిలుస్తారు. ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలను దాటిన వారిని తుది ఎంపిక చేస్తారు.

సీడీఎస్ పరీక్ష ఇలా..
కంబైన్‌‌డ డిఫెన్‌‌స సర్వీస్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్.. ఇలా మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు, రెండు గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. ఐఎంఏ, ఐఎన్‌ఏ ఏఎఫ్‌ఏలో ప్రవేశం పొందాలనుకునేవారు ఈ మూడు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో ప్రవేశానికి మాత్రం ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జి పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు చొప్పున ఉంటుంది.

బలాబలాలు తెలుసుకోండి..
పరీక్ష ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది తమ బలాబలాల గురించి. ప్రధానంగా ఏయే సబ్జెక్టుల్లో ముందున్నారో.. వేటిలో వెనుకంజలో ఉన్నారో గుర్తించాలి. వెనుకబడిన సబ్జెక్టుపై ఎక్కు వగా దృష్టి పెట్టాలి. అభ్యర్థి కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోరు సాధించాలని భావిస్తే.. అన్ని సబ్జెక్టులకూ సమానంగా సమయాన్ని కేటాయించాలి. ప్రతి పేపర్‌లో వీలైనంత ఎక్కువ మార్కులు స్కోరు చేసేందుకు కృషి చేయాలి. పరీక్షకు ముందు ముఖ్యాంశాల రివిజన్‌పైనే దృష్టి పెట్టాలి.

ఇంకా చదవండి: part 2: సీడీఎస్ పరీక్షలో ప్రతి మార్కూ కీలకమే.. కటాఫ్ ఇలా..

Published on 2/6/2021 3:11:00 PM

Related Topics