Sakshi education logo
Sakshi education logo
Careers Categories

దేశవ్యాప్తంగా దాదాపు 5లక్షలకు పైగా పోలీసు పోస్టుల ఖాళీలున్నట్లు అంచనా..కొలువుకు దారిదిగో..!

Join our Community

facebook Twitter Youtube
ప్రతి కొలువుకీ పోటీదారులు ఉంటారు కానీ, ఒక్క పోలీసు ఉద్యోగానికే ఫ్యాన్స్ ఉంటారు..! యువతలో చాలామంది పోలీసు జాబ్‌పై ఉన్న క్రేజ్‌తో ఒకటికి రెండుసార్లు విఫలమైనా.. పట్టు వదలని విక్రమార్కులుగా ప్రయత్నిస్తుంటారు.
Career guidance
కాగా, తాజాగా దేశంలోని పోలీసు విభాగాల్లో 5 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వెల్లడించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ రిక్రూట్‌మెంట్స్‌కు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అధికారికంగా నోటిఫికేషన్స్ జారీ కానప్పటికీ.. త్వరలోనే నోటిఫికేషన్‌లు వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసు శాఖలో ఎక్కువ మంది పోటీ పడే సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ), కానిస్టేబుల్ కొలువులు.. అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌లపై ప్రత్యేక కథనం..

డీగ్రీతో ఎస్‌ఐ..
పోలీసు కొలువుల్లో అత్యంత క్రేజీ కొలువు...సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ). ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పురుషులు, మహిళలు పోటీపడవచ్చు. ఏపీ, టీఎస్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులు సివిల్, ఏఆర్ , స్పెషల్ పోలీస్ ఫోర్స్ తదితర విభాగాల్లో ఎస్‌ఐ కొలువులను భర్తీ చేస్తున్నాయి.
ఎంపిక ప్రక్రియ: - ప్రిలిమినరీ రాత పరీక్ష; - ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు; - ఫైనల్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ టెస్టు..
ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1-అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీపై 100 మార్కులకు; పేపర్ 2 జనరల్ స్టడీస్‌పై 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్ 1లో.. నంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రస్ట్, కాంపౌండ్ ఇంట్రస్ట్, రేషియో అండ్ ప్రొపోర్షన్, యావరేజ్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్-క్యాలెండర్స్, పాట్నర్‌షిప్ తదితర టాపిక్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ)..
పురుషులు: సివిల్, టీఎస్‌ఎస్‌పీ, ఏపీఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఫైర్ విభాగాల్లో ఎస్‌ఐ పోస్టులకు కనీసం 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఛాతీ 86.3 సెంటీమీటర్లు ఉండి.. శ్వాస తీసుకున్నప్పుడు కనీసం 5 సెంటీ మీటర్లు పెరగాలి. ఒకవేళ అభ్యర్థులు మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజ యనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆదివాసీలైతే.. ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు కనీసం 3 సెంటీమీటర్లు పెరగాలి.
  1. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు పురుషుల ఎత్తు 162 సెంటీమీటర్లు, ఛాతీ 84 సెంటీమీటర్లు కంటే తక్కువ ఉండకూడదు. శ్వాస తీసుకున్నప్పుడు కనీసం 4 సెంటీమీటర్లు పెరగాలి. ఒకవేళ అభ్యర్థులు నిర్దేశిత జిల్లాలకు చెందిన ఆదివాసీ లైతే.. ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు కనీసం 3 సెంటీ మీటర్లు పెరగాలి.
  2. మహిళలు: సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్, పీటీవో ఎస్‌ఐ పోస్టులకు కనీసం 152.5 సెంటీ మీటర్లు ఎత్తు ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు నిర్దేశిత జిల్లాలకు చెందిన ఆదివాసీలు అయితే కనీసం 150 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి.


ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)..
పీఎంటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఈటీ అవకాశం కల్పిస్తారు. పురుష అభ్యర్థులు సివిల్, ఫైర్, కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు 800 మీటర్ల పరుగుపందెంతోపాటు కింద పట్టికలో పేర్కొన్న ఏవైనా రెండు ఈవెంట్స్‌ల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. మిగిలిన విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించాలంటే.. అన్ని ఈవెంట్స్‌ల్లో ఉత్తీర్ణులవ్వాలి.

  1. మహిళా అభ్యర్థులు సివిల్, కమ్యూనికేషన్ విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు 100 మీటర్ల పరుగు పందెంతోపాటు ఏదైనా ఒక ఈవెంట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. మిగిలిన విభాగాల్లోని ఎస్‌ఐ పోస్టులకు అర్హత సాధించాలంటే.. అన్ని ఈవెంట్స్‌ల్లో ఉత్తీర్ణులవ్వాలి.


ఈవెంట్స్

జనరల్

ఎక్స్‌సర్వీస్‌మెన్

మహిళలకు

100 మీటర్ల పరుగు 15 సెకన్లు 16.5 సెకన్లు 20 సెకన్లు
లాంగ్‌జంప్ 3.80 మీటర్లు 3.65 మీటర్లు 2.5 మీటర్లు
షాట్‌పుట్(7.26కిలోలు) 5.60 మీటర్లు 5.60 మీటర్లు 3.75మీటర్లు
హైజంప్ 1.20 మీటర్లు 1.05 మీటర్లు -
800 మీటర్ల పరుగు 170 సెకన్లు 200 సెకన్లు -
(షాట్‌పుట్ బాల్ బరువు పురుషులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 7.26 కిలోలు, మహిళలకు 4 కిలోలు)

ఇంకా చదవండి: part 2: ఈ పోలీస్ ఉద్యోగాల్లో పీఈటీకి ఉన్న కీలక పాత్రను తెలుసుకోండిలా..

Published on 2/8/2021 4:02:00 PM

Related Topics