ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తోంది!
గతేడాది నిర్వహించిన.. డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ రాత పరీక్షల ఫలితాలు కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది. ఆ వెంటనే.. ఎంపిక ప్రక్రియలో తుది దశగా నిలిచే ఇంటర్వ్యూల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల పదో తేదీ నుంచి డిగ్రీ లెక్చరర్స్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తేదీల వారీగా ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అలాగే మరికొద్ది రోజుల్లో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్‌లకు కూడా ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు మార్గాలు...
ఇప్పుడు ఈ అభ్యర్థులంతా పదో తేదీ నుంచి జరుగనున్న ఇంటర్వ్యూలో నెగ్గాలంటే.. వ్యక్తిత్వ లక్షణాల నుంచి ప్రొఫెషనల్ నైపుణ్యాల వరకూ.. అన్నింటా మెరుగులు దిద్దుకొని సిద్ధమవ్వాలి.
ముందుగా ధ్రువపత్రాలు...
డిగ్రీ లెక్చరర్ పోస్ట్‌ల ఇంటర్వ్యూకు హాజరుకానున్న అభ్యర్థులు సర్వీస్ కమిషన్ పేర్కొన్న నిబంధనల ప్రకారం-ముందుగా ఆయా ధ్రువ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన చెక్ లిస్ట్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకొని.. దాన్ని నింపాలి. దీంతోపాటు అకడమిక్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ ప త్రాలు, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసు కోవాలి. ఇంటర్వ్యూ నిర్వహణకు ముందు ఆయా సెషన్ల వారీగా నిర్దిష్ట సమయంలో సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
రోజుకు రెండు సెషన్లు..
ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం -ఈ నెల పదో తేదీ నుంచి 25వ తేదీ వరకూ.. ప్రతి రోజు రెండు సెషన్లలో డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ తేదీ ల్లో ప్రతిరోజు మొదటి సెషన్ ఇంటర్వ్యూ 11గంటలకు; రెండో సెషన్ ఇంటర్వ్యూ మధ్యాహ్నం 2:30కు ప్రారంభమవుతుంది. మొదటి సెషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉదయం 8గంటలకు; రెండో సెషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 11 గంటలకు మొదలవుతుంది. అంటే..సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ రెండూ ఒకేరోజు జరుగనున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగానే అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకొని.. ఇంటర్వ్యూకు వెళ్లాలి. లేదంటే.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఒత్తిడికి గురయ్యే ఆస్కార ముంది. అది ఇంటర్వ్యూలో ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది. అంతేకాకుండా సమయానికి నిర్దేశిత సర్టిఫికెట్లు లేకున్నా.. ఇంటర్వ్యూ అవకాశం చేజారే ప్రమాదం కూడా ఉంది.
ఇంకా చదవండి: part 2: ఒక్కో సెషన్లో కనీసం 25 మందికి.. సగటున 20 నిమిషాలు ఇంటర్వూ..