Sakshi education logo
Sakshi education logo
Careers Categories

అమెరికాలోఉద్యోగానికి ఇండియా నుంచి వర్క్.. అనుకూల, ప్రతికూలతలు తెలుసుకోండిలా!

Join our Community

facebook Twitter Youtube
అమెరికాలో ఉద్యోగం చేయాలనేది భారత్‌లాంటి దేశాలకు చెందిన యువత కల. అందుకోసం ఎంతో శ్రమించి యూఎస్‌లో ఉద్యోగం సంపాదిస్తారు.
Edu news

 కొన్నేళ్లు అక్కడే ఉండేందుకు హెచ్1బీ వీసా సైతం దక్కించుకుంటారు. వీరిలో అత్యధికులు ఐటీ రంగంలో పనిచేసేవారే. గతేడాది వీసా రెన్యువల్ కోసం కొందరు, ఇక్కడి కుటుంబ సభ్యులను కలిసేందుకు మరికొందరు భారత్‌కు వచ్చారు. అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ కారణంగాతిరిగి అమెరికా వెళ్లలేకపోయారు. దాంతో కొందరు ఇండియాలోనే ఉండి.. వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పని చేస్తున్నారు. అమెరికా కంపెనీలో అక్కడే ఉండి పనిచేయాల్సిన ఉద్యోగి.. బయటి దేశం నుంచి పనిచేయవచ్చా? హెచ్1బీ వీసాదారులు ఇండియాలో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉందా! ఇందుకుఅక్కడి చట్టాలు అంగీకరిస్తాయా? అమెరికాలో తాజా పరిణామాల నేపథ్యంలో.. హెచ్1బీ వీసాపై నిపుణుల విశ్లేషణ...

అమెరికాలోని ఓ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు లాక్‌డౌన్‌లో వారివారి మాతృదేశాల్లో ఉండిపోవడం వల్ల అక్కడి నుంచే పనిచేస్తుండగా.. మరికొందరు అమెరికాలోనే పనిచేస్తూ యూఎస్ చట్టాల ప్రకారం వేతనాలు పొందుతున్నారు. దాంతో ఒకే సంస్థకు చెందిన ఒకే స్థాయి ఉద్యోగుల వేతనంలో ఎంతో వత్యాసం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆ కంపెనీపై ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్’(డీఓఎల్) విభాగానికి కొందరు ఫిర్యాదు చేశారు. దాంతో డీఓఎల్ సదరు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు పలు యూఎస్ కంపెనీలు ఎదుర్కోబోతున్నట్టు తెలియడంతో.. అమెరికా బయట ఉన్న తమ హెచ్1బీ వీసా ఉద్యోగులను.. వెంటనే యూఎస్‌కు వచ్చి విధుల్లో చేరాల్సిందిగా అక్కడి కంపెనీలు మెయిల్స్ పంపుతున్నాయి. కోవిడ్ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమానాలు నేటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో.. ఇండియాలో ఉండిపోయిన వారు ఆందోళన చెందుతున్నారు.

స్థానిక చట్టాల ప్రకారమే..
ఏ దేశంలో అరుునా స్థానికంగా పనిచేస్తున్నప్పుడు అక్కడి పేరోల్ ప్రకారమే వేతనాలు చెల్లిస్తారు. ఆ ఉద్యోగులు స్థానిక నిబంధనల ప్రకారమే పన్నులు చెల్లించాలి. అమెరికాలోనూ ఇదే నిబంధన ఉంది. ఒకసారి ఉద్యోగి దేశం దాటి వెళ్లి పనిచేయాల్సి వస్తే.. అది ‘లేబర్ కండిషన్ అప్లికేషన్’ ముందే సూచించిన క్లయింట్ వద్ద మాత్రమే పరిమిత కాలానికి పనిచేసే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు మాత్రమే అమెరికా పేరోల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు. అంటే.. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ ఉద్యోగికి నెలకు 10వేల డాలర్లు వేతనం ఉంటే.. అందుకు తగ్గట్టుగా అతడు స్థానికంగా పన్నులు చెల్లించాలి. సదరు ఉద్యోగి చేసే ఖర్చు మొత్తం అమెరికాలోనే ఉంటుంది. కాబట్టి వచ్చిన వేతనం దేశం దాటి పోయే పరిస్థితి ఉండదు. అదే ఉద్యోగి యూఎస్ బయట పనిచేయాల్సి వచ్చినా అంతే వేతనం చెల్లిస్తారు. దాంతో అతడి వేతనం సదరు ఉద్యోగి పనిచేస్తున్న దేశ కరెన్సీలోకి మారుతుంది. అంటే.. ఆ ఉద్యోగి ఇండియాలో ఉంటే అతడి వేతనం సుమారు రూ.7లక్షలు అవుతుంది. అమెరికాలో పదివేల డాలర్లు.. భారత్‌లో రూ.7లక్షలు అవుతుంది. అంటే.. ఇక్కడ జీతాల ప్రకారం చూస్తే చాలా పెద్ద మొత్తమే. ఇలాంటి వ్యత్యాసంపైనే అక్కడి లేబర్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి: part 2: హెచ్1బీ వీసాలకు నిబంధనలు 2019కు ముందు అలా.. ఇప్పుడు ఇలా..

Published on 2/18/2021 4:47:00 PM

Related Topics