Sakshi education logo
Sakshi education logo
Careers Categories

ఒకేసారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలతో పాటు నీట్‌లోనూ విజయం సాధించే మార్గాలివే..

Join our Community

facebook Twitter Youtube
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్).. జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష. ఇంటర్‌లో బైపీసీ గ్రూప్‌ను అభ్యసిస్తూ వైద్యవిద్యలో చేరాలనుకునే విద్యార్థుల టార్గెట్..
Edu news

 నీట్. ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధిస్తేనే ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. కాగా, నీట్‌లో రాణించి డాక్టర్ కలను సాకారం చేసుకోవాలంటే... తొలుత ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇటు నీట్‌తోపాటు అటు ఇంటర్‌కూ.. ఉమ్మడి ప్రిపరేషన్‌ను కొనసాగించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. ఇంటర్+నీట్ అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రిపరేషన్ వ్యూహం...

నీట్-2021 నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు జూలైలో నీట్ పరీక్ష ఉంటుంది. సిలబస్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవని ఇప్పటికే స్పష్టత వచ్చింది. వివిధ రాష్ట్రాల బోర్డులు ఇంటర్ సిలబస్‌ను కుదించిన దృష్ట్యా పరీక్ష ప్యాట్రన్ మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశ్నపత్రంలో ప్రశ్నల సంఖ్య పెంచి..ఛాయిస్ ఇవ్వొచ్చు.

సమయ పట్టిక..
నీట్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. నీట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. దానికి అనుగుణంగా చక్కటి టైమ్ టేబుల్‌ను రూపొందించుకోవాలి. నిర్దిష్ట సమయంలోపు సిలబస్‌ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. అంతేకాకుండా విద్యార్థులకు స్వీయ సామర్థ్యాలపై స్పష్టత అవవసరం. ఫలితంగా వాస్తవిక దృష్టితో ప్రిపరేషన్ కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రిపరేషన్ పరంగా ప్రతి రోజూ చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటిని తప్పనిసరిగా పూర్తి చేయాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం వెచ్చించాలి. టాపిక్స్‌ను విభజించుకొని.. రోజూ అధ్యయనం చేయాలి.


ఇంకా చదవండి: part 2: సిలబస్‌కు అనుగుణంగా అధ్యయనం చేసి.. సబ్జెక్ట్ వారిగా ప్రిపరేషన్ సాగించండిలా..

Published on 2/18/2021 6:08:00 PM

Related Topics