భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ.. స్పోర్ట్ కోటా కింద సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ పూర్తిచేసిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుల దరఖాస్తుకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 7వ తేదీలోగా దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటంది.
ఎంట్రీ: సెయిలర్ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ-01/2021 బ్యాచ్
పోస్టులు: డెరైక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీసర్
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి.
స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీ: అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర స్థాయి సీనియర్/ జూనియర్ టీమ్ గేమ్స్, వ్యక్తిగత అంశాల్లోనైనా పాల్గొని ఉండాలి.
వయసు: కోర్సు మొదలయ్యే నాటికి వయసు 17-22ఏళ్ల లోపు ఉండాలి. 01.02. 1999-31.01.2024 మధ్య జన్మించిన వారై ఉండాలి.
పోస్టులు: సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్ఎస్ఆర్)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన(10+2) విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి.
స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీ: అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్రస్థాయి/యూనివర్సిటీలు నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటల్లో పాల్గొన్న వారై ఉండాలి.
వయసు: కోర్సు ప్రారంభమయ్యే నాటికి వయసు 17-21 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000-31.01.2004 మధ్య జన్మించిన వారై ఉండాలి.
పోస్టులు: మెట్రిక్ రిక్రూట్స్(ఎంఆర్)
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీ: రాష్ట్రస్థాయి/జాతీయ/అంతర్జాతీయ స్థాయి టోర్న మెంట ల్లలో పాల్గొని ఉండాలి.
వయసు: కోర్సు ప్రారంభమయ్యే నాటికి వయసు 17-21ఏళ్ల మధ్య ఉండాలి.
01.04.2000-31.03.2004 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఇంకా చదవండి: part 2: నేవీలో సెయిలర్ కొలువుల ఎంపిక విధానం ఇదే.. ఎంపికైతే శిక్షణలోనే రూ.14వేలకు పైగా స్టైఫండ్..