Sakshi education logo
Sakshi education logo
Search Bar

ఇంటర్నేషనల్‌ ఎనీ అవార్డుకు ఎంపికైన భారతరత్నఅవార్డీ?

Join our Community

facebook Twitter Youtube
భారతరత్న ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది.
Current Affairs
పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనలకు గాను ఆయన ఇంటర్నేషనల్‌ ఎనీ అవార్డు–2020కు ఎంపికయ్యారు.ఈ పురస్కారాన్ని అక్టోబరు 14న రోమ్‌లో నిర్వహించే కార్యక్రమంలో అందించనున్నారు.పురస్కారంలో భాగంగా నగదుతోపాటు బంగారు పతకం ఇవ్వనున్నారు. ఎనర్జీ పరిశోధనలకు గాను ఇచ్చే ఈ పురస్కారాన్ని నోబెల్‌ బహుమతిగా పరిగణిస్తారు.

ఫుట్‌బాల్‌ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌కు వీడ్కోలు పలికిన కోచ్?
ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ కోచ్‌ పదవినుంచి దిగ్గజ ఆటగాడు జినెదిన్‌ జిదాన్‌ తప్పుకున్నాడు. కాంట్రాక్ట్‌ వచ్చే ఏడాది జూన్‌ వరకు ఉన్నా, ఇటీవల జట్టు ప్రదర్శనపై వచ్చిన విమర్శలతో అర్ధంతరంగానే తప్పుకున్నాడు. రెండుసార్లు కోచ్‌గా వ్యవహరించిన జిదాన్‌ రెండు పర్యాయాలు గడువులోపే వైదొలగడం గమనార్హం. తన శిక్షణలో మూడేళ్లు వరుసగా చాంపియన్స్‌ లీగ్‌ టైటిళ్లు సహా మొత్తం తొమ్మిది ట్రోఫీలను అందించడంలో జిదాన్‌ సఫలమయ్యాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి :ఇంటర్నేషనల్‌ ఎనీ అవార్డు–2020కు ఎంపిక
ఎప్పుడు : మే27
ఎవరు : భారతరత్న ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు
ఎందుకు :పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనలకు గాను
Published on 5/28/2021 6:07:00 PM

సంబంధిత అంశాలు