Sakshi education logo
Sakshi education logo
Search Bar

భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ ఎవరు?

Join our Community

facebook Twitter Youtube
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆశ్రిత వి. ఓలేటి రికార్డు నెలకొల్పారు.
Current Affairs
కర్ణాటకలోని కొల్లెగల్‌ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్‌ చేసి... 2014లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో చేరి స్క్వాడ్రన్‌ లీడర్‌ అయ్యింది. తర్వాత ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ టెస్ట్‌ పైలెట్‌ స్కూల్‌’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్‌ టెస్ట్‌ కోర్స్‌’ (43వ బ్యాచ్‌)లో ఉత్తీర్ణత చెందింది. ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ అయింది. ఈ విషయాన్ని మే 23న ఐఏఎఫ్ట్విటర్‌ ద్వారా తెలిపింది.

కేవలం 275 మంది...
1973 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ నిర్వహిస్తున్న ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ పరీక్షలో కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది.ఇకమీద భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విమానం కొనాలన్నా, సేవలు మొదలెట్టాలన్నా దానిని పరీక్షించే ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితదే.ఇండియన్‌ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో వీరి సంఖ్య 704 మాత్రమే. 2015 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ తన ఫైటర్‌ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత తనదైన ఘనతను సాధించింది.
Published on 5/26/2021 6:37:00 PM

సంబంధిత అంశాలు