Sakshi education logo
Sakshi education logo
Search Bar

సీబీఐ చీఫ్‌గా నియమితులైన ఐపీఎస్‌ అధికారి?

Join our Community

facebook Twitter Youtube
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Current Affairs
రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1985వ బ్యాచ్‌కు చెందిన జైస్వాల్‌ ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరిలతో కూడిన హైపవర్‌ కమిటీ మే 24న సమావేశమై సీబీఐ చీఫ్‌గా సుబోధ్‌ను ఎంపిక చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషి కుమార్‌ శుక్లా 2021 ఫిబ్రవరి 3వ తేదీన పదవీవిరమణ చేశారు. అప్పటినుంచి అదనపు డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హా తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సుబోధ్‌ ప్రస్థానం
 • సుబోధ్‌జైస్వాల్‌బిహార్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా సింద్రిలో1962 సెప్టెంబర్‌ 22న జన్మించారు.
 • బీఏ (హానర్స్‌), ఎంబీఏ చేశారు.
 • 1985 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి.
 • ముంబై యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌లో పనిచేశారు. పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2008లో జరిగిన మాలేగావ్‌ పేలుళ్ల కేసును దర్యాప్తు చేశారు.
 • 2002లో నకిలీ స్టాంపు పేపర్‌ల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)కు నేతృత్వం వహించారు. అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీ ప్రధాన పాత్రధారిగా తేలిన రూ. 20 వేల కోట్ల రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
 • జులై 11, 2006లో చోటుచేసుకున్న వరుస రైలు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు.
 • ముంబై పోలీసు కమీషనర్‌గా పనిచేశారు.
 • మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు.
 • ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో సేవలందించారు.
 • రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా)లో తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం సేవలందించారు. ఇందులో మూడేళ్లు రా అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
 • విధినిర్వహణలో ప్రతిభ చూపినందుకుగాను 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్‌ను అందుకున్నారు.
 • 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అసాధారణ్‌ సురక్షా సేవా ప్రమాణ్‌ పత్ర్‌ (ఏఎస్‌ఎస్‌పీపీ) అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా నియామకం
ఎప్పుడు : మే25
ఎవరు : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌
ఎందుకు :సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషి కుమార్‌ శుక్లా పదవీవిరమణ చేసిన నేపథ్యంలో...
Published on 5/27/2021 6:04:00 PM

సంబంధిత అంశాలు