Sakshi education logo
Sakshi education logo
Search Bar

2020–21లో భారత్‌లో అత్యధికంగా ఎఫ్‌డీఐలు పెట్టిన దేశం?

Join our Community

facebook Twitter Youtube
2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు పెట్టిన దేశంగా సింగపూర్ నిలిచింది.
Current Affairs
పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) మే 28న విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020–21లో సింగపూర్‌ నుంచి 17.41 బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. సింగపూర్ తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, మారిషస్ ఉన్నాయి. అమెరికా నుంచి 13.82 బిలియన్‌ డాలర్లు, మారిషస్‌ నుంచి 5.64 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి.మరోవైపు, భారత్‌లో అత్యధికంగా ఎఫ్‌డీఐలు పెట్టిన దేశాల జాబితాలో యూఏఈ (4.2 బిలియన్‌ డాలర్లు), కేమ్యాన్‌ ఐలాండ్‌ (2.79 బిలియన్‌ డాలర్లు), నెదర్లాండ్స్‌ (2.78 బిలియన్‌ డాలర్లు), బ్రిటన్‌ (2.04 బిలియన్‌ డాలర్లు), జపాన్‌ (1.95 బిలియన్‌ డాలర్లు), జర్మనీ (665 మిలియన్‌ డాలర్లు), సైప్రస్‌ (386 మిలియన్‌ డాలర్లు) ఉన్నాయి.

19 శాతం అధికం...
భారత ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు తీసుకున్న ఇతరత్రా చర్యల ఊతంతో 2020–21లో మొత్తం మీద 59.64 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇవి అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 19 శాతం అధికం. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ రంగం అత్యధికంగా 26.14 బిలియన్‌ డాలర్లు, నిర్మాణం.. మౌలిక సదుపాయాల రంగం 7.87 బిలియన్‌ డాలర్లు, సర్వీసుల రంగం 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020–21లోఅత్యధికంగా ఎఫ్‌డీఐలు పెట్టిన దేశం?
ఎప్పుడు : మే 28
ఎవరు : సింగపూర్‌
ఎక్కడ :దేశంలో...
Published on 5/29/2021 5:29:00 PM

సంబంధిత అంశాలు