Sakshi education logo
Sakshi education logo
Search Bar

ఏ ప‌థ‌కంలో భాగంగా ఏపీలోని మహిళల ఖాతాల్లో రూ.4,339 కోట్లు జమ చేశారు?

Join our Community

facebook Twitter Youtube
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది.

Current Affairs


ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది.

45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకాన్ని 2020లో ప్రారంభించింది. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ఏపీ ప్రభుత్వ ఉద్దేశం.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
రెండో ద‌శ వైఎస్సార్ చేయూత
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : ఏపీ సీఎం జ‌గ‌న్‌
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాల‌యం, ఏపీ
Published on 6/22/2021 4:35:00 PM

సంబంధిత అంశాలు