రైతు, పల్లె, పట్టణం అభివృద్ధే లక్ష్యంగా.. సంక్షేమమే పరమావధిగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు మార్చి 8న శాసనసభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో 62 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం సాగింది.

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ సమర్పించారు. అన్ని రకాల అంచనాలు, ఖర్చులు, కేటాయింపులను పెంచుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1,82,914.42 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019-20 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్ ఏకంగా 25 శాతం మేర పెరిగింది.
బడ్జెట్ అంచనాలివే.. |
(రూ.కోట్లలో) |
మొత్తం బడ్జెట్ |
1,82,914.42 |
పథకాల వ్యయం |
1,04,612.62 |
నిర్వహణ వ్యయం |
78,301.8 |
రెవెన్యూ మిగులు |
4,482.12 |
ద్రవ్యలోటు |
33,191.25 |
రెవెన్యూ రాబడి |
1,43,151.94 |
రెవెన్యూ వ్యయం |
1,38,669.82 |
పన్ను రాబడి |
85,300.00 |
పన్నేతర రాబడి |
30,600.00 |
కేంద్రం వాటా |
16,726.58 |
గ్రాంట్లు |
10,525.36 |
రుణాలు |
35,500 |
మూలధన వ్యయం |
22,061.18 |
రాబడి/ వ్యయం (రూ.కోట్లలో)
రాక..
రెవెన్యూ రాబడులు.. |
1,43,151.94 |
అప్పులు.. |
35,500.00 |
రుణ వసూళ్లు |
50.00 |
ప్రజాపద్దు.. |
4,000.00 |
పోక..
రెవెన్యూ వ్యయం.. |
1,38,669.82 |
మూలధన వ్యయం.. |
22,061.18 |
రుణాల చెల్లింపు.. |
6,521.22 |
రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులు |
15,662.20 |
విభాగాల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)
వ్యవసాయం/సహకారం |
24,116.57 |
వ్యవసాయం/మార్కెటింగ్ సహకారం |
108.83 |
పశు సంవర్థక/మత్స్య |
1,586.38 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం |
4,356.83 |
మహిళ/శిశు/దివ్యాంగ/వృద్ధుల వ్యయం |
1,548.19 |
ఇంధనశాఖ |
10,415.88 |
పర్యావరణ/అటవీ/సైన్స్-టెక్నాలజీ |
791.47 |
ఆహార/పౌరసరఫరా |
2,362.83 |
ఫైనాన్స్ |
31,563.68 |
సాధారణ పరిపాలన |
512.94 |
వైద్య-ఆరోగ్య/కుటుంబ సంక్షేమం |
6,185.97 |
ఉన్నత విద్య/ సెక్రటేరియెట్ డిపార్టుమెంట్ |
1,723.28 |
హోంశాఖ |
5,851.96 |
గృహ నిర్మాణం |
11,916.59 |
పరిశ్రమలు/ వాణిజ్యం |
1,998.19 |
ఐటీ/ కమ్యూనికేషన్స్ |
28.08 |
ఇరిగేషన్/కమాండ్ ఏరియా డెవలప్మెంట్ |
11,053.55 |
కార్మిక/ఉపాధి |
397.04 |
న్యాయశాఖ |
923.43 |
అసెంబ్లీ సెక్రటేరియట్ |
148.21 |
మెనార్టీ సంక్షేమం |
1,518.05 |
పురపాలక పరిపాలన |
14,808.95 |
పంచాయతీరాజ్/గ్రామీణాభివృద్ధి |
23,005.35 |
ప్రణాళిక విభాగం |
4,229.54 |
యువ/ పర్యాటకం/సాంస్కృతిక |
385.62 |
రెవెన్యూ |
2,546.16 |
షెడ్యూల్ కులాల అభివృద్ధి |
2,610.19 |
మాధ్యమిక విద్య, సెక్రటేరియట్ విభాగం |
10,420.94 |
రవాణా, రోడ్లు, భవనాలు |
3,493.66 |
గిరిజన సంక్షేమం |
2,286.24 |
ప్రధాన కేటాయింపులు
- రైతు బంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు కేటాయింపు
- రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు కేటాయింపు
- రైతు బీమాకు రూ. 1,141 కోట్లు కేటాయింపు
- మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. 1,000 కోట్లు కేటాయింపు
- పశుసంవర్ధకశాఖకు రూ. 1,586 కోట్లు కేటాయింపు
- సహకార, మార్కెటింగ్‌కు రూ. 108 కోట్లు కేటాయింపు
- రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు
- విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు
- ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 25 కోట్లు
- పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం రూ. 100 కోట్లు
- పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయింపు
- డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు రూ. 679.23 కోట్లు
- ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమానికి రూ.100 కోట్లు కేటాయింపు
- ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద రూ.2,650 కోట్లు
- ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 16,534.97 కోట్లు
- ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 9,771.28 కోట్లు
- పురపాలక శాఖకు రూ.12,282.35 కోట్లు కేటాయింపు
- యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు రూ.350 కోట్లు కేటాయింపు
- వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థకు రూ.50 కోట్లు
- టీఎస్ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయింపు
- పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు కేటాయింపు
- గ్రామీణ, చిన్న పరిశ్రమలకు రూ.1132.39 కోట్లు
- గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు కేటాయింపు
- రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.11,917 కోట్లు
- అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.791.47 కోట్లు
- మైనార్టీ సంక్షేమ శాఖకు రూ. 1,138.45 కోట్లు కేటాయింపు
- కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖలకు రూ.107.78 కోట్లు
- మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.676.11 కోట్లు
- సబ్సిడీ బియ్యం పంపిణీకి రూ.2,362 కోట్లు కేటాయింపు
- గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు రూ.2,073.91 కోట్లు
- పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం రూ. 100 కోట్లు
- పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయింపు
- ఆయుష్ విభాగానికి రూ. 33.25 కోట్లు
- కేసీఆర్ కిట్‌కు రూ.443 కోట్లు కేటాయింపు
- హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ అనే కొత్త పద్దుకు రూ.7,547 కోట్ల కేటాయింపు. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.
తలసరి అప్పు రూ. 65,480
2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29 లక్షల కోట్లకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే ఇది రూ.65,480గా తేలింది. గతేడాది బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ.58,202 కాగా, ఈ ఏడాది మరో రూ.7,278 పెరిగింది. రాష్ట్ర అప్పు జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో పోలిస్తే 20.74 శాతానికి చేరింది.
రాష్ట్ర అప్పుల వివరాలివి.. (కోట్లలో)
సంవత్సరం |
రుణాలు |
జీఎస్డీపీ(శాతాల్లో) |
2016-17 |
1,29,531.89 |
20.04 |
2017-18 |
1,52,190.12 |
20.21 |
2018-19 |
1,75,281.07 |
20.25 |
2019-20 |
1,99,215.30 |
20.55 |
2020-21 |
2,29,205.16 |
20.74 |
వ్యవసాయం, అనుబంధ రంగాలకు 25,811 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. 2020-21 ఏడాది బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు 25,811.78 కోట్లు కేటాయించింది. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్లో ప్రగతి పద్దు కింద కేవలం వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్‌శాఖలకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 177 కోట్లు కేటాయించింది.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 23 వేల కోట్లు
పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తాజా బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ.7,880.46 కోట్లు అధికం. ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కాయి.
- ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు
అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్‌కు అర్హత సాధించే అవకాశముంది.
పంచాయతీరాజ్ శాఖలో ముఖ్య కేటాయింపులు ఇలా (రూ.)
|
2019&-20 |
2020&21 |
జెడ్పీటీసీల గౌరవ వేతనం |
1,391.70 |
1,069.20 |
ఎంపీటీసీల గౌరవవేతనం |
500 |
4,161 |
సర్పంచ్ల గౌరవవేతనం |
5,500 |
7,661.40 |
14వ ఆర్థిక సంఘం నిధులు |
1,229.16 కోట్లు |
1,393.93 కోట్లు |
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు |
819.44 కోట్లు |
1,393.93 కోట్లు |
పీఎం ఆదర్శ్ గ్రామ్‌యోజన |
- |
5 కోట్లు |
గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ |
- |
1.12 కోట్లు |
విద్యాశాఖకు రూ. 12,127.55 కోట్లు
తాజా బడ్జెట్లో విద్యాశాఖకు 12,127.55 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మార్చి 8న అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యాశాఖకు రూ.12,144 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, విభాగాల వారీగా చూస్తే రూ. 12,127.55 కోట్లుగా ఉంది. గతేడాది విద్యా శాఖకు రూ.9,899.12 కోట్లు మాత్రమే కేటాయించారు. విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.10,405.29 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,452.03 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.270.23 కోట్లను కేటాయించింది. మరోవైపు ఈచ్ వన్ టీచ్ వన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు.
ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు.. (రూ. కోట్లలో)
కేటగిరీ |
నిర్వహణ పద్దు |
ప్రగతి పద్దు |
మొత్తం |
పాఠశాల విద్య |
9,113.10 |
1,292.19 |
10,405.29 |
ఉన్నత విద్య |
1,372.95 |
79.08 |
1,452.03 |
సాంకేతిక విద్య |
265.08 |
5.15 |
270.23 |
మొత్తం |
10,751.13 |
1,376.42 |
12,127.55 |
గతేడాది బడ్జెట్ కేటాయింపులు.. (రూ. కోట్లలో)
కేటగిరీ |
నిర్వహణ పద్దు |
ప్రగతి పద్దు |
మొత్తం |
పాఠశాల విద్య |
7,515.65 |
693.38 |
8,209.03 |
ఉన్నత విద్య |
1,312.56 |
55.32 |
1,367.88 |
సాంకేతిక విద్య |
320.29 |
2.62 |
322.91 |
మొత్తం |
9,148.5 |
751.32 |
9,899.82 |
వైద్య ఆరోగ్యరంగానికి రూ. 6,185.97 కోట్లు
వైద్య ఆరోగ్యరంగానికి 2020-21 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 6,185.97 కోట్లు కేటాయించింది. 2019-20 ఏడాదిలో రూ. 5,694 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ. 491 కోట్లు కేటాయించింది. మొత్తం వైద్య ఆరోగ్య బడ్జెట్లో రూ. 2,361.81 కోట్లు ప్రగతి బడ్జెట్ కాగా, 3,824.16 కోట్లు నిర్వహణ బడ్జెట్. ఈ ప్రగతి బడ్జెట్లో అత్యధికంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అమలయ్యే పథకాలకు అధికంగా రూ.1185 కోట్లు కేటాయించారు.
- తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన
కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. తెలంగాణలోని ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల సంఖ్యను 118 నుంచి 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాగునీటి రంగానికి రూ. 11,053.55 కోట్లు
2020-21 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం సాగునీటి రంగానికి మొత్తంగా రూ. 11,053.55 కోట్లు కేటాయించగా.. అందులో నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 3,606.58 కోట్ల మేర కేటాయింపులు చేశారు. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధులకన్నా రూ. 2,577.38 కోట్లు మేర కేటాయింపులు ప్రభుత్వం పెంచింది.
సాగునీటి రంగానికి కేటాయింపులు (రూ. కోట్లలో)
విభాగం |
గత ఏడాది |
ఈ ఏడాది |
మేజర్ ఇరిగేషన్ |
7,794.30 |
10,406.59 |
మైనర్ ఇరిగేషన్ |
642.36 |
602.45 |
ఆయకట్టు ప్రాంత అభివృద్ధి |
29.06 |
23.87 |
వరద నిర్వహణ |
10.45 |
10.45 |
ప్రాజెక్టులకు కేటాయింపులు (రూ. కోట్లలో)
ప్రాజెక్టు |
2019-20 |
2020-21 |
కాళేశ్వరం |
1080.18 |
805.47 |
పాలమూరు ఎత్తిపోతల |
500 |
368.58 |
సీతారామ |
1324 |
910.62 |
దేవాదుల |
529.12 |
292.38 |
ఇందిరమ్మ వరద కాల్వ |
191.51 |
131.37 |
ఎస్సారెస్పీ-2 |
135.40 |
94.81 |
తుపాకులగూడెం |
235.71 |
73.83 |
దిగువ పెనుగంగ |
84.18 |
72.08 |
డిండి |
90.87 |
56.05 |
ఎల్లంపల్లి |
38.11 |
28.06 |
ప్రాణహిత |
17.31 |
12 |
కల్వకుర్తి |
4 |
2.29 |
నెట్టెంపాడు |
25 |
16.70 |
భీమా |
25 |
3.69 |
కోయిల్‌సాగర్ |
25 |
17.40 |
జూరాల |
5 |
3.69 |
ఎస్సారెస్పీ-1 |
8.10 |
25.52 |
ఆర్డీఎస్ |
27.50 |
19.35 |
ఘణపూర్ |
34 |
15 |
కొమరంభీమ్ |
14.45 |
10.12 |
లెండి |
1 |
0.68 |
సింగూరు |
7 |
6.17 |
ఎస్ఎల్బీసీ |
3 |
3.16 |
నల్లవాగు |
5 |
3.43 |
చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి |
4.60 |
2.82 |
జగన్నాథ్‌పూర్ |
14.12 |
9.92 |
ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధికి రూ. 26,306 కోట్లు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 2020-21 ఏడాది బడ్జెట్లో రూ.26,306.25 కోట్లు కేటాయించారు. 2019-20 ఏడాదితో పోల్చితే తాజా కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా సర్కారు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు.