మే 17న ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ డే

ప్ర‌తి ఏడాది మే 17న ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ డే జ‌రుపుకుంటున్నారు.
Current Affairs సుదూర ప్రాంతాల మ‌ధ్య దూరాన్ని త‌గ్గంచేలా క‌మ్యూనికేష‌న్‌ని వ్యాప్తి చేయ‌డ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం. మ‌న జీవితంలో క‌మ్యూనికేష‌న్ ఎంత కీల‌క‌మైన‌దో అవ‌గాహ‌న పెంచ‌డం, ఈ రంగంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధిప‌ర‌చ‌డం వంటివి ఈ దినోత్స‌వం ప్ర‌ధాన ల‌క్ష్యాలు.

ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ డే ఇంట‌ర్నేష‌న‌ల్ టెలిగ్రాఫ్ యూనియ‌న్‌(ఐటీయూ)తో గ‌ట్టి సంబంధాలు క‌లిగి ఉంది. అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ పద్ధతులకు మద్దతుగా 1865 ఈ ఇంటెర్నెష‌న‌ల్ టెలిగ్రాఫ్ యూనియ‌న్‌(ఐటీయూ) క‌మిటి ఏర్పాటైంది. 1876లో టెలిఫోన్ క‌నుగొన‌టం, 1957లో మొద‌టి ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం, 1960ల‌లో ఇంట‌ర్నెట్ పుట్టుక త‌దిత‌ర స‌రికొత్త ఆవిష్క‌ర‌ణాలు మొద‌లైయ్యాయి.
అప్ప‌టి నుండి ఇంట‌ర్నేష‌నల్ టెలిగ్రాఫ్ యూనియ‌న్ త‌న పేరును టెలియ‌క‌మ్యూనికేష‌న్స్ యూనియ‌న్ గా మారింది. ఇప్ప‌టికీ కమ్యూనికేషన్ రంగంలో అతి ముఖ్యమైన సంస్థగా పేరుగాంచింది. త‌ద్వారా ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ డేలో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ డే యొక్క ఉద్దేశ్యం సాంకేతికత తీసుకువచ్చే అవకాశాలపై అవగాహన పెంచడంలో సహాయపడటం. ఇంటర్నెట్ మరియు ఇతర ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసిటి) పై దృష్టి సారించేలా చేయడం.

చ‌రిత్ర‌: మొద‌టిసారిగా మే 17, 1968లో ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ దినోత్స‌వం జ‌రుపుకున్నారు. మే 17న అంత‌ర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియ‌న్ స్థాపించారు. అలాగే మొద‌టి అంత‌ర్జాతీయ టెలిగ్రాఫ్‌ క‌న్వెన్షెన్‌ పై 1865 మే 17న పారిస్‌లో సంత‌కం చేశారు. అందువ‌ల్ల మే 17ను ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ దినోత్స‌వంగా ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మం అధికారికంగా మొట్ట‌మొద‌టిసారిగా స్పెయిన్‌లో జ‌రిగింది. ప్ర‌తి ఏడాది ఒక థీమ్‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.
Published on 5/12/2020 6:10:00 PM

Related Topics