గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్(గేట్)–2021లో పలు మార్పులు చేశారు. ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు వీలు కల్పించే గేట్ పరీక్షకు..
ఇకపై హ్యుమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2021లో కొత్తగా రెండు సబ్జెక్టు పేపర్లు..ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లను ప్రవేశపెట్టారు. దాంతో గేట్లో మొత్తం సబ్జెక్టు పేపర్ల సంఖ్య 25 నుంచి 27కు పెరిగింది. గతంలో ఒక అభ్యర్థి ఒక పేపర్ మాత్రమే రాసేందుకు వీలుండేంది. కాని ఇప్పుడు విద్యార్థుల్లో ఇంటర్‌డిసిప్లినరీ విద్యా విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రెండు సబ్జెక్టు పేపర్లకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు. గతంలో గేట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 10+2+4 పూర్తి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 10+2+3 విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. తద్వారా బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా గేట్ రాసేందుకు అర్హత లభిస్తుంది. ఐఐటీ బాంబే.. గేట్ 2021 నిర్వహణ సంస్థగా వ్యవహరించనుంది. త్వరలో గేట్ 2021 నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గేట్ 2021 మార్పులతో ప్రయోజనాలు:
- హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విద్యార్థులు సైతం గేట్ పరీక్షకు హాజరవడం ద్వారా ఐఐటీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరే వీలు కలుగుతుంది.
- బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా గేట్ 2021కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రతి అభ్యర్థి రెండు పేపర్లకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది.
- గేట్ పరీక్ష 100 మార్కులకు జరుగుతుంది. ప్రతి పేపర్లో కామన్‌గా 15 మార్కులకు జనరల్ అప్టిట్యూడ్ ఉంటుంది.
- పూర్తి వివరాలకు వెబ్సైట్: http://gate.iitd.ac.in/