జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు తేజాలహవా

సాక్షి, హైదరాబాద్ : జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని కొండా రేణు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు దక్కించుకుని సత్తా చాటింది.
Education Newsమన రాష్ట్రానికే చెందిన బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంక్ సాధించాడు. తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఐదో ర్యాంకు, అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వనాథ్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్ ఫణి సాయి 19వ ర్యాంకులతో రికార్డుల మోత మోగించారు. జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన టాప్-24 ర్యాంకర్లలో ఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్ పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.

బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 29 రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కై వసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు.

మే 27న జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష :
జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్ డ్ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా పేపర్-1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్ డ్‌లో మెరిట్ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
  • జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు అర్హత కోసం జేఈఈ మెయిన్‌లో సాధించాల్సిన కటాఫ్ స్కోర్లను ఎన్టీఏ ప్రకటించింది.

కేటగిరీ

స్కోరు

జనరల్

89.7548849

ఆర్థికంగా వెనకబడినవారు (ఈడబ్ల్యూఎస్)

78.2174869

ఓబీసీ

74.3166557

ఎస్సీ

54.0128155

ఎస్టీ

44.3345172

వికలాంగులు

0.1137173


జేఈఈ అడ్వాన్స్ డ్ ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

మే 5 నుంచి

దరఖాస్తుకు చివరి తేదీ

మే 9

ఫీజు చెల్లింపునకు గడువు

మే 10

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్

మే 20నుంచి

జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష

మే 27

ఆన్‌లైన్ కీ విడుదల

జూన్ 4

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు

జూన్ 14


  • ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో రెండు దఫాలుగా జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ స్కోరు సాధించిన 24 మంది విద్యార్థులు వివరాలను ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకుల వారీగా విద్యార్థుల జాబితా..

100 పర్సంటైల్ స్కోరు సాధించిన వారు వీరే..

ర్యాంక్

విద్యార్థి పేరు

రాష్ట్రం

1

శుభాన్ శ్రీవాత్సవ

ఢిల్లీ

2

కెవిన్ మార్టిన్

కర్ణాటక

3

ధ్రువ్ అరోరా

మధ్యప్రదేశ్

4

జయేష్ సింగ్ల

పంజాబ్

5

బట్టెపాటి కార్తికేయ

తెలంగాణ

6

నిశాంత్ అభాంగి

రాజస్తాన్

7

అడెల్లి సాయికిరణ్

తెలంగాణ

8

విశ్వంత్ కే

తెలంగాణ

9

కొండా రేణు

ఆంధ్రప్రదేశ్

10

అభయ్ ప్రతాప్ సింగ్ రాథోడ్

మధ్యప్రదేశ్

11

సంబిత్ బెహరా

రాజస్తాన్

12

శుభంకర్ గంభీర్

రాజస్తాన్

13

అంకిత్ కుమార్ మిశ్రా

మహారాష్ట్ర

14

హిమాంశు గౌరవ్ సింగ్

ఉత్తరప్రదేశ్

15

ప్రఖార్ జగ్వాని

మధ్యప్రదేశ్

16

ధ్రువ్ మర్వాహ

హర్యాణ

17

నమన్ గుప్త

ఉత్తరప్రదేశ్

18

గుప్త కార్తికేయ చంద్రేశ్

మహారాష్ట్ర

19

ఇందుకూరి జయంత్ ఫణిసాయి

తెలంగాణ

20

సమీక్ష దాస్

రాజస్తాన్

21

బొజ్జ చేతన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్

22

గుడిపాట్య అనికేత్

జార్ఖండ్

23

జితేంద్ర కుమార్ యాదవ్

హరియాణా

24

రాజ్ ఆర్యణ్ అగర్వాల్

మహారాష్ట్ర


జేఈఈ మెయిన్-2019 ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published on 4/30/2019 3:16:00 PM
టాగ్లు:
JEE Main-2019 JEE Main-2019 results JEE Main-2019 resultsreleased JEE Main-2019top rankers Bojja chetan reddy JEE advanced 2019 date National testing agency JEE cut off marks 2019

Related Topics