హెచ్‌ఏఎల్-నాసిక్‌లో 165 అప్రెంటిస్ ఖాళీలు.. చివరి తేది ఫిబ్రవరి 25

Join our Community

facebook Twitter Youtube
నాసిక్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 165
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు-87; -టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీలు-78.
విభాగాలు: ఏరోనాటికల్ ఇంజనీరింగ్,సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, పాలిమర్స్ తదితరాలు.
అర్హతలు:
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి.
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: అభ్యర్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీ (డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి. గ్రాడ్యుయేట్-ఇంజనీరింగ్ చదువుతున్నవారు ఈ అప్రెంటిస్‌షిప్‌నకు అర్హులు కాదు.

వయసు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వయసు ఉండాలి.
స్టయిపెండ్: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000 వరకు చెల్లిస్తారు. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తు పూరించి డీజీఎం, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్, నాసిక్ పోస్ట్: ఓజహార్ టౌన్‌షిప్, తాల్: నిపడ్, జిల్లా: నాసిక్, మహారాష్ట్ర - 422207 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 25, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.mhrdnats.gov.in
Published on 2/20/2021 3:02:00 PM

Related Topics