భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో 147 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Join our Community

facebook Twitter Youtube
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘బెల్’ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ యూనిట్లలో ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియకు చేపడుతుంది. ఇందులో భాగంగా ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 147
పోస్టుల వివరాలు:
  • ఇంజనీరింగ్ సర్వీస్ డివిజన్-37
  • సాఫ్ట్‌వేర్ డివిజన్-108

అర్హతలు:
  • ట్రైనీ ఇంజనీర్-ఎస్‌డీ-టీఈకి దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్ అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
  • ప్రాజెక్ట్ ఇంజనీర్-ఎస్-పీఈకి దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్/ఎలక్ట్రానిక్ అండ్ టెలి కమ్యునికేషన్)లో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
  • ప్రాజెక్ట్ ఇంజనీర్(1)-ఈ పోస్టుకు దరఖాస్తుకు చేసుకునే వారు సివిల్/ఈఈఈ /మెకానికల్ బీఈ/బీటెక్ ఇంజనీరింగ్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
  • గేట్ స్కోర్ లేని ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
  • టైనీ ఇంజనీర్ పోస్టుకు రూ.200/-
  • పాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.500/-
ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌గా సాధించిన మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 27, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://bel-india.in
Published on 9/16/2020 2:07:00 PM

Related Topics