ఐబీపీఎస్-647 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు... నోటిఫికేషన్, ప్రిపరేషన్ మెటీరియల్ మీకోసం!

Join our Community

facebook Twitter Youtube
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)... కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 647 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లు, రాజ్ భాషా అధికారి. లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
Jobs
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ప్రిపరేషన్ మెటీరియల్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, గెడైన్స్, బిట్‌బ్యాంక్స్... ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

వివరాలు:
ఐబీపీఎస్ సీఆర్‌పీ: డిసెంబర్ 2020/జనవరి 2021
పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్లు-20, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్-485, రాజభాష అధికారి-25, లా ఆఫీసర్-50, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్-07,మార్కెటింగ్ ఆఫీసర్-60.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: నవంబర్ 1, 2020 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరీ,మెయిన్)ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేదీలు: ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష-2020 డిసెంబర్ 26,27; మెయిన్ పరీక్ష-2021 జనవరి 24.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 2, 2020.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 23, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.ibps.in
Published on 11/4/2020 5:12:00 PM

Related Topics