Advertisement

స్టూడెంట్, అకడమిక్ ఎ క్స్ఛేంజ్ విజిట ర్ విసాలిచ్చేందుకు రంగం సిద్ధం!

సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది.
Education News

స్టూడెంట్, అకడమిక్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్ వీసాల దరఖాస్తు ప్రక్రియను పరిమితంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈనెల 17న హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని యూఎస్ ఎంబసీల్లో ఈ ప్రక్రియ మొదలుకానుందని హైదరాబాద్‌లోని కాన్సులేట్ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో పరిమిత స్థాయిలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు వివరించింది. శీతాకాల సెమిస్టర్ (ఫాల్ సెమిస్టర్) ప్రారంభమయ్యే సమయానికి తమ వద్ద చాలా తక్కువ అపాయింట్‌మెంట్లు మాత్రమే ఉన్నందున.. వాటి కోసం వచ్చే అన్ని విజ్ఞప్తులనూ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టంచేసింది. తరగతులు ఎప్పుడు మొదలవుతాయి? అపాయింట్‌మెంట్ల కోసం విజ్ఞప్తులు ఎప్పుడు అందాయనే ప్రాతిపదికన వాటిని పరిశీలిస్తామని, ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు వేచి చూడాలని సూచించింది. తొలుత ఆగస్టు 12వ తేదీకి ముందు వచ్చిన అత్యవసర విద్యార్థి, ఎక్స్‌ఛేంజ్ విజిటర్ అభ్యర్థనలను పరిశీలించి వీసా అపాయింట్‌మెంట్లను ఇస్తామని పేర్కొంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలు, అవసరాన్ని బట్టి రెండు వారాల ముందు అపాయింట్‌మెంట్లు ఇస్తామని తెలిపింది. అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ విజిటర్స్ తమ తరగతులు మొదలుకావడానికి మూడు వారాల కంటే ముందు మాత్రమే అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఆ వీసా సర్వీసుల నిలిపివేత యథాతథం..
సాధారణ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సర్వీసుల నిలిపివేత మాత్రం యథాతథంగా కొనసాగుతుందని, వీలైనంత త్వరగానే సాధారణ వీసా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలున్నా.. దానికి సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేమని కాన్సులేట్ తెలిపింది. గతంలో ఎమ్మార్‌వీ ఫీజు కట్టినవారు ఏడాదిలోగా దానిని ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ కోసం ఉపయోగించుకోవచ్చునని స్పష్టంచేసింది. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ‘ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్’కోసం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఇక హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, ఎల్, కొన్ని జే కేటగిరీల దరఖాస్తుదారులు తాము అపాయింట్‌మెంట్ పొందడానికి వీలుందో లేదో పరిశీలించిన తర్వాత అందుకు విజ్ఞప్తి చేయాలని స్పష్టంచేసింది.

Published on 8/15/2020 12:39:00 PM
టాగ్లు:
USA Student visa exchange visitor visa fall semester immigrant visas

Related Topics