Sakshi education logo

బిట్‌శాట్‌లో విజయానికి మార్గాలు ఇవే..!

Join our Community

facebook Twitter Youtube
ప్రతిష్టాత్మక బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(బిట్స్‌)లో ప్రవేశానికి మార్గం... బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(బిట్‌శాట్‌). ఏటా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు.
Edu news

బిట్‌శాట్‌–2020 దరఖాస్తు ప్రక్రియ ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభమైనప్పటికీ.. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా టెస్ట్‌ సెంటర్‌ల కేటాయింపు, స్లాట్‌ బుకింగ్‌ తేదీ, అడ్మిట్‌ కార్డుల జారీలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో.. బిట్‌శాట్‌–2020 పరీక్షలో విజయానికి నిపుణుల సలహాలు..

బిట్స్‌ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి బిట్‌శాట్‌ను నిర్వహిస్తారు. ఇంటర్మీడియెట్‌ అర్హతతో రాయడానికి వీలున్న ఈ పరీక్షకు జేఈఈ, ఎంసెట్‌ తర్వాత ఎక్కువ శాతం మంది అభ్యర్థులు సన్నద్ధమవుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యాసంస్థగా నిలిచి, ఎంహెచ్‌ఆర్‌డీ నుంచి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ గుర్తింపు పొందిన బిట్స్‌లో సీటు కోసం ప్రతిభావంతులు పోటీపడుతుంటారు. బిట్‌శాట్‌ స్కోర్‌ ఆధారంగా పలు ప్రైవేటు యూనివర్సిటీలు/విద్యాసంస్థలు సైతం బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు..
పిలానీ క్యాంపస్‌..

 • బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌
 • బీఫార్మ్‌
 • ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ: బయలాజికల్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ జనరల్‌ స్టడీస్‌
గోవా క్యాంపస్‌..
 • బీఈ: కెమికల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్
 • ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ: బయలాజికల్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌.
హైదరాబాద్‌ క్యాంపస్..
 • బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్‌.
 • బీఫార్మ్‌
 • ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ: బయలాజికల్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌.
బిట్‌శాట్‌ పరీక్ష విధానం..
 • బిట్‌శాట్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి.
 • పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
 • పార్ట్‌–4లో పేర్కొన్న మ్యాథమెటిక్స్‌ లేదా బయాలజీ సబ్జెక్టుల్లో బీఫార్మసీ అభ్యర్థులు ఏదో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. బీఈ కోర్సుల అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుతోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
 • ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 150 ప్రశ్నలతో 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.
 • అదనంగా 12 ప్రశ్నలు: బిట్‌శాట్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌లో మరో ప్రత్యేకత.. పరీక్షకు కేటాయించిన మూడు గంటల వ్యవధిలోపే 150 ప్రశ్నలను పూర్తిచేసిన అభ్యర్థులకు.. అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/బయాలజీ నుంచి నాలుగు ప్రశ్నలు చొప్పున ఇస్తారు.
అప్లికేషన్‌ తరహా..
 • బిట్‌శాట్‌లో అడుగుతున్న ప్రశ్నలు, వాటి తీరును గమనిస్తే.. జేఈఈ తరహాలోనే క్లిష్టత స్థాయి ఎక్కువగా ఉంటోంది. ప్రశ్నలన్నీ దాదాపుగా అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో సమాధానం ఇవ్వాల్సిన విధంగా ఉంటున్నాయి. దీంతో అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లలో బేసిక్స్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
 • ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లతో బేరీజు వేస్తే.. బిట్‌శాట్‌ ప్రత్యేకం పార్ట్‌–3 అని చెప్పొచ్చు. ఈ విభాగంలో ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. కేవలం అభ్యర్థుల్లోని సబ్జెక్ట్‌ నైపుణ్యాలను పరీక్షించడమే కాకుండా.. లాంగ్వేజ్, తులనాత్మక పరిశీలన సామర్థ్యాన్ని పరీక్షించే లా ఈ విభాగాన్ని పొందుపర్చారు. పదో తరగతి స్థాయిలో.. ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీపై పట్టుంటే 25 ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇవ్వొచ్చు.
 • బేసిక్స్‌పై పట్టు సాధించడంతోపాటు విద్యార్థులు నిర్దిష్టంగా కొన్ని వ్యూహాలు అనుసరిస్తే బిట్‌శాట్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశముంది.
 • ప్రతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్‌ మెథడ్స్‌తో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది.
 • కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో కెమికల్‌ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.
 • ఫిజిక్స్‌లో.. వర్క్‌ అండ్‌ ఎనర్జీ, న్యూటన్స్‌ లా, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్‌ మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్‌ ఆఫ్‌ కరెంట్, ఎలక్ట్రిక్‌ కరెంట్‌ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్‌ రూపొందించుకోవాలి.
 • మ్యాథమెటిక్స్‌లో హైపర్‌బోలా, పారాబోలా, రెక్టాంగులర్‌ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3–డి, ఇంటెగ్రిల్‌ కాలిక్యులస్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • కేవలం బిట్‌శాట్‌నే లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులు.. ప్రత్యేక వ్యూహాలు అనుసరించాలి. ప్రతిరోజు, ప్రతి విభాగానికి కచ్చితంగా నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం రెండు గంటలు చొప్పున కేటాయించేలా వ్యవహరించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని సిలబస్‌ను అనుసరిస్తూ.. వాటిని బిట్‌శాట్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ.. చదివితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎగ్జామ్‌ డే టిప్స్‌..
 • పరీక్ష రోజు వరకు చదువుతూ ఉండకుండా ఒక రోజు ముందుగానే ప్రిపరేషన్‌ను ముగించాలి. చివరగా ముఖ్యమైన పాయింట్లను లేదా షార్ట్‌ నోట్సును రివిజన్‌ చేసుకోవాలి.
 • చివరి సమయంలో సమస్యలను సాధించుకుంటూ కూర్చోకుండా శీఘ్ర అవలోకనం చేసుకోవాలి.
 • కోవిడ్‌19 మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలకు తావివ్వకుండా స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలి.
 • విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పరీక్ష ప్రారంభ సమ యానికి కనీసం ఒక గంట ముందుగా చేరుకోవాలి. అవసరమైతే ముందురోజే సందర్శించడం ద్వారా పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు పట్టే సమయంపై అంచనాకు రావచ్చు.
 • పరీక్షకు ముందురోజు నిర్ణీత సమయం వరకు రివిజన్‌ చేసుకుని తగినంత నిద్ర పోవాలి.
 • పరీక్ష రోజు విద్యార్థులు ఆహార సమతుల్యత పాటిం చాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవాలి.
 • సబ్జెక్టులకు సంబంధించిన అంశాల గురించి చివరి నిమి షం వరకు ఆందోళన చెందొద్దు. ప్రిపరేషన్‌ ముగిసిన విషయాన్ని గుర్తించి, ఆత్మవిశ్వాసంతో సానుకూల ఆలోచనలతో పరీక్ష హాలులోకి ప్రవేశించాలి.
బిట్‌శాట్‌–2020 రీషెడ్యూల్‌ తేదీలు
 • టెస్ట్‌ సిటీ కేటాయింపు: 1 జూలై 2020
 • స్లాట్‌ బుకింగ్‌: 2020 జూలై 10 నుంచి 16 వరకు
 • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: 2020 జూలై 23 నుంచి ఆగస్టు 10 వరకు
 • బిట్‌శాట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు: 2020 ఆగస్టు 6 నుంచి 10 వరకు
 • ఇంటర్మీడియెట్‌ బోర్డు మార్కులు, ప్రాధాన్యతలతో దరఖాస్తు తేదీలు: 2020 ఆగస్టు 25 నుంచి 16వరకు
 • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: బిట్స్‌ పిలానీ–హైదరాబాద్‌ క్యాంపస్, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.bitsadmission.com
Published on 7/2/2020 3:37:00 PM

సంబంధిత అంశాలు