Sakshi education logo

నూతన విద్యా విధానంలో ఆన్‌లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇలా..

Join our Community

facebook Twitter Youtube
కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా దేశ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.ఇప్పటికే అందుబాటులో ఉన్న ఐసీటీ ఆధారిత విద్యా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తారు.
Edu newsదీక్ష, స్వయం వంటి ఈలెర్నింగ్ వేదికలను అందరికీ అందుబాటులో తెచ్చేలా చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల ఆన్‌లైన్ లెర్నింగ్‌పై దృష్టిపెడతారు. కంటెంట్‌ను రూపొందించడం, అందుబాటులోకి తేవడం,బోధన, నేర్చుకోవడం, మూల్యాంకనంలో టెక్నాలజీని సమ్మిళితం చేయడం వంటివి అమలు చేస్తారు. దివ్యాంగులు,వెనుకబడిన వర్గాలకు ఆన్‌లైన్ ఎడ్యకేషన్‌ను అందుబాటులోకి తెస్తారు.
Published on 7/31/2020 5:18:00 PM

సంబంధిత అంశాలు