Sakshi education logo

ఏపీపీఎస్సీగ్రూప్-1 మెరుున్‌‌స షెడ్యూల్ అక్టోబర్ 29న విడుదల

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: వచ్చే నెల రెండు నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెరుున్‌‌స పరీక్షను హైకోర్టు వారుుదా వేసింది.
Edu newsప్రిలిమినరీ పరీక్ష రద్దుకు నిరాకరించింది. ఐదు ప్రశ్నలకు సంబంధించిన కీను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులకు నివేదించి, సరైన జవాబులను పరిశీలించి, వాటి ఆధారంగా తిరిగి మెరిట్ జాబితాను తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)ను ఆదేశించింది. తాజా మెరిట్ జాబితా ప్రకారం అర్హులైన వారిని పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది. మెరుున్‌‌స పరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్న నిర్ణయాన్ని సర్వీస్ కమిషన్‌కే వదిలేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు గురువారం తీర్పు వెలువరించారు. ప్రాథమిక పరీక్ష రద్దు కోసం, దివ్యాంగులకు రిజర్వేషన్ల కల్పన కోసం దాఖలైన వ్యాజ్యాలను కొట్టేశారు. ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులుదొర్లాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రరుుంచారు. పలుమార్లు విచారణ అనంతరం జస్టిస్ రఘునందనరావు తీర్పు ఇచ్చారు.
 
 Must Check: APPSC Groups Study Material  

 అక్టోబర్ 29నతదుపరి షెడ్యూల్
  హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షలను వారుుదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్-1 మెరుున్‌‌స పరీక్షలు నవంబర్ 2 నుంచి 13వ తేదీవరకు నిర్వహించాల్సి ఉంది. కాగా తదుపరి పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 29న ప్రకటిస్తామని చెప్పారు. కాగా, గ్రూప్-1 మెరుున్‌‌స వారుుదా పడినా.. ఇప్పటికే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 8 వేల మందికి పైగా అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని పీఎస్సార్ ఆంజనేయులు వివరించారు. వీరు మెరుున్‌‌స పరీక్షకు హాజరు కావచ్చని, డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపారు. కొత్తగా అర్హత సాధించిన వారికి మెరుున్‌‌సకు అవకాశం కల్పిస్తామన్నారు. 
Published on 10/23/2020 5:38:00 PM

సంబంధిత అంశాలు