Sakshi education logo

బీటెక్ విద్యార్థులకు నాన్-ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు.. అందుకోండిలా..

Join our Community

facebook Twitter Youtube
బీటెక్.. బ్రాంచ్ ఏదైనా సరే.. విద్యార్థుల స్వప్నం ఐటీ ఉద్యోగం సొంతం చేసుకోవడమే! ఇందుకోసం బ్రాంచ్‌తో సంబంధం లేకుండా.. ఇంజనీరింగ్‌లో చేరిన అధిక శాతం మంది విద్యార్థులు.. ఐటీ రంగంలో కొలువుదీరేందుకు.. సంబంధిత నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు.
Edu news మరోవైపు ఐటీ రంగంలో ఆశించిన వారందరికీ కొలువులు దక్కే పరిస్థితి లేదు! ఇలాంటి ఐటీ ఆశావహులకు నాన్-ఐటీ రంగం ఆహ్వానం పలుకుతోంది. ఉత్పత్తి రంగం మొదలు రిటైల్, సేల్స్ వరకు..నాన్-ఐటీ సెక్టార్స్‌లో ఐటీ టాలెంట్ నియామకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నాన్-ఐటీ సెక్టార్‌లో ఐటీ  కొలువులు, టాప్ రిక్రూటర్స్, అవసరమైన నైపుణ్యాలపై తెలుసుకోండిలా..
 
 ప్రస్తుత పరిస్థితుల్లో నియామకాల పరంగా ఐటీ రంగానిదే ముందంజ అనడం సందేహం లేదు. ఈ రంగంలో స్థిరపడాలంటే..ఎన్నో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. నిత్య విద్యార్థిగా కొత్త కొత్త కోర్సులు ఔపోసన పడుతుండాలి. ఇటీవల కా లంలో ఐటీతోపాటు నాన్-ఐటీ రంగ సంస్థల్లోనూ సాఫ్ట్‌వేర్ కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ బ్రాంచ్‌లు మాత్రమే కాకుండా.. మెకా నికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు సైతం నాన్-ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అభ్యర్థులు చేయాల్సిందల్లా సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకోవడమే.
 
 ముందంజలో నాలుగు రంగాలు..
 నాన్-ఐటీ సెక్టార్స్‌లో టెక్నాలజీ కొలువులు, నియా మకాల పరంగా ప్రధానంగా నాలుగు రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. అవి.. ఫిన్‌టెక్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, బీఎఫ్‌ఎస్‌ఐ. దీనికి కారణం.. ఆయా రంగాలు టెక్నాలజీ ఆధారిత సేవలందిస్తూ.. మార్కెట్‌లో దూసుకుపోవడానికి ప్రణాళికలు రూపొందిస్తుండటమే. ఈ రంగాల్లోని సంస్థలు అంతర్గతంగా పలు విభాగాల్లో టెక్నికల్ పోస్టుల్లో నియామకాలకు పెద్దపీట వేస్తున్నాయి.
 
 పెరుగుతున్న నియామకాలు..
 నాన్-ఐటీ రంగంలో టెక్నకల్ గ్రాడ్యుయేట్స్ నియామకాల వృద్ధి ఏటేటా పెరుగుతోందని పలు గణాంకాలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మ్యాన్‌పవర్ గ్రూప్ ఆధ్వర్యం లోని ఎక్స్‌పెరిస్ సర్వే ప్రకారం-ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో నాన్-ఐటీ సెక్టార్స్‌లోని సంస్థల్లో ఐటీ డొమైన్స్‌లో నియామకాలు 17శాతంగా ఉన్నాయి. 2019లో పోల్చితే ఈ సంఖ్య 4శాతం అధికంగా ఉండటమే నాన్- ఐటీ సెక్టార్‌లో ఐటీ కొలువుల జోరుకు నిదర్శనమని చెబుతున్నారు.

నాన్-ఐటీ రంగంలో టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునేందుకు మాన్యు ఫ్యాక్చరింగ్ మొదలు సర్వీస్ సెక్టార్ వరకు.. టాప్ కంపెనీలన్నీ సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఈ-కామర్స్, రిటైల్, బ్యాంకింగ్ సెక్టార్స్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీటెక్, ఇతర టెక్నికల్ అర్హతలున్న విద్యార్థులు ఈ రంగాలవైపు దృష్టిసారిస్తే అవకాశాలు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
 
 ఇంకా చదవండి: part 2: నాన్-ఐటీ రంగంలో బీటెక్ విద్యార్థులకు ఉద్యోగాలు.. ఈ విధానాలే కారణాలు ఇవే.. 
Published on 11/20/2020 4:13:00 PM

సంబంధిత అంశాలు