Sakshi education logo

టీఎస్ ఎంసెట్: ఇవి గుర్తుంచుకోండి..

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ను నిర్వహించేందుకు కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Education News

తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్ధులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామని ఎంసెట్ కమిటీ పేర్కొంది. ఉదయం పరీక్ష 9 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమవుతుందని, ఆ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా ఇచ్చామని తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునాశానిటైజేషన్ చర్యలు చేపట్టామని, విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

EAMCET Quick Review, Bitbanks, Practice Tests and Sample Papers

ఇవి గుర్తుంచుకోండి..

  • పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకుంటారు.
  • విద్యార్థులు తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. డాక్టర్ సర్టిఫికెట్ అవసరం లేదు.
  • పరీక్ష కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎవరికైనా కరోనా లక్షణాలైన హైఫీవర్, తీవ్రమైన దగ్గు, శ్వాస సంబంధ సమస్య ఉంటే వెనక్కి పంపిస్తారు.
  • వారు ఆ పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్‌కు తమ వివరాలతో ఒక లెటర్ రాసి ఇస్తే వారికి తరువాత రోజు సెషన్లలో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపడతారు.
  • కరోనా పాజిటివ్ వచ్చినవారు సమాచారం ఇస్తే వారికి తరువాత ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు.
  • ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారంపై గెజిటెడ్ అధికారి/ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.
  • పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, హాల్ టికెట్‌తోపాటు ఆధార్ వంటి ఏదేని ఒరిజినల్ ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి.
  • రఫ్ వర్క్ కోసం వినియోగించిన బుక్‌లెట్‌ను ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చివేయాలి.
  • మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులే తెచ్చుకోవాలి.
  • విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రవేశాల సమయంలో అడుగుతారు.
Published on 9/9/2020 2:26:00 PM

సంబంధిత అంశాలు