Sakshi education logo

వీఏఏ పరీక్షకు వీరికి అర్హత లేదు..

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ-గ్రేడ్-11) పరీక్షకు బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) చదివిన వారు, వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా పని చేస్తున్న వారు అనర్హులని వ్యవసాయ శాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Education Newsగతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వీఏఏ పరీక్షలకు వీరు అర్హులని ప్రకటించినప్పటికీ ప్రభుత్వ సర్వీసు నిబంధనలు ఇందుకు అనుగుణంగా లేకపోవడంతో ఈ విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ విద్యార్హతలతో ఎవరైనా పరీక్ష రాసినా వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోరని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published on 9/17/2020 1:38:00 PM

సంబంధిత అంశాలు