Sakshi education logo

సెప్టెంబర్ 16 నుంచి జేఎన్‌టీయూహెచ్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు

Join our Community

facebook Twitter Youtube
షెడ్యూల్ విడుదల చేసిన జేఎన్‌టీయూహెచ్
Education Newsసాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల (రెగ్యులర్/సప్లిమెంటరీ) తేదీలు ఖరారయ్యాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రెండో సెమిస్టర్ పరీక్షలను తాజాగా ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. బీటెక్, బీ ఫార్మసీలో ఆర్09, ఆర్13, ఆర్15, ఆర్16 సబ్జెక్టుల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సెమిస్టర్ పరీక్షలను రోజుకు రెండు చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పరీక్ష నిర్వహిస్తారు.
Published on 9/2/2020 12:31:00 PM
టాగ్లు:
JNTUH Time Table 2020 JNTUH Exams

సంబంధిత అంశాలు