Sakshi education logo

చీవినింగ్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు, చివరి తేదీఎప్పుడంటే...

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదవాలనేది మీ కలా? కారణాలేవైనా... చదువు ముగించుకుని ఉద్యోగ సాగరం ఈదుతున్నారా? ఏం పర్వాలేదు. మీ కల నెరవేరేందుకు ఇప్పటికీ అవకాశముంది.
Education Newsయునెటైడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వం ప్రాయోజకత్వంలో అక్కడి 150 విశ్వవిద్యాలయాల్లోని సుమారు 12 వేల కోర్సుల్లో మీకు నచ్చిన దానిని ఎంపికచేసుకొని చదివేందుకు వీలు కల్పించే చీవినింగ్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తుండడమే ఇందుకు కారణం. ఎంపికై తే యూకేలో ఏడాది కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఖర్చులనూ ఆ దేశ ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు.. ఫెలోషిప్ కార్యక్రమం కింద జర్నలిజం, సైన్స్, ఇన్నోవేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో వృత్తి నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకూ బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆయా రంగాల్లో వృత్తిపర సంబంధాల పెంపునకు, కొత్త విషయాలు తెలుసుకునేందుకు 8 - 12 వారాలపాటు నడిచే ఈ ఫెలోషిప్‌లు అవకాశం కల్పిస్తాయి. ‘‘అత్యున్నత నైపుణ్యమున్న వారు యూకేలో విద్యనభ్యసించేందుకు చీవినింగ్ స్కాలర్‌షిప్, ఫెలోషిప్ అద్భుత అవకాశం. భారత్, యూకే మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యేందుకు, తెలుగు రాష్ట్రాల్లో ఆయా రంగాల్లో లీడర్లుగా ఉన్న వారు వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు ఇవి ఉపయోగపతాయి. యువకులు, మధ్యస్థాయిలో ఉన్న వృత్తి నిపుణులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి’’ అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూఫ్లెమింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. చీవినింగ్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోదలచిన వారికి రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి. నవంబర్ 3 చివరి తేదీ. ఏడు నుంచి పదేళ్ల వృత్తి అనుభవం ఉన్న వారు సౌత్ ఏషియన్ జర్నలిజం ఫెలోషిప్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ ఫెలోషిప్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో అక్టోబరు 19లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1983లో ప్రారంభమైన చీవినింగ్ స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ద్వారా ఇప్పటివరకూ సుమారు 3,200 మంది భారతీయ స్కాలర్లు యూకేలో అంతర్జాతీయ స్థాయి విద్య. వీరిలో కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, గజేంద్రసింగ్ షెఖావత్, సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్, తెలంగాణ ఐటీ కార్యదర్శి జయశ్ రంజన్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సమీర్ శరన్, టాటా సన్స్ కు చెందిన హరీష్‌భట్ తదితరులు ఉన్నారు.
Published on 9/5/2020 12:59:00 PM

సంబంధిత అంశాలు