Sakshi education logo

బాసర ట్రిపుల్‌ఐటీలో 2020-21 ప్రవేశానికి నోటిఫికేషన్

Join our Community

facebook Twitter Youtube
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌‌జ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ)లో 2020-21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Education Newsకళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు శనివారం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు 85 శాతం, స్థానికేతరులకు 15 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. భర్తీ కాని సీట్లను గ్లోబల్, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 5 శాతం మేర కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
Published on 9/14/2020 2:29:00 PM

సంబంధిత అంశాలు