Sakshi education logo

48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీలకు అనుమతులు రద్దు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రద్దు చేసింది.
Education News

ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండా కొనసాగుతుండటం, ఎలాంటి ప్రవేశాలు లేకుండానే నిర్వహిస్తుండటం, ప్రవేశాలు చేపట్టినా చేరికలు 25% కన్నా తక్కువగా ఉండటం వంటి కారణాలతో 246 ప్రయివేట్ డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీచేసింది. వీటిపై విచారణ కమిటీని నియమించిన మండలి ఆ షోకాజ్ నోటీసులకు నిర్ణీత డాక్యుమెంట్లతో కమిటీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కొన్ని కాలేజీలు కమిటీ ముందు హాజరై సమాధానాన్ని తెలియజేయగా, మరికొన్ని విచారణకు హాజరుకాలేదు. కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రయివేట్ డిగ్రీ కాలేజీల అనుమతులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు 61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని ప్రోగ్రామ్‌లను ఉన్నత విద్యామండలి ఉపసంహరించింది.

యూనివర్సిటీల వారీగా షోకాజ్ నోటీసులు అందుకున్న కాలేజీలు, అనుమతులు రద్దు, ప్రోగ్రామ్‌ల ఉపసంహరణ వివరాలు ఇలా..

వర్సిటీ

షోకాజ్ నోటీసులు

అనుమతుల రద్దు

ప్రోగ్రామ్‌ల ఉపసంహరణ

నన్నయ

50

7

17

నాగార్జున

23

7

9

ఏయూ

42

12

3

కృష్ణా

22

4

--

రాయలసీమ

17

1

9

ఎస్వీయూ

39

11

4

యోగివేమన

18

6

4

విక్రమ సింహపురి

7

--

3

బీఆర్ అంబేద్కర్

15

--

8

శ్రీకృష్ణదేవరాయ

13

--

4

Published on 11/4/2020 3:52:00 PM

సంబంధిత అంశాలు