Sakshi education logo
facebook Twitter Youtube Linkedin
facebook Twitter Youtube Linkedin Share Chat quora
Search Bar

35 వేల ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు?

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 35 వేల ఉద్యోగాల భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో.. తదుపరి విచారణలోగా తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Edu newsఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఉంటే ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించింది. అలాగే కరోనా చికిత్సలు, ల్యాబ్‌ పరీక్షలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ ఫీజులు తీసుకునే ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఏపీ, కేరళ రాష్ట్రాల తరహాలో పదింతల జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని గతంలో ఆదేశించినా ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీసింది. ఈ ఆదేశాల అమలుపై తదుపరి విచారణలోగా స్థాయి నివేదిక సమర్పిం చాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించా లంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మళ్లీ విచారించింది. కరోనా తగ్గుముఖం పట్టినా ఆన్‌లైన్‌లో మాత్రమే పాఠ్యాంశాలు బోధించాలని నిర్ణయించామని, భౌతిక తరగతులు నిర్వహించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీచేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదిం చారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన ఘటనల్లో అనాథలైన చిన్నారుల సంరక్షణ కోసం జిల్లాకు ఓ నోడల్‌ అధికారిని నియమించామని చెప్పారు.

ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?
కరోనా చికిత్సలో భాగంగా వినియోగించే ఔషధాల(లైఫ్‌ సేవింగ్‌)ను అత్యవసర మందుల జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆదేశించినా ఇప్పటికీ ఎందు కు చర్యలు చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయ వాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సంబం« దిత ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు నివేదించారు. ‘మూడో దశ కరోనా పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థి తులకు అనుగుణంగా వెంటనే తగిన చర్యలు తీసుకోండి’ అని ధర్మాసనం కేంద్రం తరఫు న్యాయవాదికి సూచించింది.

పూర్తికాలం సిబ్బందిని నియమించండి
‘వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన మెజారిటీ శానిటరీ, ఇతర నాలుగో తరగతి సిబ్బంది కాంట్రాక్టు ఉద్యోగులే. వీరి సర్వీసులను క్రమబద్ధీకరించడం లేదా పూర్తికాలం నియామకాలు చేపడితే మరింత మెరుగ్గా వారు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని ధర్మాసనం సూచించింది. సెరో సర్వేలెన్స్‌ సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నా రెండు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటికీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావును ధర్మాసనం ప్రశ్నించింది. సర్వే ఇప్పటికే పూర్తయిందని, శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని, తదుపరి విచారణలోగా నివేదిక సమర్పిస్తామని ఆయన నివేదించారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనాతో చనిపోయిన లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి చెందిన కుటుంబాలకు మరణానంతర బెనిఫిట్స్‌ మొత్తాన్ని అందించి ఆ వివరాలు తెలియజేయాలని గతంలో ఆదేశించినా.. ఎందుకు ఆ వివరాలు ఇవ్వలేదని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. అనివార్య కారణాల వల్ల ఆ వివరాలు సమర్పించలేకపోయామని, తదుపరి విచారణలోగా సమర్పిస్తామని ఏజీ నివేదించారు. స్పందించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని చెబుతూ తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.

‘లామ్డా’పై ఆందోళన వద్దు
ఇటీవల వెలుగు చూసిన ‘లామ్డా’వేరియంట్‌పై ఆందోళనపడాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు దేశంలో ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులు నమోదు కాలేదని డాక్టర్‌ శ్రీనివాసరావు నివేదించారు. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా చికిత్స లకు అధిక ఫీజులు వసూలు చేశారంటూ 231 ప్రైవేట్‌ ఆస్పత్రులపై 594 ఫిర్యాదులురాగా... 38 ఫిర్యాదుల్లో రూ.కోటి నాలుగు లక్షలు బాధితులకు వెనక్కు ఇప్పిం చామన్నారు. విచారణ జరిపి మిగిలిన బాధితులకు కూడా న్యాయం చేస్తామన్నారు.

చ‌ద‌వండి: మోడల్‌ స్కూళ్లలో 6 తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు జూలై 15 వరకు అవకాశం

చ‌ద‌వండి: తెలంగాణ ఎంసెట్‌– 2021కు దరఖాస్తుల వెల్లువ..

చ‌ద‌వండి: యథావిధిగా తెలంగాణ డిగ్రీ పరీక్షలు.. మార్పుల్లేవ్‌!
Published on 7/8/2021 4:22:00 PM

సంబంధిత అంశాలు