Sakshi education logo
Search Bar

ఈ సారి పరీక్షలు రాయకుండా పాస్‌ చేసే ప్రసక్తే లేదు: ఇంటర్‌ బోర్డు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.
Education Newsపరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేసే ఆలోచన బోర్డుకు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్‌ 201 టైం టేబుల్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్‌ పేపర్స్, కెరీర్‌ గైడెన్స్, ప్రాక్టికల్స్‌ గైడెన్స్‌... ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి ఒకట్రెండు రోజులు హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం వెల్లడించింది. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్ మెంట్‌ రూపంలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. విద్యార్థులు ఇంటివద్ద నుంచే అసైన్ మెంట్‌ రాసి కాలేజీలో సమర్పిస్తే సరిపోతుంది. అయితే ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మాత్రం వాయిదా పడే అవకాశముంది. ఈ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై బోర్డు అధికారులు మూడు రకాల ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
Published on 3/27/2021 3:07:00 PM

సంబంధిత అంశాలు