Sakshi education logo
Search Bar

టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుంటే భవిష్యత్తులో నష్టపోతారు: సీఎం వైఎస్‌ జగన్‌

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి రాజేయడానికి, వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేయడం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Education Newsకేవలం పాస్‌ మార్కుల సర్టిఫికెట్‌తో ఓ విద్యార్థి బయటపడితే తరువాత వారి భవిష్యత్తు సంగతి ఏమిటని ప్రశ్నించారు. బొటాబొటి మార్కులతో పాసైన వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు ఎలా నెగ్గుకు రాగలుగుతారో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద తొలివిడతగా 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.1,048.94 కోట్లను సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని తల్లులు, విద్యార్థులు, అధికారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం వివరాలు ఇవీ...

Check AP Tenth Class 2021 Study Material, Previous Papers and Model papers

ఒక్కసారి ఆలోచన చేయండి..
పిల్లలు, తల్లిదండ్రులు అంతా ఆలోచించాల్సిన విషయాలు చెబుతా. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్న వారికి కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్తు కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరూ ఉండరని చెబుతున్నా. అంతగా మన పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నా, తపిస్తున్నా. వారి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవాళ మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

Check AP Inter 1st Year 2021 Model Papers

Check AP Inter 2nd Year 2021 Model Papers

రాష్ట్రాలదే ఆ నిర్ణయం..
ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన పాలసీ లేదు. కేంద్రం కొన్ని నిర్ణయాల బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి.

కేవలం పాస్‌ సర్టిఫికెట్లతో ఏం ఉపయోగం?
ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి నుంచి ఓ విద్యార్థి పాస్‌ సర్టిఫికెట్‌తో బయటపడితే.. లేదా కేవలం పాస్‌ మార్కులతో బయటకు వస్తే ఆ విద్యార్థికి మరో 50 ఏళ్ల పాటు భవిష్యత్తు ఏమిటి? పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల విద్యార్థుల మార్కులు గొప్పగా ఉంటే, పరీక్షలు జరపకుండా కేవలం పాస్‌ మార్కులతో, ఆ సర్టిఫికెట్లతో మన పిల్లలు ఉంటే వారికి గొప్ప కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయన్నది ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలు నిర్వహించకపోతే ఉత్తీర్ణులైనట్లు కేవలం పాస్‌ సర్టిఫికెట్‌ మాత్రమే ఇస్తారు. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్న వారితో ఈ విద్యార్థులు ఎలా పోటీ పడతారు? ఈ పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయి?

రద్దు చాలా సులభం అయినా..
పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. ప్రతి అడుగులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం. పిల్లల కోసం కష్టతరమైన మార్గం అయినా కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పిల్లలకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం. పిల్లలకు మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మరోసారి తెలియజేస్తున్నా. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రతీ తల్లికీ భరోసా ఇస్తున్నా.

ప్రతి విద్యార్ధి కోసమే నేను ఆలోచిస్తున్నా... టె¯న్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుంటే వారి భవిష్యత్తుకే నష్టం. పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టమే అయినా పిల్లల కోసం కష్టతరమైన మార్గాన్ని ఎంచుకున్నాం. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రతి తల్లికీ భరోసా ఇస్తున్నా.
– సీఎం వైఎస్‌ జగన్‌

ఇబ్బంది లేకుండా ఎంబీబీఎస్‌
మా నాన్న అనారోగ్యంతో మంచానికే పరిమితమైనా మెడిసిన్‌ చదువుకోగలుగుతున్నానంటే సీఎం జగన్‌ తెచ్చిన పథకాలే కారణం. ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు మొదటి రెండేళ్లు రూ.10 వేలు వచ్చాయి. ఇప్పుడు జగనన్న వసతి దీవెన ద్వారా రూ.20 వేలు వచ్చాయి.
– ఇష్రత్‌ ఫర్హీన్, ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్, రంగరాయ మెడికల్‌ కాలేజి, కాకినాడ
Published on 4/29/2021 3:26:00 PM

సంబంధిత అంశాలు