Sakshi education logo
Search Bar

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏపీ సిద్ధం: మంత్రి ఆదిమూలపు సురేష్‌

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.
Education News విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, గత ఏడాది కూడా కోవిడ్‌ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌తోపాటు మంత్రులు స్మృతి ఇరానీ, సంజయ్‌ ధోత్రే, ప్రకాష్‌ జవదేకర్, గోవా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. 12వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రన్స్‌ టెస్టుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పలు అంశాలను వివరించారు.

ఏపీ ఇంటర్‌– 2021 పరీక్షల మోడల్‌ క్వశ్చన్‌ పేపర్స్, ప్రిపరేషన్‌ గైడెన్స్, స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి. 

‘కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేపట్టాం. పరీక్షల నిర్వహణలో ఒక విధానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఏదైనా ఆదేశాలు వస్తాయని భావించాం. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటేషన్‌తోపాటు ప్రతి చోటా ఒక ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. విద్యా రంగం ప్రాధాన్యత దృష్ట్యా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ బోధన, ఉపాధ్యాయులకు శిక్షణతోపాటు సిలబస్‌ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. పరీక్షలు నిర్వహించే ముందే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ల కోటాను కేంద్రం పెంచాలి’ అని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.

చదవండి: ఇంటర్‌ పరీక్షలపై ఆందోళన వద్దు.. సెకండియర్‌పై దృష్టి పెట్టండి: ఇంటర్‌ బోర్డు సైకాలజిస్టుల సూచనలు
Published on 5/24/2021 2:27:00 PM

సంబంధిత అంశాలు