Sakshi education logo
Search Bar

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్‌ చేయండి!

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది.
Education News ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్‌లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్‌ చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి కేబినెట్‌ సమావేశం ముందుంచడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉంది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఆన్‌లైన్‌/డిజిటల్‌ క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది.
Published on 6/8/2021 1:44:00 PM

సంబంధిత అంశాలు