Sakshi education logo
Search Bar

జూన్‌16 నుంచి ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ తరగతులు!

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఆన్‌లైన్‌ తరగతులను ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.
Education News తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ మార్కుల కేటాయింపు ఇలా..

అలాగే పాఠశాలల్లో కూడా డిజిటల్‌/ ఆన్‌లైన్‌ బోధనను ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే 16వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే జూలై 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందుగా 6 నుంచి 10 తరగతులకు డిజిటల్‌/ఆన్‌లైన్‌ విద్యను ప్రారంభించాలా.. లేదంటే ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించాలా అన్నదానిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశముంది. అయితే ముందుగా ఇంటర్మీడియట్‌తో పాటు పదో తరగతికి డిజిటల్‌/ఆన్‌లైన్‌ బోధనను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణ ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌ సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్స్, ప్రిపరేషన్‌ గైడెన్స్, ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.
Published on 6/11/2021 12:56:00 PM

సంబంధిత అంశాలు