Sakshi education logo

జాతీయ యువజన అవార్డులు ప్రధానం

Join our Community

facebook Twitter Youtube
2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులను ఆగస్టు 12న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రధానం చేశారు.
Current Affairsతెలంగాణ నుంచి ఒద్దిరాజు వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టెం వెంకటేష్, పృథ్వీ గొల్ల ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు అందుకున్నవారికి రూ.50 వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అందజేశారు. దేశవ్యాప్తంగా 20 మంది యువజన అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ రంగాల అభివృద్ధి, సామాజిక సేవారంగంలో కృషికి గుర్తింపుగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ యువజన అవార్డులను ఇస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులు ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published on 8/13/2019 5:28:00 PM

సంబంధిత అంశాలు